బుల్లితెరపై నవ్వులను పూయిస్తున్న షో ‘జబర్దస్త్’. ఈ షోలో సుధీర్ టీమ్‌కే క్రేజ్ ఎక్కువ. గెటప్ శ్రీను, సుధీర్, రామ్ ప్రసాద్ ముగ్గురు స్నేహితులు కలిసి ఒక గ్రూపుగా చేసే స్కిట్లు చాలా నవ్విస్తాయి. ముఖ్యంగా సుధీర్ పై వేసే పంచులు మామూలుగా ఉండవు. ఆ కార్యక్రమానికి వీరి టీమ్ చాలా అవసరమనే చెప్పుకోవాలి. కానీ ఆ టీమ్ ఇప్పుడు షోను విడిచి వెళ్లిపోబోతోందట. ఈ విషయాన్ని వారే ‘ఎక్స్ ట్రా జబర్దస్త్’ వేదికపై చెప్పారు. సుధీర్ స్పెషల్ స్కిట్ పేరుతో వారు కాసేపు హంగామా చేసి చివరలో ఈ విషయాన్ని తెలిపారు. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండవుతోంది.
ఫూల్స్ చేయడం అలవాటే...
జబర్దస్త్ లో చాలా సార్లు ప్రేక్షకులను ఫూల్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. గతంలో అనసూయపై యాంకర్ శివ వేదికపైనే కామెంట్లు చేయడం, దానికి అనసూయ అలిగి వెళ్లిపోవడం ప్రోమోలో చూపించారు. ఎపిసోడ్ లో చూస్తే మాత్రం అది కూడా స్కిట్ లో భాగమే అన్నట్టు చూపించారు. అలాగే సుధీర్ టీమ్ జబర్దస్త్ వీడి వెళ్లడం కూడా ఉత్తుత్తి పథకమేనా లేక నిజంగానే నిర్ణయం తీసుకున్నారో తెలియాలంటే ఎపిసోడ్ చూడాలి. కాకపోతే గత వారం రోజులుగా సుడిగాలి సుధీర్ టీమ్ జబర్దస్త్ ను విడిచి వెళుతోందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వాటికి సమాధానం ఇచ్చే క్రమంలో ఈ స్కిట్ చేశారేమో అన్న సందేహం కూడా రాకమానదు.
ప్రోమోలో ఏముంది?
వేదిక మీదకు వచ్చిన సుధీర్, శ్రీను, రామ్ ప్రసాద్ చాలా సీరియస్ గా కనిపించారు. గెటప్ శ్రీను మాట్లాడుతూ ‘చాలా రోజుల్నుంచి ముగ్గురం కలిసి జబర్దస్త్ కి....’ అంటూ ఎమోషనల్ అయ్యాడు. వెంటనే రామ్ ప్రసాద్ మాట్లాడుతూ ‘మేము ఏదైనా ఇంటర్య్వూ ఇచ్చి చెబుదామనుకున్నాం, కానీ ఈ స్టేజ్ మీద చెప్పాల్సి వస్తోంది. మమ్మల్ని క్షమించండి. ఇన్ని రోజులు మమ్మల్ని ఆదరించినందుకు... ’ అంటూ ముగ్గురు కన్నీళ్లు పెట్టుకున్నారు. తరువాత వేదిక దిగి వెళ్లిపోయారు. వీరి కథేంటో ఎపిసోడ్ ప్రసారమయ్యాక తేలిపోతుంది.
Read Also: ఒక్కసినిమా కూడా కలిసి చేయలేదు, కేవలం ఆ ఒక్క మాటతో ప్రేమలో పడ్డారు... విక్కీ-కత్రినా లవ్ స్టోరీ
Read Also: ఒక్క ముద్దు పెట్టు సిరి, నువ్వు సింగిల్ అయితేనా... షన్నూ సెన్సార్ ఎక్స్‌ప్రెషన్స్
Read Also: ఈ సెలెబ్రిటీ పెళ్లి ఓటీటీలో ప్రసారం కానుందా... వందకోట్ల డీల్ కుదిరిందా?
Also Read: మొబైల్ ఫోన్‌తో వైద్యులు తీసిన సినిమా... ప్రశంసలు అందుకుంటోంది