నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణపై బీజేపీ అధినాయకత్వం దృష్టి సారించిందని అన్నారు. వచ్చే రోజుల్లో తెలంగాణలో మరిన్ని సంచలనాలు చూడబోతున్నారంటూ అర్వింద్ వ్యాఖ్యానించారు. పార్టీ ఆదేశిస్తే అసెంబ్లీకి కూడా పోటీ చేస్తానని ధర్మపురి అర్వింద్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య పొత్తు కుదిరే అవకాశం ఉందని అర్వింద్ జోస్యం చెప్పారు. హైదరాబాద్‌లో ఆదివారం ధర్మపురి అర్వింద్ మీడియాతో మాట్లాడారు. ఇటీవల ఈడీ నోటీసుల భయంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి పరుగు పెట్టారని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో కాంటాక్ట్‌లోనే ఉన్నారని, ఎవరు బీజేపీలోకి వస్తామన్నా చేర్పించుకొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
శనివారం ఎంపీ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డిలపై విరుచుకుపడ్డారు. వారిని ఉద్దేశించి తీవ్ర వాఖ్యలు చేశారు. కుండలు పెట్టి, బిందెలు నొక్కుడులో మంత్రి ప్రశాంత్ రెడ్డికి గోల్డ్ మెడల్ ఇవ్వొచ్చని అర్వింద్ ఎద్దేవా చేశారు. ‘తెలంగాణలో ప్రజలకు ఏమైనా చేస్తున్నారా అని అడిగితే పింఛన్లు ఇస్తున్నామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అంటాడు.. అయన మరి రైతులకు ఏమైనా చెయ్యమంటే కేంద్రం చేయట్లేదు అంటాడు. కుండలు పెట్టి.. బిందెలు నొక్కుడులో ఆయనకు గోల్డ్ మెడల్ ఇవ్వొచ్చు..’ అని అర్వింద్ సెటైర్లు వేశారు. అర్వింద్ మాట్లాడారు.
వేముల ప్రశాంత్ రెడ్డికి ఓట్లు వేయడం ప్రజల ఖర్మ అని ఎంపీ అర్వింద్ కామెంట్ చేశారు. తనను గెలిపించిన బాల్కొండ ప్రజలను మరిచిపోయి ఎమ్మెల్సీ కవితను ప్రసన్నం చేసుకోవాడానికి అమె చుట్టూ తిరుగుతున్నారని అర్వింద్ ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ కాళ్లు మొక్కే బదులు తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్ చుట్టూ తిరగడానికి గంట సమయం పడుతుందని, అందుకు కారణం మంత్రి వేములేనని ఆరోపించారు. కేంద్రం రైల్వే ద్వారా నిధులు ఇచ్చినా మాధ వనగర్ ఆర్ఓబీ పనులను ఎందుకు ప్రారంభించలేదో ప్రజలకు చెప్పాలని మంత్రిని ఎంపీ అర్వింద్ డిమాండ్ చేశారు.
కేసీఆర్‌పైనా విమర్శలు
70 వేల పుస్తకాలు చదివిన కేసీఆర్ కేంద్రం పెట్టమన్న చోట ఎలా సంతకం పెట్టాడని అన్నారు. అవన్నీ తప్పుడు మాటలని ఖండించారు. గతంలో పంటల మార్పిడి అని రైతులను ఆగం చేశాడని.. మొక్కజొన్న పంట వేయెద్దని, ఇప్పుడు వరి వేయొద్దని అంటున్నారని విమర్శించారు.
Also Read: Hyderabad: సెలైన్ బాటిల్‌లో విషం ఎక్కించిన డాక్టర్.. దాన్ని తన చేతికే పెట్టుకొని..
Also Read: Bandi Sanjay: తెలంగాణలో తాగు-తాగించు పథకాలు... కేసీఆర్ పాలనలో మంత్రులకు పవర్ ఉండదు...
Also Read: 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం... టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి