టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ అకస్మాత్తుగా తెలుగు బిగ్‌బాస్‌ షోలో సందడి చేశారు. హోస్ట్ నాగార్జునతో కలిసి వేదికను పంచుకున్నారు. ఎంపీ సంతోష్‌ కుమార్‌ చేపట్టిన గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ ప్రచారానికి గానూ ఆయన ఈ బిగ్ బాస్ షోకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తాను వెయ్యి ఎకరాల అడవిని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని హీరో అక్కినేని నాగార్జున ఈ షోలో ప్రకటించారు. అడవుల పరిరక్షణ కోసం గ్రీన్‌ చాలెంజ్‌ కార్యక్రమం ద్వారా ఎంపీ సంతోష్‌ కుమార్‌ ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. ఆయన స్ఫూర్తితోనే అడవిని దత్తత తీసుకుంటున్నట్టు వెల్లడించారు. అనంతరం బిగ్‌బాస్‌ హౌస్‌లో మొక్క నాటారు.


వాతావరణ మార్పులను అడ్డుకోవాలంటే ప్రజలంతా బాధ్యతగా మొక్కలు నాటాలని ఎంపీ సంతోష్ కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు. మన ఊరి కోసం, భవిష్యత్‌ తరాల కోసం ప్రతి ఒక్కరూ ప్రతి చోటా మొక్కలు నాటాలని కోరారు. గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. ‘‘సంతోష్‌కుమార్‌ పట్టుదలతో 16 కోట్ల మొక్కలు నాటారు. మనమంతా ఎన్ని నాటగలం. నేను వచ్చే మూడు వారాలు మూడు మొక్కలు నాటుతానని ప్రమాణం చేస్తున్నా. నాకు అడవులంటే చాలా ఇష్టం. ఎక్కడ చూపిస్తే అక్కడ అడవిని దత్తత తీసుకుంటా’ అని నాగార్జున హామీ ఇచ్చారు. అయితే, హైదరాబాద్ చుట్టు పక్కల ప్రాంతాల్లో అడవులు ఉన్నాయని వాటిని దత్తత తీసుకోవచ్చని ఎంపీ తెలిపారు.


బిగ్ బాస్ హౌస్‌లో మొక్క
‘‘బిగ్‌బాస్‌ హౌస్‌లో నేను మొక్క నాటుతున్నా. మీరు కూడా మీ ఇళ్లల్లో, గ్రామంలో, మండలంలో, నియోజకవర్గంలో మొక్కలు నాటండి. ఈ కార్యక్రమాన్ని ఎంత ఎక్కువగా ముందుకు తీసుకెళ్తే మనకు అంత ప్రయోజనం. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. ముఖ్యమంత్రి స్ఫూర్తితోనే గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ను ముందుకు తీసుకెళ్తున్నా. నాలుగేళ్లుగా అందరి సహకారంతో విజయవంతంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ ముందుకు సాగుతుంది. గ్రీన్‌ చాలెంజ్‌ను విజయవంతం చేస్తున్నవారందరికీ థ్యాంక్స్. హీరో ప్రభాస్‌ కూడా తన తండ్రి పేరుపై 1,643 ఎకరాల్లో ఉన్న కాజీపల్లి అడవిని, హెటిరో డ్రగ్స్‌ పార్ధసారథిరెడ్డి 2,500 ఎకరాల అడవులను దత్తత తీసుకున్నారు. తాము నిరంతరం మొక్కల యజ్ఞం చేస్తున్నాం. శక్తి ఉన్నంతవరకు దీనిని ముందుకు తీసుకెళ్తూనే ఉంటాం.’’ అని స్పష్టం చేశారు.


Also Read: ముగిసిన శిల్పా చౌదరి పోలీస్ కస్టడీ... రూ. 7 కోట్లు తిరిగిచ్చేందుకు అంగీకారం..!


Also Read: పగలు రెక్కీ రాత్రి చోరీలు... పాత నేరస్థుడి పక్కా ప్లాన్... సరూర్ నగర్ చోరీ కేసును ఛేదించిన పోలీసులు


Also Read: షాకింగ్... ఆస్పిరిన్ ట్యాబ్లెట్ల వల్ల గుండె ఆగిపోయే ప్రమాదం ఎక్కువ, కొత్త అధ్యయన ఫలితం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి