కర్నూలు జిల్లా కోసిగి మండలం పెద్ద బొంపల్లిలో శనివారం ఆంజనేయస్వామి రథోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన టీడీపీ నేత పి.తిక్కారెడ్డిని.. వైసీపీ వర్గీయులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య వాగ్వాదం జరిగింది. ఇరు వర్గాల వారు పరస్పరం కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో సుమారు ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. టీడీపీ నేత తిక్కారెడ్డి తన గ్రామానికి రాకూడదని వైసీపీ వర్గీయులు అడ్డుకున్నట్లు తెలుస్తోంది. దీంతో పెద్ద బొంపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామంలో పోలీసు బలగాలను మోహరించారు.


Also Read: చంద్రబాబు చూడాల్సింది అఖండ మూవీ కాదు జస్టిస్ చంద్రు వీడియో... ప్యాకేజీకి ఓకే చెప్పినప్పుడే హోదా కనుమరుగు


డీజీపీకి చంద్రబాబు లేఖ


ఈ ఘటనపై స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. తిక్కారెడ్డిపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డీజీపీ గౌతం సవాంగ్‌కు చంద్రబాబు లేఖ రాశారు. బొంపల్లె ఆలయానికి వెళ్లిన తిక్కారెడ్డిపై వైసీపీ నేతలు దాడి చేశారని ఆరోపించారు. ఈ ఘటనలో ఐదుగురు టీడీపీ కార్యకర్తలు గాయాలైనట్లు వివరించారు. రాష్ట్రంలో వైసీపీ వర్గీయుల అరాచకాలను అడ్డుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఈ దాడికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తిక్కారెడ్డికి భద్రత కల్పించాలని చంద్రబాబు కోరారు. గతేడాది ఫిబ్రవరిలోనూ తిక్కారెడ్డిపై వైసీపీ నేతలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని చంద్రబాబు డీజీపీకి రాసిన లేఖలో ప్రస్తావించారు. అయినా పోలీసులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదన్నారు. తిక్కారెడ్డికి ఏదైనా ప్రమాదం జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా దిగజారాయని చంద్రబాబు ఆరోపించారు. 


Also Read: లాన్స్ నాయక్ సాయితేజ కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం


దాడిపై స్పందించిన తిక్కారెడ్డి


ఈ ఘటనపై స్పందించిన టీడీపీ నేత తిక్కారెడ్డి.. వైసీపీ వర్గీయులు తనపై దాడి చేశారని ఆరోపించారు. ఈ దాడిలో ఆరుగురు టీడీపీ కార్యకర్తలకు తీవ్రగాయాలయ్యాయని తిక్కారెడ్డి తెలిపారు.


Also Read:  నెల్లూరులో టీడీపీ కట్టప్పలకు చంద్రబాబు మొట్టికాయలు.. జీరో స్కోరేంటని ఆగ్రహం..!


Also Read: ఆవేశంలో ఉన్నప్పుడు ఏదైనా జరుగుద్ది.. కాన్వాయ్ తీసేసి తిరుగుతా, లోకేశ్ దమ్ముంటే రా.. మంత్రి అనిల్ సవాల్


Also Read: టీడీపీ ఆఫీసులపై దాడులను ఖండించిన పవన్ కల్యాణ్... ఈ దాడులపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని కీలక వ్యాఖ్యలు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి