విజయవాడ బందరు రోడ్డులో అట్టిక బంగారం దుకాణంలో జరిగిన చోరీని రెండు గంటల్లోనే పోలీసులు ఛేదించారు. చోరీ ఘ‌ట‌న‌లో ఇంటి దొంగను ఖాకీలు అరెస్ట్ చేశారు. అట్టిక గోల్డ్ దుకాణంలో ప‌ని చేసే మేనేజ‌ర్ చేతివాటం ప్రద‌ర్శించి బంగారాన్ని, న‌గ‌దును స్వాహా చేసేందుకు ప్రయ‌త్నించాడ‌ని విజయవాడ సీపీ కాంతి రాణా టాటా వెల్లడించారు. దొంగతనం వెలుగులోకి వ‌చ్చిన 2 గంట‌ల వ్యవ‌ధిలోనే కేసు న‌మోదు చేసి, ద‌ర్యాప్తుతో అస‌లు నిందితుల‌ను అరెస్ట్ చేశామ‌ని ఆయ‌న చెప్పారు.


Also Read: రెండేళ్లుగా మరో మహిళతో సీక్రెట్ సహజీవనం... సీన్ కట్ చేస్తే భార్యకు రెడ్ హ్యాండెడ్ గా దొరికేశాడు...



Also Read:   సెలవుల కోసం తోటి విద్యార్థులు తాగే నీళ్లలో విషం..అందరూ తాగేశారు ! తర్వాత ఏమయిందంటే ?


45 రోజులుగా ప్లాన్


విజయవాడ అట్టిక గోల్డ్ ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ చంద్రశేఖర్ ఈ దొంగతనం చేసినట్టు నిర్ధారించామ‌ని నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా తెలిపారు. నిందితుల వద్ద నుండి రూ.60 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామ‌ని అన్నారు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ అట్టిక గోల్డ్ ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ చంద్రశేఖర్ గత 45 రోజుల నుంచి పథకం ప్రకారం తాక‌ట్టులో ఉన్న బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు దొంగిలించేందుకు ప‌క్కా ప్లాన్ వేశాడ‌ని అన్నారు. మారు తాళాలు కూడా త‌యారు చేయించి, లాక‌ర్లు ఓపెన్ చేసి దొంగ‌త‌నం చేసిన‌ట్లుగా త‌మ విచార‌ణ‌లో చంద్రశేఖ‌ర్ ఒప్పుకున్నాడ‌ని సీపీ వెల్లడించారు. చంద్రశేఖ‌ర్ పై గ‌తంలో కూడా ఒక కేసు ఉంద‌ని తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంగా కేసును ఛేదించామ‌ని అన్నారు.


Also Read: బాస్‌పై కోపంతో ఆఫీస్‌ను తగలబెట్టేసిన ఉద్యోగిని.. కోట్లలో నష్టం!


చెడ్డీ గ్యాంగ్ కోసం స్పెషల్ టీమ్స్


బెజ‌వాడ‌లో క‌ల‌క‌లం సృష్టిస్తున్న చ‌డ్డీ గ్యాంగ్ ను ప‌ట్టుకునేందుకు ప్రత్యేక బృందాల‌ను రంగంలోకి దింపామ‌ని పోలీస్ క‌మిష‌న‌ర్ కాంతి రాణా టాటా తెలిపారు. ఇత‌ర రాష్ట్రాల‌కు పోలీసుల‌ను పంపామ‌ని అన్నారు. త్వర‌లోనే నిందితులను అరెస్ట్ చేస్తామని చెప్పారు. ప్రజ‌లు భ‌యాందోళ‌నకు గురి కావాల్సిన అవ‌స‌రం లేద‌ని సీపీ భ‌రోసా ఇచ్చారు. 


Also Read:   అరే ఏంట్రా ఇది...పెరుగు కోసం రైలు ఆపేశారు... వీడియో వైరల్ లోకో పైలట్ సస్పెండ్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి