మీ నాన్న డాక్టర్ అని ఎవ్వరితో చెప్పొద్ద్న కార్తీక్ తో ఎందుకు నాన్న అని పిల్లలు అడుగుతారు. డాక్లర్లందరికీ ప్రెసిడెంట్ కూడా అయ్యావ్ కదా అని అంటారు. మీ నాన్న ఇప్పుడు డాక్టర్ కార్తీక్ కాదు.. ఒట్టి కార్తీక్ అని అంటాడు. మా నాన్న ఫేమస్ డాక్టర్ అని అందరికీ చెప్పే వాళ్లం కదా కానీ ఇప్పుడు అబద్దం ఎందుకు చెప్పడం అంటారు పిల్లలు. నేను డాక్టర్ కానని చెప్పడం వల్ల ఎవ్వరికీ ఏ నష్టం లేదు కదా అన్న కార్తీక్ తో మరి మీ నాన్న ఏం చేస్తాడంటే ఏం చెప్పాలని ప్రశ్నిస్తుంది శౌర్య. ఎరువుల కొట్లో అకౌంట్స్ రాస్తాడని చెప్పండి అని కార్తీక్ అంటాడు. నాన్న ఎరువుల కొట్లోనా అని శౌర్య అంటుంది. ఏది ఒకసారి చెప్పండి పిల్లలు మీ నాన్న ఏం చేస్తాడు అని కార్తీక్ అడిగితే ఎరువుల కొట్లో అకౌంట్స్ రాస్తాడని పిల్లలు ఏడుస్తూ చెబుతారు. 
Also Read: కార్తీక్ ఆచూకీ కోసం ఫస్ట్ స్టెప్ వేసిన మోనిత.. డాక్టర్ బాబుకి క్లాస్ పీకిన దీప.. ‘కార్తీకదీపం’ డిసెంబర్ 13 ఎపిసోడ్
ఇక పని కోసం వెతికిన దీపకు స్కూల్లో మధ్యాహ్న భోజన పథకంలో వంటలు వండే పని దొరుకుతుంది. అవన్నీ నాకు తెలిసిన పనులే నన్ను అంతా వంటలక్క అని అంటారని   దీప తన గురించి చెబుతుంది. అడగ్గానే పని ఇస్తున్నారు జీతం ఎలా అడగలను అని దీప అంటుంది. ఈ పనులన్నీ ఇంతకుముందు శ్రీవల్లి చేసేది. కాన్పు కోసం హైదరాబాద్ వెళ్లిందని చెబుతారు.  ఇక శ్రీవల్లికి ఎలా ఉందో ఏంటో అని దీప ఆలోచిస్తుంది. ఆమెతో మాట్లాడుతున్న సమయంలోనే నాపేరు దీప, నేను కార్తీక్ భార్యను, పెద్దింటి కోడల్ని అని చెప్పిన మాటలు గుర్తుచేసుకుంటుంది. మరోవైపు కార్తీక్ చేతిలో దెబ్బలు తిన్న రౌడీలకు రుద్రాణి క్లాస్ పీకుతుంది. వాడెవ్వడో మిమ్మల్ని కొట్టి సామాన్లు లోపల పెట్టాడని అంటున్నారు, వాడొక్కడు మీరు ముగ్గురు వాడు మిమ్మల్ని కొట్టాడు.. ఏరా అబ్బులు పెద్ద గడ్డం, పిల్లి గడ్డం అంటూ సెటైర్లు వేస్తుంది రుద్రాణి. వాడు మమ్మల్ని కొట్టాడు అక్క అని మళ్లీ చెబుతారు. టమాటాలు కాపుకు వచ్చాయట. తోటకు పంపించండి అని చెప్పి రుద్రాణి వెళ్లిపోతుంది. 
Also Read: తనలో డాక్టర్ బాబుని కంట్రోల్ చేసుకున్న కార్తీక్.. ఇదేంటని ప్రశ్నించిన దీప.. మరింత ఎమోషనల్ గా మారిన కార్తీక దీపం సీరియల్
ఆనంద్ రావుగారికి బొమ్మలు కొందామంటే తలనొప్పి వస్తోందని చెప్పి చివర్లో హ్యాండ్ ఇచ్చింది..ప్రియమణికికాస్త ఎక్కువైందని అనుకుంటుంది. ఇక బాబును కారులోనే వదిలేసి షాపింగ్‌కు వెళ్లాలని మోనిత అనుకుంటుంది. ఏసీ వేస్తుంది, మళ్లీ ఆపేస్తుంది, గాలి ఆడదని అనుకుంటుంది. అలా గ్లాస్ కాస్త దించి వెళ్దామని అనుకుంటుంది. రోజులు బాగా లేవు ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్లలేను అనుకుంటూ ఓ బాబుని పిలిచి పిల్లాడిని చూడమని చెబుతుంది.  ఇక్కడ ఎంతసేపుంటావ్ అని ఆ బాబును అడుగుతుంది. 20 నిమిషాలుంటాను అని చెబుతాడు. అలా ఆ బాబు ఫోన్‌లో మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇంతలో ఓ వ్యక్తి వచ్చి బాబును ఎత్తుకెళ్తుంది. ఇక మోనితలో కంగారు మొదలవుతుంది. ఓ 30 ఏళ్లు ఉంటాయేమో యావరేజ్‌గా ఉంటాడని కొన్ని పోలికలు చెబుతాడు. దీంతో ఆ పని చేసింది ఆదిత్య అని మోనిత అనుకుంటుంది. ఇదంతా ఆదిత్య పనే మీ అంతు చూస్తాను అంటూ బయల్దేరుతుంది. కానీ కార్ స్టార్ట్ కాదు. ఇంతలో భవిత అని తన వద్ద పని చేసే స్టాప్ వస్తుంది. ఆమె స్కూటి తీసుకుని మోనిత బయల్దేరుతుంది.
Also Read: రిషి-వసుధార మధ్య చిచ్చుపెట్టేందుకు జగతిని టార్గెట్ చేసిన దేవయాని సక్సెస్ అయిందా.. గుప్పెడంత మనసు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే…
ఇంట్లో అందరూ సరదాగా ఉన్న క్షణాలు తలుచుకుంటూ కార్తీక్ బాధపడతాడు. పేరుకే పెద్ద కొడుకుని ఆ ఇంటి బాధ్యతలను మోసింది లేదు,  ప్రతీసారి అందర్నీ ఇబ్బంది పెట్టాను. వంశోద్దారక అని పిలిచేదానివి మమ్మీ చెడ్డ పేరు తెచ్చాను తప్ప ఉద్దరించింది లేదని అని కార్తీక్ బాధపడుతుంటాడు. ఇంతలో అక్కడకు వచ్చిన పిల్లలు అమ్మ ఎక్కడికి వెళ్లిందని అడుగుతారు.  వచ్చేశాను అంటూ వంటలక్క ఎంట్రీ ఇస్తుంది. అమ్మ షాపింగ్‌కు వెళ్లావా అని శౌర్య అంటే.. కూరగాయలను కొనడాన్ని షాపింగ్ అంటారా అని సెటైర్ వేస్తుంది. ఎక్కడికి వెళ్లావ్ అని కార్తీక్ అడిగితే మంచిని వెతుక్కుంటూ వెళ్లాను అంటుంది దీప. అంటే ఇక్కడ మంచి వాళ్లు లేరనా అని కార్తీక్ అంటాడు. నా ఉద్దేశ్యం అది.. మంచి జరగాలని వెళ్లాను అని దీప అంటే మరి జరిగిందా అంటాడు కార్తీక్. బోలెడంత మంచి జరిగింది నాకు స్కూల్‌లో పని వీళ్లకు స్కూల్‌లో అడ్మిషన్ కూడా దొరికింది అని చెప్పడంతో పిల్లలు ఎగిరి గంతులేస్తారు. మధ్యాహ్న భోజనం వండే పని దొరికిందని చెప్పడంతో పిల్లలు సంబరపడతారు. ఇలా వచ్చావో లేదో.. అలా పని సంపాదించావా నువ్ గ్రేట్ అమ్మ అంటుంది శౌర్య. ఏంటి దీప.. మళ్లీ వంటలక్క పని చేస్తున్నావా?. అని కార్తీక్ అంటాడు. పని కోసం వెళ్లాను. మన పిల్లల్ని కూడా చేర్చుకుంటామని అన్నారని దీప చెబుతుంది. అంటే రేపటి నుంచి మనం ముగ్గురం స్కూల్‌కి వెళ్తామా? మరి డాడీ ఒక్కడే ఇంట్లో ఉంటారా? అని పిల్లలు అంటారు. కార్తీక్ ముఖంలో బాధకనిపిస్తుంది .
Also Read: అర్థరాత్రి వరకూ చాటింగ్, పొద్దున్నే గులాబీలతో స్వాగతం.. పట్టాలెక్కిన రిషి-వసుధార లవ్ ట్రాక్..
ఏంటండి మీరు ఏమీ తినడం లేదు,  తాగడం లేదు, ఇలా అయితే మీ ఆరోగ్యం ఏం కావాలని  ఆనంద్ రావును ఉద్దేశించి సౌందర్య అంటుంది. నా ఆరోగ్యం ఏమైతే ఏముందిలే పెద్దోడు ఎక్కడికి వెళ్లాడో తెలియడం లేదని ఆనంద్ రావు బాధపడతాడు.. కార్తీక్ ఎక్కడున్నా దీప పక్కనే ఉంది కదా?. గెలిపిస్తుందని మీరే అన్నారు కదా? కార్తీక్ పక్కన దీప ఉంటే ఏం కాదు అని సౌందర్య ధైర్యం చెబుతుంది. ఈ రోజు ఎపిసోడ్ ముగిసింది. 
రేపటి ఎపిసోడ్ లో
రేపటి (బుధవారం) ఎపిసోడ్‌లో మెనిత కార్తీక్ కార్తీక్ అంటూ అరుస్తూ మన బాబును ఎవరో ఎత్తుకెళ్లారని చెబుతూ ఇంట్లోకి వెళుతోంది.  ఇక మరోవైపు రుద్రాణి తన ప్రతాపాన్ని చూపించేందుకు దీప ఇంటికి వస్తుంది. ఉండటానికే ఇల్లు లేదన్నావ్. ఈ సామాన్లు ఏంటని అడుగుతుంది. నేనే లోపల పెట్టాను అని కార్తీక్ అనడంతో తింటున్న అన్నాన్ని తంతుంది రుద్రాణి. మీరు మనిషేనా? అని కార్తీక్ అరిస్తుంటే పక్కకు నెట్టేస్తుంది. విశ్వరూపం చూపిన వంటలక్క రుద్రాణిని చెంపదెబ్బ కొడుతుంది. 
Also Read: కిచెన్లో పూజామందిరం పెట్టేశారా... దేవుడి మందిరం ఎక్కడ ఉండాలి..ఎక్కడ ఉండకూడదు...
Also Read: ఔను.. అది రాముడి కట్టిన వారధి ! నిర్మాణానికి ఎన్ని రోజులు పట్టిందంటే..
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి