ఏదైనా అవసరానికి వాహనాన్ని రోడ్డు పక్కన ఆపడం మీరు చూసే ఉంటారు. కానీ పెరుగు కోసం ఏకంగా రైలు ఆపిన ఘటన పాకిస్తాన్ లో చోటుచేసుకుంది. పాకిస్తాన్ లోని లాహోర్‌ రైల్వే స్టేషన్ కు సమీపంలో మంగళవారం పెరుగు కొనుగోలు చేసేందుకు రైలు ఆపాడు లోకోపైలెట్. ఈ వీడియో వైరల్ అయ్యింది. దీంతో లోకో పైలట్, అతని సహాయకుడిని సస్పెండ్ చేసినట్లు పాకిస్తాన్ రైల్వే మంత్రి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. లాహోర్ కహ్నా కచా రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఆపి లోకో పైలట్ పెరుగు కొనుగోలు చేశాడు. దీనిని స్థానికులు వీడియో తీశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాకిస్తాన్ రైల్వే మంత్రి అజం ఖాన్ స్వాతి వారిని సస్పెండ్ చేయాలని ఆదేశించినట్లు డాన్ వార్తాపత్రిక తెలిపింది. 


Also Read: పేరుకే 'బ్లాక్ బాక్స్'.. కానీ కలర్, కథ వేరుంటది.. నిజం తేలాలంటే ఇదే కావాలి!






లోకో పైలట్, సహాయకుడు సస్పెండ్


ఈ వీడియో వైరల్ అవ్వడంతో ప్రయాణికులు రైల్వే శాఖపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రమాదాలు, ప్రయాణికుల భద్రత, ఇతర కారణాలతో రైళ్లు గమ్యస్థానాలకు ఆలస్యంగా నడుస్తున్నాయని ఆరోపిస్తున్నారు. దీంతో రైలు డ్రైవర్ రాణా మహ్మద్ షెహజాద్, సహాయకుడు ఇఫ్తికార్ హుస్సేన్‌ పై చర్యలు తీసుకోవాలని అధికారులను రైల్వే మంత్రి ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలను పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎవరైనా జాతీయ ఆస్తులను వ్యక్తిగత అవసరాల కోసం ఉపయోగించడాన్ని సహించనని మంత్రి ఒక ప్రకటనలో హెచ్చరించారు. రైలు సిబ్బంది(ముఖ్యంగా లోకో పైలట్, సహాయకుడు)ని ట్రాక్ చేస్తూ ఉండాలని సంబంధిత డివిజనల్ హెడ్‌లను ఆదేశించారు. ఎవరైనా ఆదేశాలను ఉల్లంఘిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే ప్రయాణ సమయంలో లోకోమోటివ్ డ్రైవర్లు, సహాయకులు మొబైల్ ఫోన్‌లను ఉపయోగించడంపై నిషేధం విధించినట్లు ఓ నివేదిక తెలిపింది. సిబ్బంది అన్ని రైళ్లలో సెల్ఫీలు తీసుకోవడం, వీడియో, ఆడియో సందేశాలు ఫోన్‌లలో రికార్డ్ చేయడం నిషేధించారు. 


Also Read:  ఆ కేసులో మూడేళ్ల తర్వాత జైలు నుంచి సుధా భరద్వాజ్ విడుదల


Also Read: వారానికోసారి బోన్ సూప్, పోషకాహార లోపాన్ని తీర్చేస్తుంది, ఎలా చేయాలంటే...


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి