హైదరాబాద్‌లోని అమీర్ పేట్‌లో ఓ యువ డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. సెలైన్ బాటిల్‌లోకి విషపు ఇంజెక్షన్ ఇచ్చి, ఆ బాటిల్‌ను తన శరీరానికి పెట్టుకున్నాడు. దీంతో కాసేపటికే అతను మరణించాడు. అయితే, ఈ 29 ఏళ్ల యువ వైద్యుడు ఆత్మహత్య చేసుకోవడం పట్ల అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇతను ఒంటరిగా జీవిస్తుండడంతో కుంగుబాటుకు గురై ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి వివరాలివీ..
ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కడప జిల్లా బద్వేలుకు చెందిన రాజ్ కుమార్ అనే 29 ఏళ్ల డాక్టర్ బీకే గూడ మున్సిపల్ పార్కు సమీపంలో నివాసం ఉంటున్నాడు. ఇతను అమీర్ పేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో డాక్టర్‌గా పని చేస్తున్నాడు. శుక్రవారం రోజు తన రూంలోనే ఉన్న డాక్టర్ రాజ్ కుమార్ తన స్నేహితుడితో మనసేం బాగోలేదని చెప్పాడు. ఫోన్ చేసి చాలా నిరాశతో మాట్లాడాడు.
కొద్దిసేపు అయిన తర్వాత మళ్లీ స్నేహితుడు తిరిగి డాక్టర్ రాజ్ కుమార్‌కు ఫోన్ చేయగా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. దీంతో ఈయన రాజ్ కుమార్ పని చేసే ఆస్పత్రిలోనే మరో వైద్యుడు శ్రీకాంత్‌కు సమాచారం అందించాడు. డాక్టర్ శ్రీకాంత్ వెంటనే రాజ్ కుమార్ ఇంటికి వచ్చి చూడగా సెలైన్ బాటిల్ చేతికి పెట్టుకుని మంచంపై పడుకొని కనిపించాడు. అతను అప్పటికే అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. సెలైన్ తీసేసి, ఆస్పత్రికి తరలించగా అతను అప్పటికే చనిపోయినట్లుగా డాక్టర్లు తేల్చారు. దీంతో అతని కుటుంబ సభ్యులకు సమారం ఇవ్వగా.. వారు హైదరాబాద్‌కు చేరకున్నారు. రాజ్ కుమార్ తండ్రి సుబ్బారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు రాజ్ కుమార్ ఉంటున్న ఇంటిని పూర్తిగా పరిశీలించారు.
Also Read: Hyderabad: మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీసిన ఓనర్ కొడుకు.. మూడు నెలలుగా ఇదే పని!
Also Read: Hyderabad: నా భర్త సైకోలా వేధించాడు... సూసైడ్ నోట్ రాసి ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్య
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి