'పుష్ప' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చిన కొందరు అభిమానులపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. క్రౌడ్‌ను కంట్రోల్‌ చేయడం కోసం పోలీసులు లాఠీకి పని చెప్పక తప్పలేదు. అయితే... దీనికి కారణం ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ అని తెలుస్తోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన స్టేడియం కెపాసిటీ కంటే ఎక్కువ పాసులు జారీ చేశారని సమాచారం. ఆదివారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇష్యూ పక్కన పెడితే... సోమవారం మరోసారి అల్లు అర్జున్ అభిమానులపై స్వల్పంగా లాఠీ లార్జ్ జరిగింది. ఏమైంది? అనే వివరాల్లోకి వెళితే...


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులతో ఫొటోలు దిగుతారనే సమాచారంతో చాలా మంది అభిమానులు గీతా ఆర్ట్స్ ఆఫీసుకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఆ తర్వాత అక్కడ కాదని, ఎన్ కన్వెషన్ సెంటర్ అని తెలియడంతో అక్కడికి వెళ్లారు. చివరకు, బన్నీతో ఫొటోషూట్ క్యాన్సిల్ అని తెలియడంతో అభిమానులకు కోపం వచ్చింది. అద్దాలు పగలగొట్టినట్టు తెలుస్తోంది. దాంతో అభిమానులను అక్కడి నుంచి పంపడానికి పోలీసులు స్వల్పంగా లాఠీ ఛార్జ్ చేశారు. ఈ విషయం తెలిసిన అల్లు అర్జున్ స్పందించారు.


"ఇవాళ ఫ్యాన్స్ మీట్ ఈవెంట్‌కు వ‌చ్చిన అభిమానులు గాయపడిన దురదృష్టకర సంఘటన గురించి నాకు తెలిసింది. ప్రస్తుత పరిస్థితిని నా టీమ్ పర్యేవేక్షించడంతో పాటు ఎప్పటికప్పుడు నాకు సమాచారం అందిస్తున్నారు. భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా జాగ్రత్త పడతాను. అభిమానుల ప్రేమ, ఆరాధనే నాకు పెద్ద ఆసక్తి. అభిమానులను అలుసుగా తీసుకోను" అని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. 







Also Read: కార్తీక్ ఆచూకీ కోసం ఫస్ట్ స్టెప్ వేసిన మోనిత.. డాక్టర్ బాబుకి క్లాస్ పీకిన దీప.. ‘కార్తీకదీపం’ డిసెంబర్ 13 ఎపిసోడ్
Also Read: అర్థరాత్రి వరకూ చాటింగ్, పొద్దున్నే గులాబీలతో స్వాగతం.. పట్టాలెక్కిన రిషి-వసుధార లవ్ ట్రాక్..
Also Read: డాక్టర్ బాబుని అవమానించిన పిల్లలు… రుద్రాణి వలలో దీప చిక్కుకుంటుందా, కార్తీక దీపం ఈ రోజు ఎపిసోడ్
Also Read: బిగ్‌ బాస్‌లో మెరిసిన టీఆర్ఎస్ ఎంపీ.. వెయ్యి ఎకరాల అడవి దత్తత తీసుకుంటానని నాగార్జున హామీ
Also Read: బన్నీతో సమంత 'నాటు' స్టెప్.. ఊరమాస్ ఉందే..
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి