మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్తను ఓ భార్య రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుంది. హైదరాబాద్ లోని జగద్గిరిగుట్టలో ఈ ఘటన చోటుచేసుకుంది. మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న భర్తను సదరు మహిళతో ఉండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించింది. జగద్గిరిగుట్టకు చెందిన అనిల్ మరో మహిళతో సంబంధం పెట్టుకుని కుత్బుల్లాపూర్ బ్యాంక్ కాలనీలో మకాం పెట్టాడు. భర్త తీరుపై అనుమానం వచ్చిన భార్య తన భర్తను బంధువుల సాయంతో పట్టుకుంది. అనంతరం భర్తకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. 


Also Read : సెలవుల కోసం తోటి విద్యార్థులు తాగే నీళ్లలో విషం..అందరూ తాగేశారు ! తర్వాత ఏమయిందంటే ?



Also Read: బాస్‌పై కోపంతో ఆఫీస్‌ను తగలబెట్టేసిన ఉద్యోగిని.. కోట్లలో నష్టం!


రెండేళ్లుగా సహజీవనం


హైదరాబాద్ జగద్గిరిగుట్టకు చెందిన అనిల్ విద్యుత్ సంస్థలో ఉద్యోగి. ఏడేళ్ల క్రితం రామేశ్వరి అనే మహిళతో వివాహం జరిగింది. వారికి ఓ బిడ్డ ఉంది. అదనపు కట్నం కోసం రామేశ్వరిని వేధించేవాడని తెలుస్తోంది. ఇదిలా ఉంటే మరో మహిళతో కూడా సీక్రెట్ గా సంబంధం కొనసాగిస్తున్నాడు అనిల్. అక్రమ సంబంధం ఏర్పరుచుకుని రెండేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. కట్టుకున్న భార్యకు అనుమానం రాకుండా కుత్బుల్లాపూర్ బ్యాంక్ కాలనీలో నివసిస్తున్నాడు. ఇటీవల విషయం తెలుసుకున్న భార్య రామేశ్వరి శనివారం తెల్లవారు జామున పోలీసుల సహకారంతో  రెడ్ హ్యాండెడ్ గా భర్తను వేరే మహిళలో ఉండగా పట్టుకుంది. తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను వేడుకుంది. 


Also Read:  అరే ఏంట్రా ఇది...పెరుగు కోసం రైలు ఆపేశారు... వీడియో వైరల్ లోకో పైలట్ సస్పెండ్


Also Read: నాడు ఆంధ్రా యూనివర్సిటీ స్టూడెంట్.. నేడు పెన్సిల్వేనియా వర్సిటీ తొలి మహిళా ప్రెసిడెంట్‌


Also Read: సోలార్ ప్లాంట్ పేరుతో సౌదీ స్నేహితులకు కుచ్చుటోపీ... ప్లాంట్ పెట్టకుండా రూ.12 కోట్లు కొట్టేశాడు


Also Read: Wife Call Recording Crime : భార్య ఫోన్ కాల్‌ను అనుమతి లేకుండా రికార్డ్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసా ? ఇదిగో పంజాబ్- హర్యానా హైకోర్టు తీర్పు !


Also Read : సైనికుడు మిలటరీలో ఉన్నంతవరకే కాదు.. జీవితాంతం యోధుడే


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి