పార్లమెంట్ సమావేశాలను తెలంగాణ రాష్ట్ర సమితి బాయ్ కాట్ చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. మంగళవారం పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపి ఆ తర్వాత తమ నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. వరి ధాన్యం కొనుగోళ్ల విషయంపై స్పష్టత ఇవ్వాలని పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుండి టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన నిర్వహిస్తున్నారు. సభా కార్యకలాపాలకు అడ్డం పడుతున్నారు. దీంతో పలుమార్లు స్పీకర్ వారిపై అసహనం వ్యక్తం చేశారు. 


Also Read : ఒక్క ఎకరా కబ్జా అని తేలినా ముక్కు నేలకు రాస్తా.. చదువుకున్న.. ఆ చదువులేని కలెక్టర్‌పై కేసు పెడతా: ఈటల


కేంద్రమంత్రి పీయూష్ గోయల్ వారికి సమాధానం కూడా ఇచ్చారు. తెలంగాణ టార్గెట్ ప్రకారం ఇవ్వాల్సిన ధాన్యమే ఇంకా ఇవ్వలేదని .. యాసంగిలో ఎంత ధాన్యం సేకరించాలనేదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ఈ క్రమంలో  ఆ సమాధానంతో సంతృప్తి చెందని టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ సమావేశాలను బాయ్ కాట్ చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఆదివారం టీఆర్ఎస్ ఎంపీలతో కేసీఆర్ సమావేశం అయ్యారు. అప్పుడే కేంద్రం నుంచి స్పష్టత రాకపోతే బాయ్ కాట్ చేయాలన్న సూచనలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఆ మేరకు టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత బాయ్ కాట్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.


Also Read: Sircilla: ప్రైవేటు వద్దు ప్రభుత్వ ఆసుపత్రి ముద్దు.. సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో భారీగా పెరిగిన ప్రసవాలు


మరో వైపు టీఆర్ఎస్ ఎంపీలు బాయ్ కాట్ నిర్ణయం తీసుకోబోతున్నారని టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సోమవారమే విమర్శించారు. పార్లమెంట్‌లో టీఆర్ఎస్ ఎంపీలు డ్రామాలు ఆడుతున్నారని..  బీజేపీ హైకమాండ్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు వారు మంగళవారం మధ్యాహ్నం నుంచి పార్లమెంట్ సమావేశాలను బాయ్‌కాట్ చేయబోతున్నారని ఆరోపించారు. అయితే విపక్ష పార్టీల ఆరోపణలు సహజగమే కానీ.. టీఆర్ఎస్ పార్లమెంట్ సమావేశాల బాయ్‌కాట్ నిర్ణయం తీకోవడం వెనుక వరి ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రం స్పందించకపోవడమే కాకుండా.. మరో కీలకమైన కారణం కూడా ఉందని చెబుతున్నారు. అవే ఎమ్మెల్సీ ఎన్నికలు. 


Also Read: Journalist: కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు 2 లక్షల సాయం.. డిసెంబర్ 15న పంపిణీ


ఎమ్మెల్సీలకు ఎన్నికలు జరుగుతున్న చోట ఉన్న ఎంపీలు.. ఎన్నికలపైనే దృష్టి పెట్టాలని కేసీఆర్ ఆదేశించినట్లుగా తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపు బాధ్యతను కేసీఆర్ ఎంపీలకు ఇచ్చారు. ఇప్పటికే నలుగురు ఎంపీలు ఓటర్లతో నిర్వహిస్తున్న క్యాంప్‌లకు వెళ్లినట్లుగా టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను అధికార పార్టీతో పాటు ఇండిపెండెంట్లు, కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ, కౌన్సిలర్లు సైలెంట్ అయ్యారు. దీంతో ఏం జరుగుతోందనని టీఆర్ఎస్ లో ఆందోళన నెలకొంది.  మెజార్టీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు టీఆర్ఎస్ కు చెందినవారే. అయితే వారిలో అసంతృప్తి ఉంది. నిధులు, విధుల విషయంలో వారిని సంతృప్తి పరచడం కష్టంగా మారింది. అందుకే ఎంపీలకు ఆ బాధ్యతలు ఇవ్వడంతో పనిలో పనిగా బాయ్ కాట్ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. 


Also Read: Shreya Muralidhar : కార్డియాక్ అరెస్ట్‌తో యంగ్ యూట్యూబ‌ర్‌ మృతి...


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి