బిగ్ బాస్ సీజన్ 5 లో కంటెస్టెంట్ గా పాల్గొన్న శ్రీరామచంద్ర ఇప్పుడు ఫైనల్స్ కి చేరుకున్నాడు. హౌస్ లో అందరికంటే ముందు ఫస్ట్ ఫైనలిస్ట్ గా ఎన్నికై.. తన సత్తా చాటాడు. ప్రియాంక చేసిన ట్రీట్మెంట్ కారణంగా.. శ్రీరామ్ ఫిజికల్ గా ఇబ్బంది పడినప్పటికీ గివప్ చేయకుండా గేమ్ ఆడాడు. అతడికి లోన్ రేంజర్ అనే ట్యాగ్ కూడా ఇచ్చారు నాగార్జున. హౌస్ లో ఒక్కడే గేమ్ ఆడుకుంటూ.. తన ఆట తీరుతో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు.
ఈ వారంతో బిగ్ బాస్ షో పూర్తి కాబోతుంది. దీంతో టాప్ 5 కంటెస్టెంట్స్ జర్నీను వాళ్లకు చూపించాలని నిర్ణయించుకున్నారు బిగ్ బాస్. ముందుగా శ్రీరామ్ జర్నీను చూపించినట్లు తాజాగా విడుదలైన ప్రోమో ద్వారా తెలుస్తోంది. హౌస్ లో శ్రీరామ్ మెమొరీస్ కి సంబంధించిన ఫొటోలన్నీ వేర్వేరు ప్లేసెస్ లో ఎరేంజ్ చేశారు బిగ్ బాస్. అవి చూసిన శ్రీరామ్ చాలా ఆనందపడ్డాడు. 'సో స్వీట్ బిగ్ బాస్' అంటూ ఎగ్జైట్ అవుతూ చెప్పాడు.
''శ్రీరామ్ ఈ ఇంట్లో మీ ప్రయాణం ఒక గాయకుడిగా మొదలై.. ఒక్కో వారం ఒక్కో మెట్టు ఎదుగుతూ.. ఆటలో మీరు చూపించిన పోరాట పటిమ, మీ స్నేహితుల కోసం మీరు నిలబడ్డ తీరు.. ప్రపంచానికి ఒక కొత్త శ్రీరామ్ ని పరిచయం చేశాయి. ముంచే కెరటాలు ఎన్నున్నా.. వాటి పైగా ఈదుకుంటూ వచ్చి ఉదయించే సూర్యుడు ఒక్కడే..'' అంటూ శ్రీరామ్ కి ఓ రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చారు బిగ్ బాస్. బ్యాక్ గ్రౌండ్ లో 'మహర్షి' మ్యూజిక్ ప్రోమోను మరింత ఎలివేట్ చేసింది.