నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపిన ట్రిపుల్ మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. 19 ఏళ్ల యువకుడు గంధం శ్రీకాంత్ ఈ హత్యలకు పాల్పడ్డాడని పోలీసులు నిర్థారించారు. స్క్రాప్ ను కలెక్ట్ చేసి అమ్ముకునే వృత్తి చేసే శ్రీకాంత్.. డబ్బులు కోసం ఈ హత్యలు చేశాడని పోలీసులు వివరించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితున్ని పట్టుకున్నామని సీపీ కార్తికేయ తెలిపాడు. శ్రీకాంత్ కు చిన్నప్పటి నుంచి నేర చరిత్ర ఉందని పోలీసులు వెల్లడించారు. నిందితుడు బాలనేరస్థుడిగా బోస్టల్ స్కూల్ లో శిక్ష అనుభవించాడని తెలిపారు. ఇతడు వరుస దొంగతనాలకు పాల్పడుతున్నాడని తెలిపారు. ఈ నెల 8న నిందితుడు శ్రీకాంత్ డిచ్ పల్లిలో హార్వెస్టార్ మెకానిక్ షేడ్ లో ముగ్గురిని హత్య చేశాడన్నారు. గత 3 రోజులుగా నిందితుని కోసం పోలీసులు గాలించారు. చనిపోయిన వ్యక్తుల నుంచి నగదు, సెల్ ఫోన్లు చోరీ చేసి పరారయ్యాడని పోలీసులు తెలిపారు. 


Also Read: సలాం చెప్పలేదని యువకుడిపై ఎమ్ఐఎమ్ ఎమ్మెల్యే దౌర్జన్యం... సీసీటీవీలో రికార్డైన దాడి దృశ్యాలు


దేవాలయాల్లో హుండీలు చోరీ


దేవాలయాల్లో హుండీలు దొంగతనం చేస్తున్న ఓ ముఠాను గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి నగదు, హుండీలు, ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురు నిందితుల్లో ఇద్దరు మైనర్లుగా గుర్తించారు. ఈ ముఠాలో పరారీలో ఉన్న ఓ వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. గుంటూరు జిల్లాలో దేవాలయాలను టార్గెట్ చేసి హుండీల చోరీలకు పాల్పడుతున్న ఏడుగురిని నల్లపాడు పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠాకు మొత్తం 23 కేసుల్లో ప్రమేయమున్నట్లు పోలీసులు గుర్తించారు. తోకలవానిపాలేనికి చెందిన వీరంతా చెడు వ్యసనాలకు బానిసై ముఠాగా ఏర్పడి దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్నట్లు గుంటూరు అర్బన్ ఎస్పీ హఫీజ్ వెల్లడించారు. ఈ ముఠా ఇప్పటి వరకు 23 చోట్ల దొంగతనాలు చేశారు. ఒక ఆటోలో వచ్చి కట్టర్​తో ఆలయాల్లోని హండీలు కట్ చేసి ఎత్తుకెళ్తారు. 


Also Read: మాజీ ఐఏఎస్ ఇంట్లో సీఐడీ సోదాలు.. ఇంటి ముందు టీడీపీ నేతలు-పోలీసుల మధ్య ఉద్రిక్తత


Also Read: సెలైన్ బాటిల్‌లో విషం ఎక్కించిన డాక్టర్.. దాన్ని తన చేతికే పెట్టుకొని..


Also Read:  కెమికల్స్ పరిశ్రమలో క్లోరిన్ గ్యాస్ లీక్... యజమాని మృతి, 13 మంది కార్మికులకు అస్వస్థత


Also Read: ఏపీలో శాంతి భద్రతలు దిగజారాయి... తిక్కారెడ్డిపై దాడి ఘటనపై డీజీపీకి చంద్రబాబు లేఖ


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి