AP Rain Updates: ఈశాన్య దిశ నుంచి వీస్తున్న బలమైన గాలుల ప్రభావం దక్షిణాది రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలపై ఉంటుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. తక్కువ ఎత్తులో బంగాళాఖాతం తీర ప్రాంతాల్లో, తమిళనాడు, ఏపీ తీరం వెంట బలమైన గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఏపీలో మరో 48 గంటలు వర్షాలు కురవనున్నాయి. తమిళనానడు, పుదుచ్చేరి, కేరళ, అండమాన్ నికోబార్ తదితర ప్రాంతాల్లోనూ నేటి నుంచి ఐదు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భాతర వాతావరణ కేంద్రం వెల్లడించింది.
ఏపీలో నేడు, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో రెండు రోజులపాటు తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. అక్కడక్కడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఉరుములు మెరుపులతో కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల వాసులు మరో రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలని.. బలమైన గాలులు వీచకపోతేనే వేటకు వెళ్లాలని మత్స్యకారులకు సూచించారు. దక్షిణ కోస్తాంధ్రలో నేడు తేలికపాటి వర్షాలు కురవనుండగా.. రేపు కొన్ని ప్రాంతాల్లో చిరు జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
రాయలసీమలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగిపోర్లుతున్నాయి. కొన్ని చోట్ల ప్రవాహం కారణంగా దెబ్బతిన్న రోడ్లను ప్రభుత్వం పరిశీలించి, మరమ్మతులు చేపట్టింది. రాయలసీమలోనూ రెండు రోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. పగటి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతాయని అధికారులు తెలిపారు. భారీ వర్షాలు కురిసే అవకాశమే లేదని క్లారిటీ ఇచ్చారు.
Also Read: Gold-Silver Price: మళ్లీ స్వల్పంగానే పెరిగిన బంగారం.. రూ.200 ఎగబాకిన వెండి, నేటి ధరలు ఇవీ..
తెలంగాణ వెదర్ అప్‌డేట్..
రాష్ట్రంలో చల్ల గాలుల ప్రభావంతో పగటి ఉష్ణోగ్రత సైతం భారీగా తగ్గుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరో ఐదు రోజులు వాతావరణంలో పెద్దగా మార్పులేమీ ఉండవని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. పగటి ఉష్ణోగ్రతలు ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం లోని కొన్ని ప్రాంతాల్లో భారీ పడిపోతాయని తెలిపింది. వాతావరణం చల్లగా ఉన్నందున ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని కోవిడ్ నిబంధనలు పాటించకపోతే కరోనా వ్యాప్తి పెరిగే అవకాశం ఉందని అధికారులు రాష్ట్ర ప్రజలను హెచ్చరించారు.
Also Read: Cheddi Gang: చెడ్డీ గ్యాంగ్ మూలాలు తెలుసా.. వాళ్లు నరరూప రాక్షసులుగా ఎందుకు మారారు?