ప్రభాస్ హీరోగా టాలీవుడ్ లో తెరకెక్కిన 'ఛత్రపతి' సినిమాను ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ రీమేక్ తో బాలీవుడ్ లో పరిచయం కానున్నారు. తెలుగులో రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కించగా.. హిందీలో వి.వి.వినాయక్ డైరెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరుగుతోంది. 'ఛత్రపతి' కథలో కొన్ని కీలకమార్పులు చేసి.. ఈ తరం ప్రేక్షకులకు నచ్చే విధంగా స్క్రిప్ట్ ను సిద్ధం చేసుకున్నారు.
బాలీవుడ్ సినిమా కాబట్టి అక్కడి ఆడియన్స్ కు నచ్చే విధంగా కొన్ని ఎలిమెంట్స్ ను యాడ్ చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఈ సినిమా టైటిల్ విషయంలో సమస్య తలెత్తుతోంది. 'ఛత్రపతి' అనే టైటిల్ తోనే హిందీలో కూడా రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఆ టైటిల్ ను ఎవరో రిజిస్టర్ చేయించుకున్నారు. పోనీ 'శివాజీ' అనే టైటిల్ పెడదామా..? అంటే ఆ పేరుని కూడా వేరెవరో రిజిస్టర్ చేయించుకున్నారట.
ఈ రెండు టైటిల్స్ మాత్రమే సినిమాకి సూట్ అవుతాయని దర్శకుడు వినాయక్ భావిస్తున్నాడు. అందుకే 'ఛత్రపతి' టైటిల్ ను రిజిస్టర్ చేయించుకున్న నిర్మాతతో బేరసారాలు జరుపుతున్నారు. టైటిల్ వదులుకోవాలంటే.. సదరు నిర్మాత రూ.2 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట. దీంతో వినాయక్ అండ్ కో ఆలోచనలో పడింది. ఒక టైటిల్ కోసం రూ.2 కోట్లు ఖర్చు పెట్టడమనేది చిన్న విషయం కాదు.
టైటిల్ విషయంలో తెలుగు ఫిలిం ఛాంబర్ లో ఒక సదుపాయం ఉంది. టైటిల్ రిజిస్టర్ చేయించిన తరువాత ఆరు నెలల్లో సినిమా మొదలుపెట్టకపోతే.. ఆ టైటిల్ ను వేరే వాళ్లకు ఇచ్చేస్తారు. కానీ బాలీవుడ్ అలాంటి సదుపాయాలు లేవు. టైటిల్ రిజిస్టర్ చేయించుకున్న ఏడాది పాటు టైటిల్ దాచుకోవచ్చు. ఆ తరువాత రెన్యువల్ చేయించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. దీంతో చాలా మంది నిర్మాతలు ఇలా టైటిల్స్ అమ్ముకుంటూ క్యాష్ చేసుకుంటున్నారు.
Also Read: మరీ అంతలా తిట్టాలా? పద్ధతిగా చెప్పొచ్చుగా! - విడాకుల తర్వాత ట్రోల్స్‌పై సమంత స్పందన
Also Read: బ్రేకింగ్... ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రభాస్ కోటి రూపాయల విరాళం
Also Read: ఈ సెలెబ్రిటీ పెళ్లి ఓటీటీలో ప్రసారం కానుందా... వందకోట్ల డీల్ కుదిరిందా?
Also Read: అల్లు అర్జున్ ప్లాన్ ఫెయిల్ అవుతోందా? తప్పు ఎక్కడ జరుగుతోంది?
Also Read: కార్డియాక్ అరెస్ట్‌తో యంగ్ యూట్యూబర్ మృతి...
Also Read: 'ఎవడి యుద్ధం వాడిదే'.. పుష్పరాజ్ వచ్చేశాడు..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌చేయండి