అక్కినేని నాగార్జున, ఆయన తనయుడు నాగ చైతన్య హీరోలుగా నటిస్తున్న సినిమా 'బంగార్రాజు'. 'సోగ్గాడే చిన్న నాయనా'కు ప్రీక్వెల్. రూర‌ల్ బ్యాక్‌డ్రాప్‌లోని కథతో సోగ్గాడిగా నాగార్జున ఇరగదీశారు. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్, రమ్యకృష్ణ యాక్టింగ్ కూడా ఆ సినిమాకు హైలైట్. నాగార్జున, రమ్యకృష్ణ జోడీతో పాటు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వానికి ఇప్పుడు నాగ చైతన్య, కృతీ శెట్టి జోడీ తోడు అయ్యింది. అంతే కాదు... ఈ సినిమాలో 'జాతి రత్నాలు' ఫేమ్ ఫరియా అబ్దుల్లా ఓ స్పెషల్ సాంగ్ చేశారు. ఆ పాటను ఈ నెల 17వ తేదీన 17 గంటల 12 సెకన్లకు విడుదల చేస్తామని నాగార్జున ట్వీట్ చేశారు. మ్యూజికల్ మోషన్ పోస్టర్, అందులో లిరిక్స్ సాంగ్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేసే విధంగా ఉన్నాయని చెప్పాలి.





'ఓయ్... బంగ్గారాజు! నువ్వు పెళ్లి చేసుకుని వెళ్లిపోతే బంగార్రాజు... మాకు ఇంకెవ్వడు కొనిపెడతాడు కోకా బ్లౌజు?' అంటూ సాంగ్ స్టార్ట్ కానుందని మ్యూజికల్ మోషన్ పోస్టర్ చూస్తే అర్థం అవుతోంది. ఈ పాటను గీతా మాధురి పాడినట్టు ఉన్నారు. అనూప్ రూబెన్స్ మాంచి మాస్ బీట్ ఇచ్చారు. ఫరియా అబ్దుల్లాతో నాగార్జున, నాగ చైతన్య స్టెప్పులు వేశారు. 'పార్టీ సాంగ్ ఆఫ్ ద ఇయర్' పేరుతో ఈ పాటను విడుదల చేస్తున్నారు. 


Also Read: తూరుపు కొండలు వెలిగిద్దాం... విప్లవ గీతం వినిపిద్దాం! - రవన్న పాత్రలో రానా విప్లవ గళం విన్నారా?
Also Read: అమెరికాలో బాలకృష్ణ క్రేజ్ అన్‌స్టాప‌బుల్‌... మరో రికార్డ్ క్రియేట్ చేసిన 'అఖండ'
Also Read: కార్తీకదీపం సీరియల్ లో ఈ రోజు షాకింగ్ ట్విస్ట్.. మోనిత బిడ్డ మాయం, రుద్రాణిని లాగిపెట్టి కొట్టిన దీప, హర్ట్ అయిన డాక్టర్ బాబు..
Also Read: తొలిచూపులోనే వసుధారకి పడిపోయిన గౌతమ్, రిషిని హెల్ప్ చేయమంటూ షాకింగ్ ట్విస్ట్..
Also Read: మళ్లీ ఇటువంటివి జరగనివ్వను... అభిమానులకు అల్లు అర్జున్ హామీ!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి