ఉక్కు దీక్షలో జనసేనాని పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. బీజేపీతో జతకట్టిన పవన్... స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రాన్ని ప్రశ్నించాలన్నారు. కానీ ఏపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఏమిటని విమర్శించారు. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పవన్ ఏ దీక్ష చేసినా వైసీపీ ప్రభుత్వాన్నే టార్గెట్ చేస్తారన్నారు. విశాఖ ఉక్కు దీక్షలో సీఎం జగన్‌పై నిందలు వేశారన్నారు. స్టీల్ ప్లాంట్‌పై బీజేపీని ఎందుకు ప్రశ్నించడంలేదన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ బాధ్యత కేంద్రానిది కాదా అని ప్రశ్నించారు. విశాఖ ఉక్కుపై పవన్ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని అంబటి సూచించారు. విశాఖ ఉక్కుపై అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించామన్నారు. పవన్ సినిమాలు ఆపాల్సిన పరిస్థితి ఏరీ ప్రభుత్వానికి లేదన్నారు. ఒక్కో సినిమాకు పవన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రానికే కాదు కేంద్రానికి రూ.121లక్షల కోట్ల అప్పు ఉందన్నారు.
Also Read: జగనన్న ఉన్నాడు జాగ్రత్త... గుంతల రోడ్డుపై ఫ్లెక్సీ... వైరల్ అవుతున్న వీడియో
ఇప్పుడు గుర్తొచ్చారా సంజీవయ్య
దామోదరం సంజీవయ్య ఇప్పుడే గుర్తొచ్చారా అని అంబటి ప్రశ్నించారు. రాజకీయాల్లోకి వచ్చిన ఇన్ని సంవత్సరాలు ఏంచేశావన్నారు. మంగళగిరిలో పవన్ కు రెండు ఎకరాలు గిఫ్టు ఇచ్చారని అందుకే అమరావతి రాజధాని కావాలని అడుగుతున్నారన్నారు. అసలు జనసేన ఏంచేసిందని అధికారం ఇవ్వాలన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను అమ్మకానికి పెట్టటంపై వైసీపీ ప్రభుత్వం పోరాటం చేస్తూనే ఉందన్నారు. పవన్‌కి ధైర్యం ఉంటే ప్లకార్డు పట్టుకుని పార్లమెంటు ఎదుట పోరాటం చేయాలని అంబటి రాంబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Also Read: ఏపీలో శాంతి భద్రతలు దిగజారాయి... తిక్కారెడ్డిపై దాడి ఘటనపై డీజీపీకి చంద్రబాబు లేఖ
ఓట్లు అడగటానికే దీక్ష
దేశంలో ఎన్నికలను ఇంత ఖరీదు చేసేంది టీడీపీ అని అంబటి రాంబాబు అన్నారు. ఉక్కు పరిశ్రమ కోసం వైఎస్సార్‌సీపీ అనేక వేదికలపై పోరాటం చేసిందన్నారు. పవన్ కల్యాణ్‌ను ప్రజలు రిజెక్టు చేశారన్నారు. అందుకే పోటీ చేసిన రెండు చోట్లా గెలవలేకపోయారని ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. 2024లో ఓట్లేయమని అడగటానికే పవన్ దీక్ష చేసినట్టుందని రాంబాబు ఆరోపించారు.