తెలంగాణలో ఓ ఆర్మీ జవాను ఉత్తరాదిలో కనిపించకుండా పోవడం కలకలం రేపుతోంది. పంజాబ్‌లోని భాటిండా సమీపంలో ఫరీద్ కోట్‌లో తన విధులకు డిసెంబరు 7వ తేదీన రిపోర్ట్ చేయాల్సి ఉండగా, అప్పటి నుంచి ఆయన ఆచూకీ గల్లంతైంది. తెలంగాణలో సిద్దిపేట జిల్లా పోతిరెడ్డిపల్లి చెందిన బి. సాయి కిరణ్ రెడ్డి అనే ఆర్మీ జవాను ఇంటి నుంచి విధులకు వచ్చే క్రమంలో కనిపించకుండా పోయారు. అంతకుముందు నవంబరు 16న ఆయన 20 రోజుల పాటు సెలవు పెట్టి స్వగ్రామం వెళ్లారు. తిరిగి విధులకు హాజరయ్యేందుకు ఇంటి నుంచి బయలు దేరారు. ఢిల్లీ ఎయిర్ పోర్టు వరకూ వెళ్లారు. అక్కడి నుంచి ఆయన ఆచూకీ గల్లంతైంది.
చేర్యాల పోలీస్ స్టేషన్‌లో సాయి కిరణ్ తండ్రి పటేల్ రెడ్డి నమోదు చేసిన ఫిర్యాదు ప్రకారం.. తన కుమారుడు పంజాబ్‌లో విధులకు హాజరయ్యేందుకు డిసెంబరు 5న సాయంత్రం ఇంటి నుంచి బయలుదేరాడని తెలిపారు. రాత్రి 8 గంటలకు హైదరాబాద్ విమానాశ్రయంలో విమానం ఎక్కాడని పేర్కొన్నారు. కానీ, డిసెంబరు 6, డిసెంబరు 7 తేదీల్లో ఆయన నుంచి ఏ సమాధానమూ రాలేదని పేర్కొన్నాడు. కనీసం ఫోన్ కూడా కలవని పరిస్థితి నెలకొందని వెల్లడించాడు.
జవాను కనిపించకుండా పోవడంతో సిద్దిపేటలోని అతని ఇంట్లో తీవ్ర ఆందోళన నెలకొంది. పంజాబ్ ఫరీద్ కోట్‌లో సాయి కిరణ్ హాజరు కాలేదని ఆర్మీ కెప్టెన్ ఫోన్ చేసి తండ్రి పటేల్ రెడ్డి చెప్పారు. దీంతో ఆందోళన మరింత తీవ్రమైంది.
ఈ క్రమంలో ఆర్మీ అధికారులు విచారణ చేపట్టారు. తొలుత ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. అందులో రికార్డయిన దృశ్యాల ప్రకారం.. సాయి కిరణ్ డిసెంబరు 6 సాయంత్రం ఎయిర్ పోర్టు నుంచి బయటకు వచ్చినట్లు తేల్చారు. దీంతో ఆర్మీ అధికారులు ఈ విషయాన్ని సాయి కిరణ్ కుటుంబానికి తెలియజేశారు. ప్రస్తుతం పంజాబ్ పోలీసులు సాయి కిరణ్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
Also Read: అత్త గొంతుపై గడ్డ పారతో పొడిచి చంపిన అల్లుడు, ఆ తర్వాత భార్యపై కూడా.. ఇంతలో..
Also Read: ‘అఖండ’ను చూసిన చంద్రబాబు, సినిమాను ఏపీతో ముడిపెట్టి... ఏమన్నారంటే?
Also Read: ప్రేక్షకులు థియేటర్లకు రావడం కోసమే ఎన్టీఆర్, చరణ్! ఆ తర్వాత... - రాజమౌళి ఏమన్నారంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి