బయట మాట్లాడే మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని టీమ్‌ఇండియా పరిమిత ఓవర్ల క్రికెట్‌ కెప్టెన్‌ రోహిత్‌శర్మ అన్నాడు. అవేవీ నిజం కావని, ఆటపై దృష్టి పెట్టడం ముఖ్యమని పేర్కొన్నాడు. వన్డే కెప్టెన్సీ నుంచి కోహ్లీని బీసీసీఐ తొలగించిన సంగతి తెలిసిందే. బోర్డు అలా చేయడంపై విమర్శలు వస్తున్నాయి. వాటిపై హిట్‌మ్యాన్‌ పరోక్షంగా ఇలా మాట్లాడాడు.


'భారత జట్టు తరఫున క్రికెట్‌ ఆడటం అత్యంత ఒత్తిడితో కూడుకున్నదే. చాలామంది వీటి గురించి మాట్లాడుతూనే ఉంటారు. సానుకూల, ప్రతికూల అంశాలపై చర్చ జరుగుతూనే ఉంటుంది. ఒక క్రికెటర్‌గా ఆటపై దృష్టి పెట్టడం కీలకం. ఇతరులు ఏం మాట్లాడుకుంటున్నారో ముఖ్యం కాదు. ఎందుకంటే అవి నా నియంత్రణలో ఉండవు. ఇదే విషయం ఎన్నోసార్లు చెప్పాను. ఇంకా చెబుతూనే ఉంటాను' అని రోహిత్‌ అన్నాడు.


'జట్టుకూ ఇదే సందేశం వర్తిస్తుంది. అత్యున్నత స్థాయిలో క్రికెట్‌ ఆడుతున్నప్పుడు ఇలాంటివి వస్తాయని అందరికీ తెలుసు. అందుకే మేం నియంత్రించగలిగే వాటిపై ఏకాగ్రతతో ఉండటం ముఖ్యం. అందుకే బయట జరిగే చర్చలు నిజం కావు' అని రోహిత్‌ తెలిపాడు. జట్టు సభ్యుల మధ్య అనుబంధం పెరిగేందుకు కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ కృషి చేస్తున్నారని హిట్‌మ్యాన్‌ పేర్కొన్నాడు.


'మా గురించి మేం ఆలోచిస్తున్నామన్నదే మాకు ముఖ్యం. ఆటగాళ్ల మధ్య బలమైన బంధం సృష్టించడం కీలకం. మేం లక్ష్యాలు సాధించేందుకు అదే పని చేస్తుంది. రాహుల్‌ భాయ్ ఇందుకు మాకు సాయం చేస్తున్నారు' అని రోహిత్‌ వెల్లడించాడు. దక్షిణాఫ్రికా పర్యటనకు టీమ్‌ఇండియా టెస్టు జట్టును ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. వన్డే జట్టును ఎంపిక చేయనప్పటికీ రోహిత్‌ను కెప్టెన్‌గా ప్రకటించడం గమనార్హం.


Also Read: Virat Kohli: ఆగని విరాట్ మంట.. జట్టును నాశనం చేయడం సులభం అన్న మాజీ క్రికెటర్!


Also Read: Ashes 2021-22: అదరగొట్టిన ఆస్ట్రేలియా.. యాషెస్‌లో మొదటి విజయం


Also Read: Warner Pushpa Video: పుష్పగా మారిన వార్నర్.. కోహ్లీ కామెంట్ చూస్తే నవ్వాగదు!


Also Read: CSK KKR Retentions 2022: చావుదెబ్బ కొట్టారు కదయ్యా.. చెన్నై, కోల్‌కతా నిర్ణయాల వెనక పెద్ద స్కెచ్!


Also Read: Ruturaj Gaikwad: ఎప్పుడో ఐపీఎల్‌లో మ్యూజిక్ స్టార్ట్ చేశాడు.. ఇంకా ఆపలా.. రుతురాజ్ మరో రికార్డు


Also Read: Yuvraj Singh NFT: బర్త్‌డే సర్‌ప్రైజ్ ఇచ్చిన యువరాజ్ సింగ్.. తన విలువైన ట్రోఫీలు ఎన్‌ఎఫ్‌టీ చేస్తూ కీలక నిర్ణయం