అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ట్రేడ్‌ అవ్వడం, మెరుగైన జీడీపీ గణాంకాలు నమోదవ్వడంతో భారత స్టాక్‌ మార్కెట్లు పుంజుకున్నాయి. మూడు రోజులుగా కన్సాలిడేట్‌ అవుతున్న సూచీలు నేడు లాభాల్లో ముగిశాయి. మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 619 పాయింట్లు లాభపడగా నిఫ్టీ మళ్లీ 17000 ఎగువన ముగిసింది. సెంటిమెంటు ఇలాగే కొనసాగితే మార్కెట్లు మళ్లీ పూర్వ స్థితికి చేరుకొనే అవకాశం ఉంది.


క్రితం రోజు 57,064 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ బుధవారం ఉదయం 57,365 వద్ద ఆరంభమైంది. మొదట్లో కాస్త ఒడుదొడుకులకు లోనై 57,346 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. మధ్యా్‌హ్నం ఐరోపా మార్కెట్లు లాభాల్లో మొదలవ్వడంతో  ఇంట్రాడే గరిష్ఠమైన 57,846ను తాకి చివరికి 619 పాయింట్ల లాభంతో 57,684 వద్ద ముగిసింది.


నిఫ్టీ సైతం జోరుగానే మొదలైంది. క్రితం రోజు 16,983తో పోలిస్తే నేడు 17,104 వద్ద ఆరంభమైంది. ఇంట్రాడేలో 17,064 వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ పుంజుకొని 17,213 వద్ద గరిష్ఠానికి చేరుకొంది. చివరికి 183 పాయింట్ల లాభంతో 17,166 వద్ద ముగిసింది. ఈ స్థాయి వద్ద నిఫ్టీకి మద్దతు లభించింది.


నిఫ్టీలో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటా మోటార్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, అదానీ పోర్ట్స్‌ లాభపడ్డాయి. సిప్లా, దివిస్‌ ల్యాబ్‌, అల్ట్రాసెమ్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, భారతీ ఎయిర్‌టెల్‌ నష్టాల్లో ముగిశాయి. ఫార్మాను మినహాయిస్తే ఎన్‌ఎస్‌ఈలో అన్ని మేజర్‌ సూచీలు లాభాల్లోనే ముగిశాయి. బ్యాంక్‌ నిఫ్టీ 36,364 వద్ద ముగిసింది. ఉదయం 35,902 పాయింట్ల వద్ద మొదలైన సూచీ 669 పాయింట్ల లాభం పొందింది.






Also Read: Cryptocurrency Prices Today: పెరుగుతున్న క్రిప్టో ధరలు..! భయం పోయిందా..?


Also Read: Go Fashion shares: రూ.14,490 పెట్టుబడికి రూ.28,161 లాభం ఇచ్చిన ఐపీవో ఇది


Also Read: Satya Nadella: మైక్రోసాఫ్ట్‌లో తన పేరిట ఉన్న సగం షేర్లు అమ్మేసిన సత్య నాదెళ్ల.. ఎందుకంటే..


Also Read: Gold-Silver Price: పసిడి ప్రియులకు మళ్లీ గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం, మరింత పడిపోయిన వెండి.. నేటి ధరలివే..


Also Read: Petrol-Diesel Price, 1 December: గుడ్‌న్యూస్, ఈ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇక్కడ మాత్రం పెరుగుదల.. తాజా రేట్లు ఇవీ..


Also Read: Star Health IPO: స్టార్‌ హెల్త్‌ ఐపీవో మొదలు.. దరఖాస్తు చేసే ముందు ఇవి తెలుసుకోండి!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి