ప్రొడ్యూసర్, హీరో, డైరెక్టర్... సినిమాకు ఈ ముగ్గురే ప్రధానం. ఆ ముగ్గురూ వైద్యులే అయితే... అదే ‘ది రాంగ్ స్వైప్’ సినిమా ప్రత్యేకత. డయాబెటిస్ వ్యాధికి చికిత్స చేయడంలో ఆరితేరిన చేయి డాక్టర్ రవికిరణ్‌ది. సినిమా మీద ఆసక్తితో అతను డైరెక్టర్ గా మారి చేసిన సినిమా ఇది. అంతేకాదు తనతో మరో ఇద్దరిని కూడా సినిమా రంగం వైపు నడిపించారు. ఈ సినిమా నిర్మాత ప్రతిమా రెడ్డి, హీరోగా నటించి ఉదయ్ రెడ్డి కూడా వైద్యులే. అందుకే ముగ్గురు వైద్యులు తీసిన సినిమాగా పాపులర్ అయింది ‘ది రాంగ్ స్వైప్’. దీనికోసం ఖరీదైన కెమెరాలు వాడలేదు. కేవలం వన్ ప్లస్ 6టి మొబైల్ ఫోన్ తో తీశారు. అది కూడా చాలా తక్కువ బడ్జెట్‌తో. ఈ సినిమా చూసిన పలువురు టాలీవుడ్ ప్రముఖులు మొబైల్ ఫోన్ తో చాలా చక్కగా సినిమా తీశారంటూ చాలా మెచ్చుకుంటున్నారు. డైరెక్టర్ రవికిరణ్ మాట్లాడుతూ ‘ప్రశంసలు, వస్తున్న అవకాశాలను చూస్తుంటే తాము కూడా సినిమా రంగంలో రాణించగలం అన్న నమ్మకం వచ్చింది’ అని అన్నారు.
రెండో సినిమాకు రెడీ...
కోదండ రామిరెడ్డి, తమ్మారెడ్డి భరద్వాజ, మధుర శ్రీధర్ రెడ్డి వంటి సినిమా పెద్దలు తమ సినిమాను చూసినట్టు చెప్పారు రవికిరణ్. వాళ్లు సినిమాను చాలా మెచ్చుకున్నారని తెలిపారు. అందుకే తమ సినిమాను అందరూ ఆదరిస్తారన్న నమ్మకంతో రెండో సినిమా తీసేందుకు కూడా సిద్ధమవుతున్నట్టు తెలిపారు. ఈ సినిమా కూడా మొబైల్ ఫోన్‌తో తీస్తారట. ఈ సినిమాకు ‘6ఎమ్.పి’ అనే పేరు కూడా ఖరారు చేశారు. వీరు తమ ఉద్యోగాన్ని కొనసాగిస్తూనే ఒక పక్క సినిమాలు కూడా తీస్తున్నారు. వీకెండ్లలో షూటింగ్ చేస్తూ, మిగతా రోజులు వైద్యులుగా తమ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
Also Read: ఉపాసన చెల్లెలి పెళ్లికి తరలి వెళ్లిన మెగా కుటుంబం... దోమకొండలో భారీబందోబస్తు
Also Read: బాలయ్యతో ఆ సాయంత్రం అన్ స్టాపబుల్ అంటున్న ప్రిన్స్ మహేష్... ఎపిసోడ్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులు
Also Read: నేను పెడుతున్న స్టోరీస్ చూసి 'ఎన్నారైలు అందర్నీ జనరలైజ్ చేయకే ల....' అని వాగక్కర్లేదు - చిన్మయి
Also Read: అమ్మాయిలను ఎప్పుడూ అలా చూడలేదా? ఇతర మహిళలకు లేనిది ఏమైనా నాకుందా? - పాయల్ బోల్డ్ రియాక్షన్
Also Read: భీమ్... భీమ్... కొమరం భీమ్‌గా ఎన్టీఆర్ కొత్త పోస్టర్ చూశారా?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి