హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో భారీ దోపిడీ జరిగింది. ఆదాయ పన్ను అధికారులం అని నమ్మబలికి ఓ ఇంటికి వెళ్లిన దుండగులు భారీ మొత్తాన్ని దోచుకున్నారు. ఏకంగా మూడు కిలోల బంగారం, 2 లక్షల నగదును లూటీ చేసుకొని వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Also Read: TS MLC Election Results: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్.. అన్ని స్థానాలు గులాబీ కైవసం
తాము ఇన్‌కం ట్యాక్స్ అధికారులం అని చెప్పి నానక్ రాం గూడలోని జయభేరి ఆరెంజ్ కౌంటీలోకి దుండగులు ప్రవేశించారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో జయభేరి ఆరెంజ్ కౌంటీలోని సి బ్లాక్‌లో ఉండే భాగ్యలక్ష్మి ఇంట్లోకి ఏకంగా ఐదుగురు వ్యక్తులు వచ్చారు. వారు తమను తాము ఐటీ అధికారులుగా పరిచయం చేసుకున్నారు. నమ్మకం బాగా కుదిరేందుకు వారి వెంట ముందస్తు ప్రణాళిక ప్రకారం తెచ్చుకున్న నకిలీ గుర్తింపు కార్డులను ఇంటి వారికి చూపించారు. దీంతో వారు నిజమైన ఐటీ ఆఫీసర్లు అనుకొని ఇంట్లోని కుటుంబ సభ్యులు నమ్మేశారు.
ఇంట్లో మొత్తం సోదాలు చేసుకొనేందుకు అనుమతించగా.. దాదాపు గంటన్నర పాటు ఐటీ ఆఫీసర్లుగా పరిచయం చేసుకున్న దొంగలు ఇంట్లోనే ఉన్నారు. లాకర్ తాళాలు తీసుకొని అందులో ఉన్న 3 కిలోల బంగారు ఆభరణాలు సహా రూ.2 లక్షల సొమ్మును దోచుకుపోయారు. అనంతరం వారు నకిలీ అధికారులు అని గుర్తించి పోలీసులను ఆశ్రయించారు. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు.
Also Read: Warangal: భార్య తోడు కోసం ఇద్దరు భర్తల పోరాటం.. మొదటి భర్తకు ట్విస్ట్, ఆ తర్వాత ఇద్దరికీ షాక్!
Also Read: Cheddi Gang: చెడ్డీ గ్యాంగ్ మూలాలు తెలుసా.. వాళ్లు నరరూప రాక్షసులుగా ఎందుకు మారారు?
Also Read: అత్త గొంతుపై గడ్డ పారతో పొడిచి చంపిన అల్లుడు, ఆ తర్వాత భార్యపై కూడా.. ఇంతలో..
Also Read: ప్రేక్షకులు థియేటర్లకు రావడం కోసమే ఎన్టీఆర్, చరణ్! ఆ తర్వాత... - రాజమౌళి ఏమన్నారంటే?
Also Read: Weather Updates: ఏపీలో మరో 48 గంటలు ఓ మోస్తరు వర్షాలు.. తెలంగాణలో భారీగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు
Also Read: అబద్దాలతో బురిడీ కొట్టిస్తున్న శిల్పా చౌదరి - మరోసారి కస్టడీ కోరిన పోలీసులు !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి