రెడ్‌మీ 10(2022) స్మార్ట్ ఫోన్ యూఎస్ ఎఫ్‌సీసీ (ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్) వెబ్‌సైట్‌లో కనిపించినట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ 4 జీబీ ర్యామ్, 64 జీబీ, 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్లతో లాంచ్ కానుందని వార్తలు వస్తున్నాయి. ఈ రెడ్‌మీ స్మార్ట్ ఫోన్ ఇప్పటికే పలు సర్టిఫికేషన్ వెబ్‌సైట్లలో కనిపించింది.


యూరోపియన్ ఎకనమిక్ కమిషన్(ఈఈసీ), ఐఎండీఏ, టీకేడీఎన్, ఎస్‌డీపీపీఊ, టీయూవీ రెయిన్ ల్యాండ్ సర్టిఫికేషన్ సైట్లలో ఈ ఫోన్ కనిపించనట్లు తెలుస్తోంది. రెడ్‌మీ 10 (2022)తో పాటు రెడ్‌మీ 10 ప్రైమ్ (2022) స్మార్ట్ ఫోన్ కూడా లాంచ్ కానుందని తెలుస్తోంది.


ఎఫ్‌సీసీ లిస్టింగ్ ప్రకారం.. 22011119UY మోడల్ నంబర్ ఉన్న స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్లు లీకయ్యాయి. ఈ మోడల్ నంబర్ రెడ్‌మీ 10 (2022) స్మార్ట్ ఫోన్‌కు సంబంధించింది. ఈ మోడల్ నంబర్ ఉన్న ఫోన్ గతంలో కూడా ఎన్నో లిస్టింగ్‌ల్లో కనిపించింది.


ఇందులో డ్యూయల్ సిమ్ ఫీచర్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇది 5జీతో కాకుండా కేవలం 4జీలో మాత్రమే లాంచ్ కానుంది. ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 12.5 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేసే అవకాశం ఉంది.


రెడ్‌మీ 10 (2022)లో 50 మెగాపిక్సెల్ ఓమ్నీవిజన్ ఓవీ50సీ40 సెన్సార్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు 8 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్355 సెన్సార్, 2 మెగాపిక్సెల్ గెలాక్సీ కోర్ కూడా ఉండనున్నాయి. ఐఎంఈఐ డేటాబేస్‌లో 21121119SG, 22011119UY మోడల్ నంబర్లు ఉన్న స్మార్ట్ ఫోన్లు కనిపించాయి.


ఈ రెండు ఫోన్లూ రెడ్‌మీ 10 (2022), రెడ్‌మీ 10 ప్రైమ్ (2022) స్మార్ట్ ఫోన్లనీ.. ఇవి త్వరలో మనదేశంలో లాంచ్ కానున్నాయని తెలుస్తోంది. ఈ ఫోన్ల స్పెసిఫికేషన్లను బట్టి వీటి ధర రూ.12 వేల రేంజ్‌లో ఉంటాయని అంచనా వేయవచ్చు.


Also Read: Honor 60: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్.. వ్లాగర్ల కోసం ప్రత్యేక ఫీచర్ కూడా!


Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!


Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?


Also Read: Redmi New Phone: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. 8 జీబీ ర్యామ్.. ధర ఎంతంటే?


Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి