Uttam Kumar Reddy: తెలంగాణలో బొగ్గు గనుల వేలం నిలిపివేయాలి... లోక్ సభలో లేవనెత్తిన ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి

తెలంగాణలోని బొగ్గు గనుల వేలాన్ని వెంటనే నిలిపివేయాలని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. లోక్ సభలో మాట్లాడిన ఆయన బొగ్గు గనుల ప్రైవేటీకరణ జాతి ప్రయోజనాలకు వ్యతిరేకమన్నారు

Continues below advertisement

తెలంగాణలో బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని, ఆ నిర్ణయాన్ని విరమించుకోవాలని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. లోక్ సభ జీరో అవర్ లో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు.  తెలంగాణలో నాలుగు బొగ్గు గనులను ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్ర బొగ్గు గనుల శాఖ ప్రయత్నం చేస్తోందన్నారు. బొగ్గు గనుల ప్రైవేటీకరణను తెలంగాణ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలన్నారు. కొత్తగూడెం బ్లాక్, సత్తుపల్లి బ్లాక్, శ్రావణపల్లి బ్లాక్, కల్యాణ్ ఖని బ్లాక్ లను ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. దేశంలో వందేళ్ల చరిత్ర కలిగిన సింగరేణి బొగ్గు గనులను ప్రైవేట్ పరం చేయడం పట్ల కార్మికులు సమ్మె చేస్తున్నారని గుర్తుచేశారు. సింగరేణి బొగ్గు ఆధారంగా తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర రాష్ట్రాలలో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి అవుతుందన్నారు. బొగ్గు గనుల ప్రైవేటీకరణ నిర్ణయం జాతి ప్రయోజనాలకు వ్యతిరేకమన్నారు. వెంటనే ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. 

Continues below advertisement

Also Read: వీరాపూర్ అటవీ ప్రాంతంలో పెద్ద పులి వీరంగం... వాహనాన్ని కిలోమీటర్ దూరం వెంబడించిన పులి

సమ్మె కారణంగా రూ.120 కోట్ల నష్టం

స‌త్తుప‌ల్లి, కొత్తగూడెం, శ్రావ‌ణ‌ప‌ల్లి, క‌ళ్యాణ్ ఖ‌ని బొగ్గు గ‌నులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడంపై సింగ‌రేణి కార్మికులు నిరసన తెలిపారు. బొగ్గు గ‌నుల వేలం ప్రక్రియ‌ను విర‌మించుకోవాల‌ని మూడు రోజుల‌ పాటు స‌మ్మె చేశారు. ఈ స‌మ్మె కార‌ణంగా తెలంగాణ‌లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో సింగ‌రేణికి సుమారు రూ. 120 కోట్ల మేర న‌ష్టం వచ్చింది. ఈ విషయాన్ని లోక్‌స‌భ‌లో కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తావించారు.  లాభాల్లో ఉన్న సింగ‌రేణి కాల‌రీస్ ప్రభుత్వరంగ సంస్థకు అప్పగించ‌కుండా బొగ్గు గనులను వేలం వేయ‌డం సరికాదన్నారు. వేలం ప్రక్రియ‌ను వెంటనే నిలిపివేయాల‌ని ఎంపీ డిమాండ్ చేశారు. దేశంలో సింగ‌రేణికి వందేళ్ల చ‌రిత్ర ఉంద‌ని, కర్ణాట‌క‌, ఏపీ, తెలంగాణ, మ‌హారాష్ట్ర బొగ్గు ఆధారిత విద్యుదుత్పత్తి సంస్థల‌కు సింగ‌రేణి బొగ్గు స‌ర‌ఫ‌రా చేస్తోంద‌న్నారు. సింగ‌రేణి కాల‌రీస్‌లో తెలంగాణ ప్రభుత్వంతో పాటు, కేంద్రానికి కూడా వాటాలున్నందువ‌ల‌న కేంద్రం త‌క్షణ‌మే స్పందించాల‌ని ఆయన డిమాండ్ చేశారు. 

Also Read: డ్యూటీలో చేరేందుకు బయల్దేరిన సిద్దిపేట జవాను.. ఆచూకీ గల్లంతు, అందరిలో ఆందోళన

Also Read: జవాను సాయితేజ మరణంపై వీహెచ్ సంచలన కామెంట్స్.. సీఎంలు కేసీఆర్, జగన్‌‌పైన కూడా..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి  

Continues below advertisement