పార్లమెంట్ శీతాకాల సమావేశాలను బహిష్కరిస్తున్నట్లుగా తెలంగాణ రాష్ట్ర సమితి అధికారికంగా ప్రకటించింది. మంగళవారం ఉభయ సభలు ప్రారంభమైన తర్వాత యథావిధిగా ఎంపీలు సమావేశాలకు హాజరయ్యారు. అయితే ధాన్యం సేకరణ అంశంపై తెలంగామ రైతులను అన్యాయం చేయవద్దని ప్లకార్డులు ప్రదర్శిస్తూ సభలో నిరసన వ్యక్తం చేశారు. తర్వాత వాకౌట్ చేస్తున్నట్లుగా ప్రకటించి బయటకు వచ్చారు. ఈ రోజు నల్ల చొక్కాలతో టీఆర్ఎస్ ఎంపీలు హాజరయ్యారు. వాకౌట్ చేసిన తర్వాత పార్లమెంట్ భవనం బయట మీడియాకు తమ నిర్ణయం వెల్లడించారు. 


Also Read : పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించనున్న టీఆర్ఎస్ ! కారణం అదేనా?


తెలంగాణ రైతులను కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తోందని.  వారి వైఖరికి నిరసనగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బహిష్కరిస్తున్నట్లుగా నిర్ణయం ప్రకటించారు. కాసేపు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి ఎంపీలు వెళ్లిపోయారు. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుండి ఉభయసభల్లో ఎంపీలు ధాన్యం సేకరణ అంశంపై నినాదాలు చేస్తూనే ఉన్నారు. పలుమార్లు సభకు ఆటంకం కలగించారు. పీయూష్ గోయల్ ఈ అంశంపై సమాధానం ఇచ్చినప్పటికీ.. రబీలో ఎంత ధాన్యం సేకరిస్తారో స్పష్టంగా చెప్పాలని టీఆర్ఎస్ ఎంపీలు పట్టుబట్టారు. 


Also Read : ఒక్క ఎకరా కబ్జా అని తేలినా ముక్కు నేలకు రాస్తా.. చదువుకున్న.. ఆ చదువులేని కలెక్టర్‌పై కేసు పెడతా: ఈటల


కేంద్రం ఏ విషయం తేల్చి చెప్పకపోవడంతో పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు. ఆదివారం ఎంపీలందరూ కేసీఆర్‌తో సమావేశమయ్యారు. ఆ సమావేశంలోనే  సోమ, మంగళవారాల్లో కేంద్రం నుంచి క్లారిటీ రాకపోతే సమావేశాలను బహిష్కరించాలని సూచించినట్లుగా తెలుస్తోంది. ఆ మేరకు తమ వ్యూహం ప్రకారం...బయటకు వచ్చేశారు. తదుపరి పోరాట కార్యాచరణను సీఎం కేసీఆర్‌తో సమావేశమైన ఖరారు చేసుకుంటామని ఎంపీలు తెలిపారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వంపై పోరాటం మాత్రం ఆపేది లేదని స్పష్టం చేశారు.


Also Read: Journalist: కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు 2 లక్షల సాయం.. డిసెంబర్ 15న పంపిణీ


ఎంపీలంతా ఇప్పుడు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలపై దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఆరు చోట్ల జరుగుతున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ తమ ఓటర్లను ఇప్పటికే క్యాంప్‌నకు తరలించింది. వివిధ కారణాల వల్ల అసంతృప్తి గా ఉన్న ఓటర్లను ఎంపీలు బుజ్జగించి క్రాస్ ఓటింగ్ జరగకుండా చూసే అవకాశం ఉంది. 


Also Read: Shreya Muralidhar : కార్డియాక్ అరెస్ట్‌తో యంగ్ యూట్యూబ‌ర్‌ మృతి...


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి