అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న 'పుష్ప' సినిమా డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. నిన్ననే ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగింది. ఇందులో అల్లు అర్జున్ తన స్పీచ్ తో ఆకట్టుకున్నాడు. ఇంత పెద్ద ఈవెంట్ హోస్ట్ చేసినా.. దానికి దర్శకుడు సుకుమార్, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ రాలేకపోయారు. ప్రీప్రొడక్షన్ పనుల కోసం ముంబై వెళ్లడంతో వీరిద్దరూ ప్రీరిలీజ్ ఈవెంట్ ను స్కిప్ చేయాల్సి వచ్చింది. అయినప్పటికీ వారి లేని లోటుని కొరటాల, రాజమౌళి తీర్చారు. 


ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది. అలానే సినిమాలో పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. రీసెంట్ గా సమంత నటించిన ఐటెం నెంబర్ 'ఊ అంటావా మావా ఊ ఊ అంటావా' లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. డిఫరెంట్ ట్యూన్ తో సాగిన ఈ సాంగ్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా సమంత మాస్ అవతారం పాటకి హైలైట్ గా నిలిచింది. రీసెంట్ గా ఈ పాటకు సంబంధించిన ప్రోమోను వదలగా.. అది ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. 


బన్నీ ఒళ్లో కూర్చొని సమంత వేసే స్టెప్స్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఇలా సినిమాకి భారీ హైప్ తీసుకొస్తున్న ఈ పాటపై కేసు నమోదైనట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ కి చెందిన పురుష సంఘం ఒకటి ఈ పాటను బ్యాన్ చేయాలంటూ కంప్లైంట్ చేసింది. పాటలో లిరిక్స్ చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని.. మగాళ్లను తక్కువ చేస్తూ రాశారని సదరు సంఘం పిటిషన్ లో పేర్కొంది. మగాళ్ల బుద్ధి వంకర బుద్ధి అని.. వాళ్లు కేవలం సెక్స్ గురించే ఆలోచిస్తారన్నట్లుగా లిరిక్స్ ఉన్నాయని మండిపడుతున్నారు. 


ఈ సాంగ్ ను వెంటనే బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ గొడవపై చిత్రబృందం ఎలా స్పందిస్తుందో చూడాలి. రష్మిక హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ విలన్ గా కనిపించనున్నాడు. అలానే సునీల్, అనసూయ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. 






Also Read:బన్నీతో సమంత 'నాటు' స్టెప్.. ఊరమాస్ ఉందే..


Also Read: పుష్ప ఈవెంట్లో ‘థ్యాంక్యూ వార్నర్’.. అల్లు అర్జున్ రియాక్షన్ ఏంటంటే?


Also Read: ఇది కేవలం జెర్సీ మాత్రమే కాదు.. నాగచైతన్య ఎందుకు అలా అన్నాడంటే?


Also Read:  'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ చూసి రామ్, భీమ్ ఎలా రియాక్ట్ అయ్యారో తెలుసా..?


Also Read:  ఇక సహించేదే లేదు.. శిక్ష పడేవరకు పోరాడతా.. రవి సీరియస్..  


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి