ఉస్మానియా యూనివర్సిటీ ఫ్యాకల్టీ మెంబర్స్‌కు వైస్ ఛాన్స్‌లర్ రీసెర్చ్ అవార్డులను ఇవ్వనున్నట్లుగా ప్రకటించింది. మొదటి విడత అవార్డుల ప్రదాన కార్యక్రమం జనవరి 3న ఓయూ క్యాంపస్‌లోనే ఈ అవార్డుల కార్యక్రమం ఉంటున్నట్లుగా బుధవారం ఓయూ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ అవార్డులను మూడు కేటగిరీలుగా విభజించారు. ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్, కామర్స్, మేనేజ్‌మెంట్, లా ఎడ్యుకేషన్, ఓరియంటల్ కేటగిరీ 1లో చేర్చారు. ఇంజినీరింగ్, టెక్నాలజీ, ఇన్ఫర్మేటిక్స్, ఫార్మసీ వంటి వాటిని రెండో కేటగిరీలో చేర్చారు. మిగిలిన అన్ని శాఖలు మూడో కేటగిరీలో ఉంటాయి.
ఈ అవార్డులను వర్సిటీలో తొలిసారిగా ఏర్పాటు చేసి ఇస్తున్నారు. ప్రతి విభాగంలో ఒక అధ్యాపకుడికి ప్రశంసా పత్రం, సర్టిఫికేట్, నగదు బహుమతిని ఇస్తారు. సంబంధిత అధ్యాపకుల డీన్‌ల నేతృత్వంలోని నిపుణుల కమిటీ ద్వారా ఎవరికి అవార్డులు ఇవ్వాలనే వారి ఎంపిక జరుగుతుంది. 2020 డిసెంబర్ నుంచి 2021 నవంబర్ నెలాఖరు వరకూ డీన్లుగా వ్యవహరించిన వారు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. అవార్డుల కోసం దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ డిసెంబర్ 20.
ఇలా అవార్డులు ఇచ్చే కార్యక్రమ ఉద్దేశం గురించి ఓయూ వీసీ డాక్టర్ డి.రవీందర్ యాదవ్ వివరించారు. వర్సిటీ అధ్యాపకులు జాతీయ, అంతర్జాతీయంగా పీర్-రివ్యూడ్ జర్నల్స్‌లో ఉత్తమ పరిశోధనల పబ్లిషింగ్‌లో వెనుకబడి ఉన్నారని చెప్పారు. ‘‘రీసెర్చ్, టీచింగ్, ట్రైనింగ్ మా ప్రాధాన్యత. ఈ అవార్డులతో, మేము యువ పరిశోధకులను వారి పనిలో రాణించేలా ప్రోత్సహించాలనుకుంటున్నాం. ప్రఖ్యాత జర్నల్స్‌లో అధిక-ప్రభావ రీసెర్చ్ రిజల్ట్స్, పరిశోధన ప్రాజెక్ట్‌లను ప్రచురించాలని అనుకుంటున్నాం. నేను వీసీగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే అధ్యాపకులు అదే పనిలో ఉన్నారు’’ అని డాక్టర్ రవీందర్ యాదవ్ అన్నారు. జనవరి 3న కార్యక్రమంలో ఒక ఉపన్యాసం ఇవ్వడానికి, అవార్డులను అందించడానికి తాము ఒక ప్రముఖ శాస్త్రవేత్తను ఆహ్వానిస్తున్నట్లు ఆయన చెప్పారు.
Also Read: Visa Interview: అబ్బా.. చీ.. వీసా ఇంటర్వ్యూ మళ్లీ పోయింది.. ఎలా ప్రయత్నిస్తే బెటర్ అంటారు?
Also Read: ప్రపంచానికి చదువు చెప్పిన భారతదేశం.. ఈ యూనివర్శిటీలో ఫీజులు కట్టక్కర్లేదు, పరీక్షలు ఉండవు..
Also Read: ట్విట్టర్ నుంచి గుగూల్ సీఈవో వరకు అగ్రస్థానంలో ఉన్న.. ఐఐటీ, ఐఐఎమ్ గ్రాడ్యుయేట్లు వీళ్లే..