ఒక ప్రాణం కళ్లముందు విలవిల్లాడుతుంటే చూస్తూ ఉరుకుంటారా అని డాక్టర్ బాబుని దీప నిలదీస్తుంది. ఇప్పుడు నేను డాక్టర్ కాదు..నా డాక్టర్ పట్టా రద్దు చేశారు, డాక్టర్ గా కొనసాగకుండా చేశారు ఇప్పుడు నేను డాక్టర్ కాదంటాడు కార్తీక్. డాక్టర్ బాబు కొత్తగా మాట్లాడుతున్నారేంటి అని అంటుంది దీప. దయచేసి అలా పిలవొద్దు నువ్వు డాక్టర్ బాబు అన్న ప్రతిసారీ నేను చేసిన పాపమే గుర్తొస్తోందంటాడు కార్తీక్.  సర్దిచెప్పడంలో భాగంగా మళ్లీ డాక్టర్ బాబు అని పిలవడంతో.. మళ్లీ మళ్లీ డాక్టర్ బాబు అనొద్దు వినలేకపోతున్నాను అంటాడు కార్తీక్. వృత్తి వదిలేశారు, వృత్తికి దూరమయ్యారు కానీ మీరు మానవత్వానికి కూడా దూరమయ్యారా, నిండు గర్భిణి నొప్పులు పడుతోంది, ఇంతకుముందు కాన్పులు పోయాయి, మీరు మాత్రం ఇలా ఎలా ఉండగలుగుతున్నారని ప్రశ్నిస్తుంది.  నేను ఆ పేషెంట్ చనిపోయినప్పుడే చనిపోయా ఇప్పుడు నువ్వు మానవత్వం గురించి మాట్లాడతున్నావు దీప అంటాడు కార్తీక్. మీరేనా ఇలా మాట్లేడేది కళ్లముందే రెండు ప్రాణాలు కొట్టుకుంటుంటే ఇలా చూస్తూ ఊరుకుంటారా. మీరు శ్రీవల్లికి ఇక్కడే పురుడు పోయగలరు, ఏదో ఒక సాయం చేయగలరు కానీ చేయలేదు. ఇక్కడికి ఆసుపత్రి ఎంతదూరం ఉందో ఏమో దారి మధ్యలో ఏమైనా జరిగితే అనగానే కార్తీక్ ఆపెయ్ దీప అంటాడు. నన్ను ఆపమనొచ్చు కానీ ఆ పాపం మనకి చుట్టుకోదా అని అంటుంది దీప. మీరు వైద్య వృత్తికి అధికారికంగా దూరమయ్యారు కానీ సాటి మనిషిని ఆదుకోవడానికి ఏమైందని ప్రశ్నిస్తుంది. ఈ ఇల్లు ఎవరిది అనుకుంటున్నారనని అడిగితే ఎవరిదో రుద్రాణిది అన్నారుగా చెబుతాడు కార్తీక్. ఈ ఇల్లు శ్రీవల్లిది అప్పు తీర్చలేదని వాళ్ల సామాన్లు బయటపడేశారు వాళ్లు చెట్టుకింద ఉంటున్నారు. వాళ్లకి మనం ఎవరో తెలియకపోయినా ఇన్ డైరెక్ట్ గా సాయం చేశారు. భూమిలోంచి పెరిగే కొబ్బరి చెట్టు తియ్యని నీళ్లు ఇస్తుంది..కానీ ఆ నీళ్లు భూమి రుచి చూడదు కదా. సాయం అంటే సాయం చేసే మనిషి అంతే అంటుంది. నేనిప్పుడే వస్తాను నువ్వు పిల్లల దగ్గర ఉండు అని దీపని లోపలకి పంపిస్తాడు కార్తీక్.


మరోవైపు మోనిత కార్తీక్ గురించి ఆలోచిస్తూ సౌందర్య అన్న మాటలు గుర్తుచేసుకుంటూ  ఫోన్ ట్రై చేస్తుంది. బిచ్చగాడి చేతిలో ఫోన్ ఉండడంతో ఫోన్ లిఫ్ట్ చేస్తాడు.. వెంటనే మోనిత కార్తీక్ ఎక్కడికివెళ్లిపోయావ్, ఏమైపోయావ్ అని ప్రశ్నలు వేస్తుంది. ఒరేయ్ అని మాట్లాడడంతో మర్యాదగా మాట్లాడండి అని బిచ్చగాడు అంటాడు. కార్తీక్ ఏమయ్యాడని మోనిత అడగడంతో డబ్బులిస్తే చెబుతా అంటాడు. అకౌంట్ డీటేల్స్ చెప్పి ఐదువందలో వెయ్యండి మేడం అనగానే ఏకంగా 25వేలు వేస్తుంది మోనిత. షాకైన బిచ్చగాడు కార్తీక్ ..భార్య , ఇద్దరు పిల్లలతో సహా బస్సెక్కి వెళ్లిపోయాడని ఆ ఫోన్ తనకు దొరికిందని చెబుతాడు. ఇంతకు మించి ఏమీ తెలియదంటాడు. సౌందర్య ఆంటీకి దీప ముద్దుల కోడలు కాబట్టి ఈ విషయం ఆవిడకు తెలియకుండా ఉంటుందా.. నాకే తెలిసిందంటే వాళ్లకు తెలియదా అని ఆలోచిస్తుంది. దీప ఆంటీకి చెప్పకుండా వెళుతుందా..వీళ్లంతా తెలిసి కూడా దాస్తున్నారా..ఆంటీ మీరు గేమ్ ఆడితే నేను డబుల్ గేమ్ ఆడుతా అంటుంది. ఇంటి బయటే ఉండిపోయిన కార్తీక్... శ్రీవల్లికి సాయం చేయలేకపోయా కనీసం వాళ్ల సామాన్లు సర్దైనా సాయం చేద్దాం అనుకుంటాడు.  సామాన్లు సర్దుదాం అనుకున్నప్పుడు రుద్రాణి మనుషులు వచ్చి అడ్డుకుంటారు. ఈ ఊరికి కొత్తా ఇది రుద్రాణి సామ్రాజ్యం అంటారు. ఎవరైనా మనుషులే కాదా..మీ అక్క చేసింది తప్పు అంటాడు కార్తీక్. మాటా మాటా పెరిగి సినిమా రేంజ్ లో డాక్టర్ బాబుకి ఓఫైట్ చేసి వాళ్ల ముగ్గుర్నీ చావగొడతాడు. మమ్మల్నే కొడతావా నువ్వు అయిపోయావ్ అంటూ వాళ్లు అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇక మోనిత ..బిచ్చగాడు చెప్పిన మాటలు గుర్తుచేసుకుంటుంది. నేను ఫోన్ చేస్తానని ,నా నుంచి తప్పించుకోవాలని ఫోన్ వదిలేశావ్ కదా.. నానుంచి ఎంతవరకూ తప్పించుకోగలవు, మొబైల్ సిగ్నల్స్ లేని దగ్గరకు కూడా మోనిత ప్రేమ సిగ్నల్స్ చేరుకుంటాయంటుంది. 


ఇక సౌందర్య దేవుడి ముందు కన్నీళ్లతో నమస్కారం చేస్తుంది. ఇంకా ఎన్ని కష్టాలు పెడతావు, పదకొండేళ్లు ఎన్నో బాధలు పడ్డారు, అంతా సర్దుమణిగింది సంతోషంగా రుఉంటారని భావిస్తే మోనిత రూపంలో కష్టం మొదలైంది. ఇన్ని జరిగినా నా పెద్ద కోడలు పెద్దమనుసుతో అన్నీ సహించింది. గెలిచింది అనుకుంటే ఉన్నపళంగా అంతా ఇల్లొదిలి వెళ్లిపోయారు, ఎక్కడన్నారో , ఎలా ఉంటున్నారో, ఏం తింటున్నారో నీకే తెలియాలి ఈశ్వరా..వాళ్ల మనసు మార్చి నువ్వే రప్పించాలి అన్నీ ఉన్నా ఏవీ లేనివారై అందరూ ఉన్నా ఎవ్వరూ లేనివారై ఎక్కడున్నారో కనీసం వాళ్ల ఆచూకీ అయినా తెలిసేలా చేయి స్వామీ అని ఏడుస్తున్న సౌందర్యని భర్త ఆనందరావు ఓదార్చుతాడు. దేవుడిని ఏం కోరుకున్నావ్ సౌందర్య అంటే... దేవుడు కదా అండీ ఆయనకు అన్నీ తెలుసుకదా కానీ నోరు తెరిచి అడగలేదని అనుకోకుండా నా పిల్లలు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకున్నానంటుంది. ఏం జరిగినా చూస్తూ ఉండడమే అంటూ ఏడవకు సౌందర్య నువ్వు ఏడుస్తుంటే నేనేం కావాలంటాడు ఆనందరావు.  డాక్టర్ బాబు ఇంటి బయట చెట్టుకింద నిల్చుని ఆలోచనలో పడతాడు. ఎదురుగా సౌర్య,హిమ ఆడుకుంటుంటే చూస్తుంటాడు. శ్రీవల్లి నొప్పులుపడుతుంటే తాను దూరంగా నిలిచిపోయిన విషయం, పెషెంట్ ని చంపేశావ్ కార్తీక్, నీ డాక్టర్ పట్టా రద్ద చేశారు అన్నవిషయాలు గుర్తుచేసుకుంటాడు. తండ్రి దగ్గరకు వెళ్లిన హిమ,శౌర్య నాన్న అమ్మ ఇంకా రాలేదేంటని అడుగుతారు. వస్తుందిలే అమ్మ అని చెప్పి ఇద్దర్నీ తీసుకెళ్లి ఓ దగ్గర కూర్చుంటాడు. మీకో విషయం చెప్పాలమ్మా అని కార్తీక్ అనగానే ఏంటి నాన్న మనం ఇక్కడి నుంచి వెళ్లిపోతున్నామా అంటారు. ఇక్కడ ఎవ్వరికీ నేను డాక్టర్ అని చెప్పకూడదంటాడు కార్తీక్. 


కార్తీక దీపం మంగళవారం ఎపిసోడ్ లో
నువ్వు వంటలు చేయగలవా అంటుంది ఓ మనిషి. ఎలాంటి వంటకం అయినా అద్భుతంగా చేస్తా అంటుంది దీప. అయితే కొన్నాళ్లు ఈ మధ్యాహ్నం భోజనం పథకం పనులు చూసుకోమంటుంది. మరోవైపు మీ నాన్న ఏం చేస్తారని ఎవరైనా అడిగితే ఏం చెప్పాలంటాడు పిల్లలు..ఎరువుల కొట్లో అకౌంట్స్ రాస్తారని చెప్పమంటాడు. పిల్లలు మీనాన్న ఏం చేస్తారని ప్రశ్నించడంతో ఎరువుల కొట్లో అకౌంట్స్ రాస్తాడంటూ ఏడుస్తూ సమాధానం చెబుతారు హిమ, శౌర్య. 


Also Read: నెలకు రెండుసార్లు మంటతో స్నానం చేసే అమ్మవారు..
Also Read: భారతదేశం అనే పేరుకి కారణం ఒకరు, గోదావరి నదిని భూమిపైకి తీసుకొచ్చింది మరొకరు.. ఈ ఏడుగురి కథే వేరు..
Also Read: శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించిన రోజు ఇదే... ఈ నెలంతా ప్రత్యేకమే
Also Read: స్వర్గానికి షార్ట్ కట్! రూట్ మ్యాప్ క్లియర్‌గా ఉందిగా!  
Also Read: ఫెంగ్‌షుయ్ ప్రకారం ఆ రెండు బొమ్మలు ఇంట్లో ఉంటే భార్య భర్తల మధ్య ప్రేమ పెరుగుతుందట
Also Read: కిచెన్లో పూజామందిరం పెట్టేశారా... దేవుడి మందిరం ఎక్కడ ఉండాలి..ఎక్కడ ఉండకూడదు...
Also Read: ఔను.. అది రాముడి కట్టిన వారధి ! నిర్మాణానికి ఎన్ని రోజులు పట్టిందంటే..
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి