డేవిడ్ వార్నర్ తెలుగు హీరోలకు సంబంధించిన టిక్‌టాక్‌లు, రీల్స్ ఎక్కువ చేస్తాడనే సంగతి తెలిసిందే. ఇటీవలే పుష్పకు సంబంధించిన ‘ఏ బిడ్డా.. ఇది నా అడ్డా..’ సాంగ్‌ను కూడా తన ఫొటోతో మార్ఫ్ చేసి ఇన్‌స్టాలో పెట్టాడు. అయితే పుష్ప ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో కూడా దీనికి సంబంధించిన ప్రస్తావన వచ్చింది.


డైరెక్టర్ వెంకీ కుడుముల మాట్లాడుతూ ‘తెలుగు సినిమాను అంతర్జాతీయంగా ప్రమోట్ చేస్తున్న డేవిడ్ వార్నర్‌కు థ్యాంక్స్.’ అనగానే మూవీ టీం అంతా పడీపడీ నవ్వారు. అల్లు అర్జున్ కూడా నవ్వాపుకోలేకపోయాడు.  పుష్పలో సూపర్ హిట్ అయిన ‘ఏ బిడ్డా.. ఇది నా అడ్డా..’ పాటకు సంబంధించి డేవిడ్ వార్నర్ ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయింది.


ఫేస్ యాప్ సాయంతో అల్లు అర్జున్ బదులు డేవిడ్ వార్నర్ ఫేస్ ఉన్న వీడియోను వార్నర్ పోస్ట్ చేయగా.. దాని కింద విరాట్ ‘మిత్రమా.. బానే ఉన్నావా?’ అని కామెంట్ కూడా చేశాడు. దీంతోపాటు పక్కన పగలబడి నవ్వుతున్న ఎమోజీ కూడా ఉండటంతో ఫ్యాన్స్ ఆ వీడియోతో పాటు ఈ కామెంట్‌ను కూడా ఎంజాయ్ చేస్తున్నారు.


ఈ కార్యక్రమానికి ఎస్ఎస్ రాజమౌళి, కొరటాల శివ తదితర ప్రముఖ దర్శకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. అన్ని పాటలూ సూపర్ హిట్ అవ్వడం, సుకుమార్, బన్నీల కాంబో కారణంగా ప్రేక్షకులకు ఈ సినిమా మీద అంచనాలు ఎక్కువ అయ్యాయి.


పుష్ప ఈ నెల 17వ తేదీన థియేటర్లలో విడుదలకు సిద్ధం అవుతోంది. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ రానుంది. అల్లు అర్జున్ పుష్పగా, రష్మిక శ్రీవల్లిగా నటించిన ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్, సునీల్, కన్నడ నటుడు ధనంజయ విలన్ రోల్స్‌లో నటిస్తున్నారు. టీజర్, ట్రైలర్లను కూడా మాస్‌ను ఆకట్టుకునే విధంగా కట్ చేశారు. ముఖ్యంగా ‘తగ్గేదే లే’ అనే మ్యానరిజం విపరీతంగా జనంలోకి చొచ్చుకుపోయింది. రూ.250 కోట్ల వరకు బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కిందని వార్తలు వస్తున్నాయి.


Also Read:  'ఆర్ఆర్ఆర్' ట్రైలర్ చూసి రామ్, భీమ్ ఎలా రియాక్ట్ అయ్యారో తెలుసా..?


Also Read:  ఇక సహించేదే లేదు.. శిక్ష పడేవరకు పోరాడతా.. రవి సీరియస్..  


Also Read:  'ఐకాన్' సినిమా అటకెక్కినట్లే.. ఇదిగో క్లారిటీ..


Also Read: 'నువ్ నన్ను భరించావా..? లేక నటించావా..?' మానస్ ని ప్రశ్నించిన పింకీ.. 


Also Read: రజనీకాంత్ పవర్‌ఫుల్ పంచ్‌లకు ఎవరైనా పడిపోవాల్సిందే... కొన్ని డైలాగులు ఇవిగో


Also Read:  ‘అఖండ’ను చూసిన చంద్రబాబు, సినిమాను ఏపీతో ముడిపెట్టి... ఏమన్నారంటే?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయం