కార్పొరేట్ ఆస్పత్రులకు పోటీగా సిరిసిల్ల జిల్లా ఆస్పత్రి రికార్డు స్థాయిలో ప్రసూతి సేవలను అందిస్తోంది.. నవంబర్ నెలలో 324 ప్రసవాలు చేసి రికార్డు సృష్టించారు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు. ఈ ఆస్పత్రిలో 2020 మే నెలలో గరిష్టంగా 315 ఆసుపత్రి కాన్పులు చేయగా ఈ ఏడాది నవంబర్లో 324 కాన్పులు చేశారు. అత్యాధునిక సౌకర్యాలతోపాటు సిబ్బందిని సైతం శిక్షణ ఇచ్చి మరీ సేవలు మెరుగుపరచడం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి ఆదరణ పెరగడానికి కారణమైంది. 


అంతేకాకుండా ఆసుపత్రిలో ctg , fetal doppler, ultrasound మిషిన్ కూడా అందుబాటులోకి తెచ్చారు. మరోవైపు హైడ్రాలిక్ ఆపరేషన్ టేబుల్ లను ఏర్పాటు చేసి బాలింతల పేర్లను ఎప్పటికప్పుడు నమోదు చేసి కేసీఆర్ కిట్ ను అందించడంతో పాటు ఇతర సదుపాయాలు కల్పించడం కూడా ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెరగడానికి దోహదపడ్డాయి.


సిబ్బంది కొరత అధిగమిస్తే....
మరోవైపు ఆసుపత్రికి సంబంధించిన సిబ్బంది కొరతపై కొంతవరకు సందిగ్ధం నెలకొంది.. ఇప్పటికీ ముగ్గురు గైనకాలజిస్టులు ఉన్నప్పటికీ వారిలో ఇద్దరు డిప్యుటేషన్స్ పై విధులు నిర్వహిస్తున్నారు. మరో ఇద్దరు డాక్టర్లు ఉన్నట్లయితే ప్రసవాలు మరింత పెరిగే అవకాశం ఉంది. బాలింతలకు ప్రస్తుతానికి ముప్పై ఐదు పడకలు ఉండగా మరొక 30 పడకలను ఏర్పాటు చేస్తే కచ్చితంగా ప్రసవాలు పెరిగే అవకాశం ఉంది. 


కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల జిల్లాలో ఆసుపత్రుల సౌకర్యాలపై ప్రసవాల రేటు పెరగడం పై సంతోషం వ్యక్తం చేస్తూ ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. అందులో సాధారణ ప్రసవాలు 98 గా పేర్కొంటూ మొత్తం 324 ప్రసవాలు నవంబర్ నెలలోనే జరగడం, ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన పనితీరుకి ఇది నిదర్శనం అంటూ దీనికి సంబంధించిన వార్తా క్లిప్పింగ్ ని జతచేశారు


ఆస్పత్రి సిబ్బంది సహకారం వల్లే ఇలాంటి ఘనతను సాధించగలమని ఆసుపత్రి సూపరింటెండ్  డాక్టర్ మురళీధర్ రావు అన్నారు. ప్రజల్లో పెరిగిన అవగాహనతో పాటు సిబ్బంది కూడా అహర్నిశలు కృషి చేయడం వల్లే ప్రసవాల సంఖ్య పెరిగిందన్నారు. మొదటి ప్రసూతికి సంబంధించి కేసుల్లో తాము వీలైనంత వరకు నార్మల్ డెలివరీకి ప్రయత్నిస్తున్నామని చెబుతున్నారు. గ్రామీణ మహిళలకు అవగాహన కల్పించడం ద్వారా ప్రసవాలను నార్మల్ గా చేసే విధంగా ప్రయత్నిస్తున్నామన్నారు.


Also Read: KRMB: కృష్ణా జలాల విడుదలపై 9న భేటీ.. చర్చకు వచ్చే అంశాలివే


Also Read: రైతులకు కష్టం రానియ్యనన్న కేసీఆర్ ఇప్పుడు ఏ సమాధానం చెబుతారు?: రేవంత్ రెడ్డి


Also Read: Journalist: కరోనాతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు 2 లక్షల సాయం.. డిసెంబర్ 15న పంపిణీ