విక్టరీ వెంకటేష్ ఈరోజు 61వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు, సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా వెంకీకి విషెస్ చెబుతున్నారు. 'ఎఫ్3' చిత్రబృందం వెంకటేష్ ను విష్ చేస్తూ చిన్న వీడియోను విడుదల చేసింది. అందులో వెంకీ నవాబ్ గెటప్ లో కనిపించారు. చార్మినార్ ముందు నవాబ్ అవతారంలో కూర్చొని.. చేతిలో రెండు వేల రూపాయలు నోట్లు పట్టుకొని వెంకీ కనిపించారు.
ఈ వీడియోను చూస్తుంటే.. సినిమాలో సాంగ్ బిట్ అని తెలుస్తోంది. పూర్తి సాంగ్ చూడాలంటె సినిమా విడుదలయ్యే వరకు ఎదురుచూడాల్సిందే. నిజానికి ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనుకున్నారు కానీ బరిలో పెద్ద సినిమాలు ఉండడంతో వాయిదా వేసుకున్నారు. ఫిబ్రవరి 25న రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. దర్శకుడు అనీల్ రావిపూడి 'ఎఫ్ 2' సినిమాకి రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు.
ఇందులో వెంకీతో పాటు వరుణ్ తేజ్, సునీల్ కూడా నటిస్తున్నారు. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సోనాల్ చౌహాన్, అంజలి లాంటి తారలు కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.