హైదరాబాద్ పాతబస్తీలో ఎమ్ఐఎమ్ ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ దౌర్జన్యానికి దిగారు. చార్మినార్ బస్ డిపో సమీపంలో యువకుడిపై ఎమ్ఐఎమ్ ఎమ్మెల్యే దాడికి దిగారు. ఎమ్మెల్యే కనిపిస్తే సలాం పెట్టలేదని అంటూ ముంతాజ్ ఖాన్ హంగామా చేశారు. గల్లీలో కూర్చొన్న యువకుడిపై ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ చేయిచేసుకున్నారు. ఎమ్మెల్యే దాడిపై బాధిత యువకుడు గులామ్ గౌస్ జీలానీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. తనకు ఎడమ చెవి దవడ భాగంలో గాయాలు అయినట్లు ఉస్మానియా వైద్యులు ఇచ్చిన రిపోర్ట్ ను తన ఫిర్యాదుకు జోడించారు. ఎమ్మెల్యే దాడిపై ఇప్పటి వరకు పోలీసులు కేసు నమోదు చేయలేదని బాధిత యువకుడు వాపోతున్నాడు. ఎమ్ఐఎమ్ ఎమ్మెల్యే కావడంతో కేసు నమోదు చేయడంలేదని ఆరోపిస్తోంది. ఎమ్మెల్యే దాడి దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. గతంలో జీలానీ సోదరుడికి ఎమ్మెల్యే తనయుడికి ఓ ప్రొపర్టీ విషయంలో గొడవలు జరిగినట్లు తెలుస్తోంది. దాడికి పాల్పడ్డ ఎమ్మెల్యే ఇల్లు బాధితుని ఇల్లు సమీపంలోనే ఉండడంతో... జీలానీ ఇంటి వద్దకు ఎంఐఎం కార్యకర్తలు పెద్దఎత్తున చేరుకున్నారు. దీంతో చార్మినార్బస్టాండ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
Also Read: మాజీ ఐఏఎస్ ఇంట్లో సీఐడీ సోదాలు.. ఇంటి ముందు టీడీపీ నేతలు-పోలీసుల మధ్య ఉద్రిక్తత
సలామ్ చెప్పలేదని కొట్టాడు
ఎమ్మెల్యే ఖాన్ తన ఇంటి సమీపంలోనే ఉంటాడని బాధిత యువకుడి గులామ్ గౌస్ జీలానీ చెబుతున్నారు. ఎమ్మెల్యేతో ఇంతకు ముందు జరిగిన వివాదాన్ని ప్రస్తావిస్తూ, అర్ధరాత్రి దాటిన తర్వాత చార్మినార్ బస్టాండ్‌లోని తన ఇంటి దగ్గర తాను కూర్చున్నప్పుడు, ఖాన్ తన సాయుధ గార్డులతో వచ్చి తనను కొట్టాడని జిలానీ ఆరోపించారు. "నేను సలామ్ చెప్పలేదని అతను అంటున్నాడు. నేను అతనికి ‘సలామ్’ ఎందుకు చెప్పాలి? నేను అతనిని కూడా చూడలేదు. తాను 25 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నానని చెబుతూనే ఉన్నారు. నన్ను చీల్చివేస్తానని బెదిరించాడు, అతని మేనల్లుడు నన్ను కాల్చివేస్తానన్నాడు'. అని గులామ్ గౌస్ జీలానీ చెప్పారు. స్థానిక ఎమ్మెల్యేపై తాను గతంలో ఎమ్ఐఎమ్ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని సంప్రదించానని జీలానీ చెప్పారు. ఈ విషయాన్ని పరిష్కరిస్తానని ఆయన చెప్పారన్నారు.
Also Read: జగనన్న ఉన్నాడు జాగ్రత్త... గుంతల రోడ్డుపై ఫ్లెక్సీ... వైరల్ అవుతున్న వీడియో
దాడి దృశ్యాలు సీసీటీవీలో నమోదు
జీలాని కుటుంబానికి కూడా ఎమ్ఐఎమ్ పార్టీతో సంబంధాలు ఉన్నాయి. జీలానీ సోదరుడు ఎమ్ఐఎమ్ పార్టీ కార్యకర్తే. ముంతాజ్ ఖాన్‌ను పార్టీ నుంచి తొలగించాలని ఒవైసీకి విజ్ఞప్తి చేశారు జీలానీ. అతనేమీ దేవుడు కాదు ప్రతీసారి పలకరించడానికి అని ఆయన అన్నారు. గతంలో కూడా తాను ఫిర్యాదు చేశానని కానీ ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని గౌస్ జీలానీ అంటున్నారు. సీసీటీవీ ఫుటేజీలో ఎమ్మెల్యే జీలానీ వద్దకు వెళ్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఆ తర్వాత జరిగిన వాగ్వాదం ఏమిటంటే, ఇద్దరూ వాదించుకోవడం కనిపించింది. ఎమ్మెల్యే అప్పుడు జీలానీని చెంపదెబ్బ కొట్టారు. ఎమ్మెల్యే భద్రతా సిబ్బంది జీలానీ నెట్టడం సీసీ కెమెరాలో కనిపించింది. ఎమ్మెల్యే... జీలానీని మళ్లీ కొట్టడానికి ముందుకు వస్తుంటే ఇతరులు అతన్ని దూరంగా లాగారు. సీసీ టీవీలో ఆ దృశ్యాలు నమోదయ్యాయి.
Also Read: కొడుకు పెళ్లి కోసం ఊరికి రోడ్డు... ఓ తండ్రి ఆలోచనపై గ్రామస్తుల హర్షం