ఆంధ్రప్రదేశ్‌లో వరద బాధితుల సహాయార్థం మెగాస్టార్ చిరంజీవి పాతిక లక్షల రూపాయలు సాయం చేశారు. ఆ మొత్తాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ఇస్తున్నట్టు ఆయన ట్వీట్ చేశారు. "ఆంధ్రప్రదేశ్‌లో కుండపోత వర్షాలు, వరదల కారణంగా ఏర్పడిన విధ్వంసం నన్నెంతో బాధించింది. సహాయ కార్యక్రమాల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 25 లక్షలు వినయపూర్వకంగా అందిస్తున్నాను. వరద బాధిత కుటుంబాలకు నా వంతు సాయంగా ఈ మొత్తం అందజేస్తున్నాను" అని చిరంజీవి పేర్కొన్నారు. చిరంజీవి తనయుడు, హీరో రామ్ చరణ్ సైతం రూ. 25 లక్షలను ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ప్రకటించారు. వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్న ఏపీ ప్రజలను చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని ఆయన అన్నారు.
ఏపీలో వర్షాల కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకోవడానికి సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ముందుకొచ్చారు. ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 25 లక్షలు అందిస్తున్నట్టు ఆయన తెలిపారు. కష్టకాలంలో ఏపీ ప్రజలను ఆదుకోవడానికి ప్రజలు ముందుకు రావాలని ఆయన పిలుపు ఇచ్చారు. ఆల్రెడీ ఎన్టీఆర్ కూడా రూ. 25 లక్షలు విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే.
Also Read: వరద బాధితులకు ఎన్టీఆర్ సాయం.. ఫ్యూచర్ సీఎం అంటూ కామెంట్స్..
ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ నవంబర్ 24న తిరుపతి వర్షాల కారణంగా ఇబ్బంది పడిన ప్రజల సహాయార్థం రూ. 10 లక్షలు ముఖ్యమంత్రి సహాయనిధికి అందిస్తున్నట్టు తెలిపింది. తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి మరికొంత మంది స్టార్ హీరోలు వరద బాధితులను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు ఇవ్వాలని ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. గతంలోనూ విపత్తులు సంభవించినప్పుడు పరిశ్రమ స్పందించి, విరాళాలు అందజేసింది.
Also Read: 'సిరివెన్నెల'కు నివాళిగా... 'భీమ్లా నాయక్', 'ఆర్ఆర్ఆర్' బాటలో 'రాధే శ్యామ్' కూడా!
Also Read: ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు చెప్పిన 'సిరివెన్నెల' కుటుంబం
Also Read: 'సిరివెన్నెల' సాహిత్యాన్ని విశ్లేషించడమా!? వినడమా!? ఏం చేద్దాం??
Also Read: 'సిరివెన్నెల' సీతారామ శాస్త్రి ఇక లేరు.. సాహిత్యానికి ముందు సాధారణ వ్యక్తిగా..
Also Read: సీతారాముడూ.. నిన్ను గుర్తు చేసుకుంటూ బతికేస్తాం, పోయిరా నేస్తం.!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి