యంగ్ యూట్యూబర్ శ్రియా మురళీధర్ ఇకలేరు. సోమవారం రాత్రి కార్డియాక్ అరెస్ట్‌తో మరణించారు. ఆమె వయసు 27 సంవత్సరాలే. చిన్న వయసులో కార్డియాక్ అరెస్ట్‌కు గురై ప్రాణాలు కోల్పోతుందని ఎవరూ ఊహించలేదు. శ్రియ హఠాన్మరణంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
శ్రియా మురళీధర్ యాంకర్, ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లూయెన్స‌ర్‌ కూడా! ఆమె స్వస్థలం హైదరాబాద్‌లోని ల‌క్డిక‌పూల్‌. నటన అంటే ఆమెకు ప్రాణం. అందుకని, ఆరోగ్య పరంగా తనకు ఎన్ని అవరోధాలు ఉన్నా... వాటిని దాటుకుని నటించడం మొదలు పెట్టారు. టీవీ హోస్ట్, యాంకర్ ప్రదీప్ మాచిరాజు 'పెళ్లి చూపులు' రియాలిటీ షోలో శ్రియ ఓ కంటెస్టెంట్. ఆ తర్వాత పలు షార్ట్ ఫిల్మ్స్‌లో నటించారు. 'బ్యూటీ అండ్ ద బాస్' సీజన్ 2లో ఓ పాత్ర చేశారు. 'వాట్ ద ఫన్' యూట్యూబ్ ఛాన‌ల్‌లో కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశారు.





శ్రియా మురళీధర్ మృతి పట్ల దీప్తీ సునయన, నటి సురేఖ కుమార్తె సుప్రియ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత శివ చెర్రీ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. కార్డియాక్ అరెస్ట్‌ రావడానికి వయసుతో సంబంధం లేదని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని, అందరూ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. 





బాయ్‌ఫ్రెండ్‌తో అమ్మ‌కి దొరికిపోతే??... శ్రియా మురళీధ‌ర్ న‌టించిన షార్ట్ ఫిల్మ్‌:


Also Read: 'ఎవడి యుద్ధం వాడిదే'.. పుష్పరాజ్ వచ్చేశాడు..
Also Read: మొబైల్ ఫోన్‌తో వైద్యులు తీసిన సినిమా... ప్రశంసలు అందుకుంటోంది
Also Read: 'సలార్' సినిమా రీషూటింగ్.. ఇంటర్వెల్ ఎపిసోడ్ పై స్పెషల్ ఫోకస్..
Also Read: పింకీకి బిగ్‌షాక్... మానస్‌ను తన పిల్లాడిలా చూసుకునేదాన్నంటూ ఏడుపు
Also Read: ఏంది సామి ఇది... ఛ! అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చిన 'పుష్ప' టీమ్
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి