Char Dham Road Project: చార్‌ధామ్ జాతీయ రహదారి ప్రాజెక్టుకు సుప్రీం గ్రీన్‌ సిగ్నల్

ABP Desam Updated at: 14 Dec 2021 02:31 PM (IST)
Edited By: Murali Krishna

చార్‌ధామ్ జాతీయ రహదారి ప్రాజెక్టుపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.

చార్‌ధామ్ జాతీయ రహదారి ప్రాజెక్టుకు సుప్రీం గ్రీన్‌ సిగ్నల్

NEXT PREV

చార్​ధామ్​ జాతీయ రహదారి ప్రాజెక్టులో రోడ్డు విస్తరణకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. ఈ ప్రాజెక్టుకు సుప్రీం కోర్టు అనుమతులిచ్చింది . ప్రాజెక్టుపై నివేదికను రూపొందించి, దానిని నేరుగా తమకు అందించాలని ఆదేశించింది. 






జాతీయ భద్రత..



సరిహద్దు భద్రత, బలగాలు, పరికరాల తరలింపు చాలా ముఖ్యం. జాతీయ భద్రత దృష్ట్యా ఈ ప్రాజెక్టుకు అనుమతిస్తున్నాం.                                     -   సుప్రీం ధర్మాసనం


ఇందుకోసం మాజీ న్యాయమూర్తి జస్టిస్​ ఏకే సిక్రి నేతృత్వంలో కమిటీని సుప్రీం కోర్టు ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి రక్షణశాఖ, రోడ్డు రవాణాశాఖ, ఉత్తరాఖండ్​ ప్రభుత్వం, అన్ని జిల్లాల మెజిస్ట్రేట్​లు సహకారం అందించాలని జస్టిస్​ డీవై చంద్రచూడ్​తో కూడిన సుప్రీం ధర్మాసనం ఆదేశించింది.


ఉత్తరాఖండ్​లోని యమునోత్రి, గంగోత్రి, కేదార్​నాథ్​, బద్రీనాథ్​లను కలుపుతూ 900 కిలోమీటర్ల వ్యూహాత్మక ప్రాజెక్టును కేంద్రం తలపెట్టింది. ఈ ప్రాజెక్టు విలువ రూ. 12 వేల కోట్లు.


ఇదే పిటిషన్..


చైనా సరిహద్దు వరకు నిర్మించాల్సిన ఈ ప్రాజెక్టులో క్యారేజ్​ వే వెడల్పును 5.5 మీటర్లకు మార్చాలని 2018లో సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాల్లో మార్పులు చేయాలని కోరుతూ ఈ ఏడాది సెప్టెంబర్​లో సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది కేంద్రం. ఎట్టకేలకు సుప్రీం కోర్టు ఇందుకు అంగీకరించింది.


Also Read: PM Modi: కాశీ వీధుల్లో కాలినడకన ప్రధాని మోదీ.. అర్ధరాత్రి ఆకస్మిక తనిఖీలు


Also Read: Corona Cases: దేశంలో భారీగా తగ్గి కరోనా వ్యాప్తి.. పెరిగిన ఒమిక్రాన్ కేసులు


Also Read: Elon Musk: అద్దె ఇంట్లో అపర కుబేరుడు, టెస్లా అధినేత ఎలన్ మస్క్


Also Read: ఈ బ్యాంకు హోమ్‌ , కార్‌ లోన్లపై వడ్డీరేట్లు తగ్గించింది.. ఎంతో తెలుసా?


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి  

Published at: 14 Dec 2021 02:30 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.