నట సింహ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'అఖండ'. ఈ నెల 2న విడుదల అయ్యింది. తొలి రోజు నుంచి సూపర్ హిట్ టాక్‌తో దూసుకు వెళుతోంది. ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. కొవిడ్ సెకండ్ వేవ్ తర్వాత విడుదల అయిన సినిమాల్లో భారీ కలెక్షన్స్ సాధించిన సినిమాగా ఆల్రెడీ 'అఖండ' రికార్డు క్రియేట్ చేసింది. వంద కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి బాలకృష్ణ స్టామినా ఏంటో చాటింది. లేటెస్టుగా మరో రికార్డు క్రియేట్ చేసింది. అమెరికాలో ఈ సినిమా మిలియన్ మార్క్ చేరుకుంది.


అమెరికాలో 'అఖండ' వన్ మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసిందని డిస్ట్రిబ్యూషన్ సంస్థ రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్ ట్వీట్ చేసింది. ఆ సంస్థకు డిస్ట్రిబ్యూషన్ పరంగా అమెరికాలో ఇదే తొలి సినిమా. ఈ సందర్భంగా అందరికీ థాంక్స్ చెప్పింది.





బాలకృష్ణ కెరీర్‌లో హయ్యెస్ట్ గ్రాస్ సాధించిన సినిమాగా మొన్నటివరకూ 'గౌతమీ పుత్ర శాతకర్ణి'. కానీ, ఇప్పుడు ఆ రికార్డును 'అఖండ' విడుదల అయిన పది రోజుల్లో క్రాస్ చేసింది. బాలకృష్ణకు తొలి రూ. 100 కోట్ల సినిమాగా నిలిచింది. 'అఖండ'తో నట సింహ వంద కోట్ల క్ల‌బ్‌లో చేరడంతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుషిగా ఉన్నారు.


Also Read: మళ్లీ ఇటువంటివి జరగనివ్వను... అభిమానులకు అల్లు అర్జున్ హామీ!
Also Read: కార్తీక్ ఆచూకీ కోసం ఫస్ట్ స్టెప్ వేసిన మోనిత.. డాక్టర్ బాబుకి క్లాస్ పీకిన దీప.. ‘కార్తీకదీపం’ డిసెంబర్ 13 ఎపిసోడ్
Also Read: అర్థరాత్రి వరకూ చాటింగ్, పొద్దున్నే గులాబీలతో స్వాగతం.. పట్టాలెక్కిన రిషి-వసుధార లవ్ ట్రాక్..
Also Read: డాక్టర్ బాబుని అవమానించిన పిల్లలు… రుద్రాణి వలలో దీప చిక్కుకుంటుందా, కార్తీక దీపం ఈ రోజు ఎపిసోడ్
Also Read: బిగ్‌ బాస్‌లో మెరిసిన టీఆర్ఎస్ ఎంపీ.. వెయ్యి ఎకరాల అడవి దత్తత తీసుకుంటానని నాగార్జున హామీ
Also Read: బన్నీతో సమంత 'నాటు' స్టెప్.. ఊరమాస్ ఉందే..
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి