స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి తారకరామారావు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి జరుగుతున్న ప్రతి ఎన్నికలోనూ టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తూ వస్తుందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల సాకారం కోసం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు నాయకత్వంలో ప్రభుత్వం అందిస్తున్న అద్భుతమైన పాలనకు, ప్రజలు ప్రతి ఎన్నికలలోనూ పట్టం కడుతున్నారన్నారు. తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ 12 స్థానాలకు 12 స్థానాలను టీఆర్ఎస్ పార్టీ గెలుచుకోవడం ద్వారా టీఆర్ఎస్ పార్టీ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అని మరోసారి నిరూపితమైందని అన్నారు.
టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన అనేక వినూత్న కార్యక్రమాలతో స్థానిక సంస్థలు ఎంతగానో బలోపేతమయ్యాయయని, ముఖ్యంగా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ద్వారా స్థానిక సంస్థలకు ప్రతినెల ఠంచన్ గా నిధులను అందిస్తూ స్థానిక సంస్థలను ఆర్థికంగానూ బలోపేతం చేస్తున్నామన్నారు. ప్రభుత్వం చేపట్టిన ఇలాంటి కార్యక్రమాల ఫలితంగానే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఘనమైన విజయం అందించారని అన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ అభ్యర్థులు అందరికీ అభినందనలు తెలిపిన కేటీఆర్, ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించిన స్థానిక సంస్థల ప్రతినిధులు అందరికీ మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
Also Read: TS MLC Election Results: ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్.. అన్ని స్థానాలు గులాబీ కైవసం
టీఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తి: ఎర్రబెల్లి
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం టీఆర్ఎస్ రాజకీయ ఆధిపత్యానికి నిదర్శనం అని అన్నారు. ‘‘టీఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అని మరోసారి రుజువైంది. శాసన మండలిలోని స్థానిక సంస్థల కోటా నుంచి జరిగిన ఎన్నికలలో మొత్తం 12 స్థానాలు గెలవడం, క్లీన్ స్వీప్ చేయడం గర్వకారణం. ఈ 12 సీట్లలో 6 స్థానాలను ఏకగ్రీవంగా గెల్చుకోవడం, పోలింగ్ జరిగిన ఆరింటిని భారీ మెజారిటీతో గెలవడం గర్వ కారణం’’ అని ఎర్రబెల్లి అన్నారు.
కేసీఆర్ వెంటే నల్గొండ జిల్లా: మంత్రి జగదీశ్ రెడ్డి
స్థానిక సంస్థల కోటాలో శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి విజయంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే నడుస్తుందని స్పష్టం అయిందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అందుకు సహకరించిన ఉమ్మడి నల్లగొండ జిల్లా శాసనసబ్యులకు, శాసన మండలి సబ్యులకు పార్టీ నేతలకు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రతిపక్షాల కుట్రలను తిప్పి కొట్టే విధంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు రాజకీయాలకు అతీతంగా బలపరిచినందుకు ఓటర్లకు మంత్రి జగదీష్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో టీఆర్ఎస్‌కు పెరుగుతున్న ప్రజాదరణకు ఇది దిక్సూచి అని ఆయన చెప్పారు. ఈ విజయంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పార్టీ బలోపేతమైన శక్తిగా రూపొందిందని అన్నారు.
Also Read: Gachibowli: గచ్చిబౌలిలో భారీ లూటీ.. ఇంట్లోకి వచ్చి ఫ్యామిలీనే బురిడీ కొట్టించి..
Also Read: Warangal: భార్య తోడు కోసం ఇద్దరు భర్తల పోరాటం.. మొదటి భర్తకు ట్విస్ట్, ఆ తర్వాత ఇద్దరికీ షాక్!
Also Read: Cheddi Gang: చెడ్డీ గ్యాంగ్ మూలాలు తెలుసా.. వాళ్లు నరరూప రాక్షసులుగా ఎందుకు మారారు?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి