రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటిస్తున్న సినిమా 'విరాటపర్వం'. వేణు ఊడుగుల దర్శకత్వం వహించారు. సురేష్ బాబు సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్, ఎస్.ఎల్.వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ రోజు (మంగళవారం, డిసెంబర్ 14) రానా దగ్గుబాటి పుట్టినరోజు సందర్భంగా 'ద వాయిస్ ఆఫ్ రవన్న' పేరుతో 'విరాటపర్వం' చిత్రబృందం ఓ టీజర్ విడుదల చేసింది. రవన్న పాత్రలో నటిస్తున్న రానా... టీజ‌ర్‌లో విప్లవ గళం వినిపించారు. వాస్తవ ఘటనల ఆధారంగా... 1990వ దశకంలో జరిగిన పోరాటాల స్ఫూర్తితో దర్శకుడు వేణు ఊడుగుల సినిమాను తెరకెక్కిస్తున్నారు.
 
'మారదులే... 
ఈ దోపిడీ దొంగల రాజ్యం మారలేదులే. 
రౌద్రపు శత్రువు దాడిని ఎదిరించే పోరాటం మనది. 
చలో... చలో... చలో... పరిగెత్తు
అడుగే పిడుగై రాలేదా? 
గుండెల దమ్మును చూపించు! 
చలో... చలో... పరిగెత్తు
చీకటి మింగిన సూర్యుని తెచ్చి తూరుపు కొండను వెలిగిద్దాం
వంగిన వీపుల బరువును దించి... విప్లవ గీతం వినిపిద్దాం.
చలో చలో పరిగెత్తుచలో పరిగెత్తు
దొరోని తలుపుకు తాళంలా?
గడియల ముంగింటకుక్కలా? 
ఎన్నాళ్లు? ఇంకెన్నాళ్లు?
చలో పరిగెత్తు... చలో పరిగెత్తు' అంటూ విప్లవ వీరుడిగా, రవన్న పాత్రలో రానా తన గళం వినిపించారు. టీజ‌ర్‌కు ఆయన వాయిస్ హైలైట్ అని ఆడియన్స్ అంటున్నారు. 





"ప్రజలు బిగించిన పిడికిలి అతడు.
ఆలీవ్ గ్రీన్ దుస్తుల్ని దరించిన అడవి అతడు.
ఆయుధమై  కదిలిన  ఆకాశం అతడు.
అరణ్య అలియాస్ 'రవన్న'' అని రానా పాత్రను 'విరాట పర్వం' టీమ్ ఇంట్రడ్యూస్ చేసింది.
'The Voice Of Ravanna' Teaser from VirataParvam Movie:


Also Read: అమెరికాలో బాలకృష్ణ క్రేజ్ అన్‌స్టాప‌బుల్‌... మరో రికార్డ్ క్రియేట్ చేసిన 'అఖండ'
Also Read: కార్తీకదీపం సీరియల్ లో ఈ రోజు షాకింగ్ ట్విస్ట్.. మోనిత బిడ్డ మాయం, రుద్రాణిని లాగిపెట్టి కొట్టిన దీప, హర్ట్ అయిన డాక్టర్ బాబు..
Also Read: తొలిచూపులోనే వసుధారకి పడిపోయిన గౌతమ్, రిషిని హెల్ప్ చేయమంటూ షాకింగ్ ట్విస్ట్..
Also Read: మళ్లీ ఇటువంటివి జరగనివ్వను... అభిమానులకు అల్లు అర్జున్ హామీ!
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి