Balakrishna - Boyapati (BB4): బాలకృష్ణ, బోయపాటి కాంబినేష‌న్‌లో డ‌బుల్ హ్యాట్రిక్‌కు సన్నాహాలు?

నట సింహ నందమూరి బాలకృష్ణ, ఊర మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కలయికలో డబుల్ హ్యాట్రిక్ రాబోతోందా? అంటే... 'సన్నాహాలు జరుగుతున్నాయి' అనేది ఇండస్ట్రీ టాక్.

Continues below advertisement

తెలుగు సినిమా ఇండస్ట్రీలోని సూపర్ డూపర్ హిట్ కాంబినేష‌న్‌ల‌లో నట సింహ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), ఊర మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్ ఒకటి. ఇప్పటి వరకు వీళ్లిద్దరి కలయికలో మూడు సినిమాలు వచ్చాయి. ఒకటి... 'సింహ'. రెండు... 'లెజెండ్'. మూడు... 'అఖండ'(Akhanda). ఓ సినిమాను మించి మరో సినిమా... మూడూ భారీ కమర్షియల్  విజయాలు సాధించాయి. బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్ హ్యాట్రిక్ హిట్స్ నమోదు చేసింది. ఇప్పుడు డబుల్ హ్యాట్రిక్‌కు రెడీ అవుతుందా? అంటే... 'సన్నాహాలు జరుగుతున్నాయి' అనేది ఇండస్ట్రీ టాక్. 

Continues below advertisement

బాలకృష్ణతో ఓ సినిమా చేయాలని సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోంది.  నిర్మాత సూర్యదేవర నాగవంశీ నందమూరి అభిమాని కూడా. మధ్యలో బాలకృష్ణతో ఓ రీమేక్ సినిమా చేయాలని సమాలోచనలు చేశారని టాక్. అయితే... కుదరలేదు అనుకోండి. ఇప్పుడు బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేయాలని సన్నాహాలు చేస్తున్నారని తెలుగు సినిమా ఇండస్ట్రీ టాక్. బోయపాటితో సినిమా అంటే బాలకృష్ణ రెడీ అంటారు. అటు బోయపాటి కూడా అంతే. బాలకృష్ణతో అంటే 'ఎస్' అంటారు.

Also Read: వెన్నుపోటు అంటేనే కళ్లల్లో నీళ్లొస్తున్నాయి... బాలకృష్ణ 'అన్ స్టాపబుల్' టాక్

'అఖండ' తర్వాత గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో బాలకృష్ణ ఓ సినిమా స్టార్ట్ చేశారు. జనవరి తర్వాత షూటింగ్ ప్రారంభం కానుంది. స్క్రిప్ట్ రెడీగా ఉండటంతో నాలుగైదు నెలల్లో సినిమా పూర్తి అవుతుంది. ఒకవేళ బోయపాటితో సినిమా ఓకే అయితే... ఆ తర్వాత ఉంటుందా? అనిల్ రావిపూడి సినిమా తర్వాత ఉంటుందా? అనేది ఖరారు కావాలి. అనిల్ రావిపూడి (Anil Ravipudi) కూడా బాలకృష్ణతో సినిమా చేయాలని కొన్నాళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆల్రెడీ స్టోరీ మీద ఓ ఐడియాకు వచ్చారు.  'ఎఫ్ 3' (F3) తర్వాత బాలకృష్ణ సినిమా స్క్రిప్ట్ మీద వర్క్ చేయనున్నారు. మరోవైపు గీతా ఆర్ట్స్ సంస్థలో బోయపాటి ఓ సినిమా అంగీకరించారు. అల్లు అర్జున్ హీరోగా ఆ సినిమా ఉంటుందని, డిస్కషన్స్ జరుగుతున్నాయని టాక్. ప్రస్తుతం 'అఖండ' సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న బోయపాటి, త్వరలో తదుపరి సినిమాపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు.

Also Read: విల‌న్‌గా నటించడానికి బాలకృష్ణ రెడీ! అయితే... ఓ కండీషన్!
Also Read: మరీ అంతలా తిట్టాలా? పద్ధతిగా చెప్పొచ్చుగా! - విడాకుల తర్వాత ట్రోల్స్‌పై సమంత స్పందన
Also Read: బ్రేకింగ్... ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రభాస్ కోటి రూపాయల విరాళం
Also Read: ఈ సెలెబ్రిటీ పెళ్లి ఓటీటీలో ప్రసారం కానుందా... వందకోట్ల డీల్ కుదిరిందా?
Also Read: అల్లు అర్జున్‌ ప్లాన్ ఫెయిల్ అవుతోందా? తప్పు ఎక్కడ జరుగుతోంది?
Also Read: కార్డియాక్ అరెస్ట్‌తో యంగ్ యూట్యూబ‌ర్‌ మృతి...
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Continues below advertisement
Sponsored Links by Taboola