ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి కోటి రూపాయల విరాళం ఇవ్వనున్నట్టు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వెల్లడించారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ను అనూహ్య వర్షాలు, వరదలు ముంచెత్తాయి. దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో ప్రజల జీవితం అస్తవ్యస్తం అయ్యింది. ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. వాళ్లను ఆదుకోవడానికి ప్రభుత్వానికి ప్రభాస్ కోటి రూపాయలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. త్వరలో ఈ మొత్తాన్ని ప్రభుత్వానికి అందజేయనున్నారు.
ప్రభాస్ భారీ మొత్తం విరాళం ఇవ్వడం ఇదే తొలిసారి ఏమీ కాదు. గతంలో కరోనా సమయంలో ప్రధానమంత్రి సహాయనిధికి... అటు ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు, ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి... మొత్తం 4.5 కోట్ల రూపాయలు విరాళంగా అందించారు. హైద‌రాబాద్‌ను భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌లు ముంచెత్తిన‌ప్పుడూ ఆయన విరాళం అందించారు. విపత్తులు ఏర్పడిన ప్రతిసారీ ప్రభాస్ తన గొప్ప మనసు చాటుకుంటూనే ఉన్నారు. తాజాగా మరోసారి కోటి రూపాయలు విరాళం ఇవ్వడంతో... ఆయనపై అభిమానులు, ప్రేక్షకులు, సాధారణ ప్రజానీకం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Also Read: కన్నీళ్లు పెట్టుకున్న పూజా హెగ్డే... ఆలోచనలో పడ్డ ప్రభాస్!
ప్రభాస్ సినిమాలకు వస్తే... 'రాధే శ్యామ్' సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. అందులో రెండు పాటలను ఇప్పటికే విడుదల చేశారు. ఇది కాకుండా 'ఆదిపురుష్', 'సలార్', 'ప్రాజెక్ట్ కె' సినిమాలు చేస్తున్నారు. 'ఆదిపురుష్' షూటింగ్ కంప్లీట్ చేశారు. 'సలార్' చిత్రీకరణ కొంత పూర్తి అయ్యింది. ప్రస్తుతం హైద‌రాబాద్‌లో 'ప్రాజెక్ట్ కె' చిత్రీకరణ జరుగుతోంది.
Also Read: ఏపీలో వరద బాధితులకు టాలీవుడ్ స్టార్స్ సాయం...
తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి రూ. 25 లక్షలు, ఆయన తనయుడు రామ్ చరణ్ రూ. 25 లక్షలు, సూపర్ స్టార్ మహేష్ బాబు రూ. 25 లక్షలు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ రూ. 25 లక్షలు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రూ. 25 లక్షలు ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు అందజేశారు. మరి కొంత మంది స్టార్స్ విరాళాలు ఇవ్వడానికి ముందుకు రానున్నట్టు తెలుస్తోంది.
Also Read: అల్లు అర్జున్‌ ప్లాన్ ఫెయిల్ అవుతోందా? తప్పు ఎక్కడ జరుగుతోంది?
Also Read: కార్డియాక్ అరెస్ట్‌తో యంగ్ యూట్యూబ‌ర్‌ మృతి...
Also Read: 'ఎవడి యుద్ధం వాడిదే'.. పుష్పరాజ్ వచ్చేశాడు..
Also Read: మొబైల్ ఫోన్‌తో వైద్యులు తీసిన సినిమా... ప్రశంసలు అందుకుంటోంది
Also Read: 'సలార్' సినిమా రీషూటింగ్.. ఇంటర్వెల్ ఎపిసోడ్ పై స్పెషల్ ఫోకస్..
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి