తెలంగాణలో స్థానిక సంస్థల కోటాలోని ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ సత్తా చాటింది. ఎన్నికలు జరిగిన 6 స్థానాలనూ గెలుచుకుని క్లీన్‌ స్వీప్‌ చేసింది. మొత్తం 12 స్థానాలు ఖాళీ కాగా అందులో 6 స్థానాలు ఏకగ్రీవం అయిన సంగతి తెలిసిందే. ఇటీవల 6 స్థానాలకు ఎన్నికలు జరగ్గా అన్నింటినీ టీఆర్ఎస్ పార్టీ తన ఖాతాలో వేసుకుంది. నల్గొండ, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. నల్గొండలో కోటిరెడ్డి, ఖమ్మంలో తాతా మధు, కరీంనగర్‌-1లో భాను ప్రసాద్‌, కరీంనగర్‌-2లో ఎల్‌.రమణ, ఆదిలాబాద్‌లో దంతె విఠల్‌, మెదక్‌లో యాదవ రెడ్డి విజయం సాధించారు.


నల్గొండలో..
నల్గొండ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ అభ్యర్థి కోటిరెడ్డి గెలుపొందారు. తొలి ప్రాధాన్యత ఓట్లలో కోటి రెడ్డికి 917 ఓట్లు రాగా, స్వతంత్ర అభ్యర్థి నగేష్ కు 226 ఓట్లు వచ్చాయి. మొత్తం 1,233 ఓట్లు పోలయ్యాయని ఎన్నికల అధికారులు తెలిపారు.


ఖమ్మంలో..
ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల్లో 238 ఓట్ల మెజారిటీతో గెలిచిన టీఆర్ఎస్ అభ్యర్థి తాత మధు గెలిచారు. 
ఇక్కడ మొత్తం పోల్ అయిన ఓట్లు - 738
టీఆర్ఎస్ - 480
కాంగ్రెస్ - 242
ఇండిపెండెంట్ అభ్యర్థి - 4
చెల్లని ఓట్లు - 12


మెదక్‌లో..
మెదక్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి యాదవ రెడ్డి గెలుపొందారు. 
వంటేరి యాదవ రెడ్డి (టీఆర్ఎస్) - 585
నిర్మల తురుపు (కాంగ్రెస్) - 202
మట్టా మల్లారెడ్డి (స్వతంత్ర) - 2



కరీంనగర్‌లో..
కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కరీంనగర్‌-1లో టీఆర్ఎస్ అభ్యర్థి భాను ప్రసాద్‌, కరీంనగర్‌-2లో టీఆర్ఎస్ అభ్యర్థి ఎల్‌.రమణ విజయం సాధించారు.
మొత్తం పరిగణించిన ఓట్లు - 1303
చెల్లని ఓట్లు - 17
టి.భాను ప్రసాద్ - 585
ఎల్.రమణ - 479
సర్దార్ రవీందర్ సింగ్ - 232
స్వతంత్రులు - 11


ఆదిలాబాద్‌లో..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఘన విజయం సాధించారు. ఇక్కడ మొత్తం 862 ఓట్లు పోలయ్యాయి. 
టీఆర్‌ఎస్‌ అభ్యర్థి దండె విఠ‌ల్‌ - 740 
స్వతంత్ర అభ్యర్థి పుష్కరం - 74 
చెల్లని ఓట్లు - 48


తాజా ఎమ్మెల్సీ ఫలితాలతో శాసన మండలిలో వివిధ పార్టీల బలాబలాలు మారాయి. తాజా మార్పులతో టీఆర్ఎస్‌కు 35, కాంగ్రెస్‌కు 1, ఎంఐఎంకు 2 సహా మరో ఇద్దరు స్వతంత్ర సభ్యుల బలం మండలిలో ఉంది. తెలంగాణ మండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 40 కాగా, ఇందులో 34 మందిని వివిధ కోటాల్లో ఎన్నుకుంటారు. మరో 6 నామినేటెడ్ పదవులు.


Also Read: Warangal: భార్య తోడు కోసం ఇద్దరు భర్తల పోరాటం.. మొదటి భర్తకు ట్విస్ట్, ఆ తర్వాత ఇద్దరికీ షాక్!


Also Read: అబద్దాలతో బురిడీ కొట్టిస్తున్న శిల్పా చౌదరి - మరోసారి కస్టడీ కోరిన పోలీసులు !


Also Read: అత్త గొంతుపై గడ్డ పారతో పొడిచి చంపిన అల్లుడు, ఆ తర్వాత భార్యపై కూడా.. ఇంతలో..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి