వర్డ్ ఆఫ్ ది ఇయర్ 2021గా ఆక్స్ ఫర్ట్ డిక్షనరి ఓ పదాన్ని గుర్తించింది. 'వ్యాక్స్'ని 2021 సంవత్సరానికి వర్డ్ ఆఫ్ ది ఇయర్ గా గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా వైద్యపరమైన అంశాల్లో ఈ పదాన్ని ఎక్కువగా వాడారు. అంతేగాకుండా సాధారణ ప్రజలు కూడా ఈ పదాన్ని ఎక్కువగా ఉపయోగించారు. ఆక్స్‌ఫర్డ్ ప్రకారం.. 'వ్యాక్స్' అనే పదం కిందటి ఏడాది కంటే.. ఈ ఏడాదిలో ఎక్కువగా వాడారు. వ్యాక్సిన్ లేదా వ్యాక్సినేషన్ అనే దానిలోనుంచి ఇది వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో వ్యాక్సిన్, వాక్సినేషన్ పదాలకు బదులుగా వ్యాక్స్ అనే పదాన్ని వాడతారు.


కోవిడ్-19 నివారించేందుకు.. వ్యాక్సిన్‌ అభివృద్ధి చేసిన తర్వాత, 2021లో ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యాక్సిన్ డ్రైవ్ లు నడిచాయి. కేవలం భారతదేశంలో, అక్టోబర్ 21, 2021 నాటికి 100 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లు అందించారు.


వ్యాక్సిన్ సంబంధిత పదాల వాడకం పెరుగుదల


ఆక్స్‌ఫర్డ్ లాంగ్వేజెస్ నివేదిక ప్రకారం.. సెప్టెంబర్ 2020 మరియు సెప్టెంబర్ 2021 మధ్య 'వ్యాక్సిన్' పదం వాడకం రెట్టింపు అయింది. 'వ్యాక్సినేట్' మరియు 'వ్యాక్సినేషన్' లాంటి వ్యాక్సిన్‌లకు సంబంధించిన ఇతర పదాల వాడకం కూడా వరుసగా 34 రెట్లు మరియు 18 రెట్లు పెరుగుదల కనిపించింది.






ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీ గుర్తించిన అంతకుముందు పదాలు


2019: Climate Emergency
2018: Toxic
2017: Youthquake
2016: Post-truth
2015: Emoticon of face with tears of Joy
2014: Vape
2013: Selfie
2012: Omnishambles
2011: Squeezed middle


Also Read: Exams Postponed: జవాద్ తుపాన్ ఎఫెక్ట్.. ఈ నగరల్లో యూజీసీ-నెట్, ఐఐఎఫ్ టీ పరీక్షలు వాయిదా


Also Read: CBSE Question: గుజరాత్ అల్లర్లకు ఎవరు కారణం.. ఆప్షన్స్.. కాంగ్రెస్, బీజేపీ, డెమోక్రటిక్, రిపబ్లికన్.. పరీక్షలో సీబీఎస్ఈ ప్రశ్న


Also Read: ట్విట్టర్ నుంచి గుగూల్ సీఈవో వరకు అగ్రస్థానంలో ఉన్న.. ఐఐటీ, ఐఐఎమ్ గ్రాడ్యుయేట్లు వీళ్లే.. 


Also Read: Internship: ఇంట‌ర్న్‌షిప్‌తో ఉద్యోగావకాశాలెక్కువ.. ఇంకెందుకు ఆలస్యం ఈ ప్రముఖ కంపెనీల్లో చేసేయండి 


Also Read: దేశంలోకి 'ఒమిక్రాన్' ఎంట్రీ.. అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరిక


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి