రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తోన్న ఆర్ ఆర్ ఆర్ సినిమా ట్రైల్ కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లు నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీలో ఆలియా భట్, అజయ్ దేవగణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరోవైపు హాలీవుడ్ నుంచి ఒలివియా మోరిస్, అలిసన్ డూడి, రే స్టీవెన్ సన్ వంటి స్టార్స్ కూడా ఈ ప్రాజెక్టులో భాగమయ్యారు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్ జోరు పెంచారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలై పోస్టర్స్, టీజర్, సాంగ్స్ అంచనాలు మరింత పెంచాయి. తాజాగా ట్రైలర్ విడుదలకు సిద్ధమవుతున్నారు మేకర్స్. గురువారం (డిసెంబర్ 9) ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్టు అఫీషియల్ గా చెప్పారు. అంతకన్నా ముందు స్పెషల్ పోస్టర్స్ తో ట్రైలర్ పై మరింత ఆసక్తి పెంచుతున్నారు.
ఇప్పటికే రామ్ చరణ్ కి సంబంధించి కొత్త గ్లింప్స్ ను ఎన్టీఆర్ రిలీజ్ చేయగా...తాజాగా ఎన్టీఆర్ కు సంబంధించిన బ్రేస్ యువర్ సెల్ఫ్ ఫర్ భీమ్ అంటూ చెర్రీ కొత్త గ్లింప్ ట్వీట్ చేశాడు.
రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా… కొమరం భీం గా ఎన్టీఆర్ నటిస్తున్నారు. సీత పాత్రలో కనిపించనున్న హీరోయిన్ అలియా భట్ కు సంబంధించిన మేకింగ్ వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. అలియా నుంచి ఆమె సీతగా మారేవరకూ చూపిస్తూ వీడియో షూట్ చేశారు.
RRRట్రైలర్ ను సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ తో పాటూ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లోని థియేటర్లలో ప్రదర్శించబోతున్నారట. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పుడు ట్రైలర్ తో అంచనాలు మరింత పెరిగేట్టే ఉన్నాయి.
Also Read:మరీ అంతలా తిట్టాలా? పద్ధతిగా చెప్పొచ్చుగా! - విడాకుల తర్వాత ట్రోల్స్‌పై సమంత స్పందన
Also Read: నెల రాజుని... ఇల రాణిని... కలిపింది కదా 'సిరివెన్నెల'! ఆయన చివరి సంతకం విన్నారా?
Also Read: డెసిషన్ మారలేదు... పుకార్లకు మరోసారి చెక్ పెట్టిన 'భీమ్లా నాయక్' ప్రొడ్యూసర్
Also Read: బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో డబుల్ హ్యాట్రిక్‌కు సన్నాహాలు?
Also Read: యంగ్ హీరోకి టైటిల్ కష్టాలు.. రూ.2 కోట్లు డిమాండ్ చేస్తోన్న నిర్మాత..
Also Read: ఒక్కసినిమా కూడా కలిసి చేయలేదు, కేవలం ఆ ఒక్క మాటతో ప్రేమలో పడ్డారు... విక్కీ-కత్రినా లవ్ స్టోరీ
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి