ఎలక్ట్రానిక్ కారు కొనాలనుకున్నా.. రేటు ఎక్కువ అని ఆలోచిస్తున్నారా? అయితే రానున్న రోజుల్లో తక్కువ ధరలో బోలెడన్ని ఆప్షన్లు ఇవే.. వాటిలో రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల రేంజ్‌లో ఉండేవి ఇవే..
1. టొయోటా హైరైడర్
టొయోటా హ్యాచ్‌బ్యాక్ ఎలక్ట్రిక్ వాహనాన్ని త్వరలో లాంచ్ చేయనుందని తెలుస్తోంది. ఇది వ్యాగన్ ఆర్ బేస్ మీద రూపొందే అవకాశం ఉంది. కాకపోతే లుక్ కాస్త డిఫరెంట్‌గా ఉండే అవకాశం ఉంది. మనదేశంలో అత్యంత చవకైన ఎలక్ట్రిక్ వాహనం ఇదే అయ్యే అవకాశం ఉంది.
2. టాటా అల్ట్రోజ్ ఈవీ
ఇప్పటికే మనం టిగోర్ ఈవీని చూశాం. త్వరలో ఆల్ట్రోజ్ ఈవీని కూడా చూడనున్నాం. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రొడక్షన్ ప్రొటో టైప్‌ను ఆటో ఎక్స్‌పో 2020లో ఇప్పటికే చూశాం. దీని ధర టిగోర్ కంటే కొంచెం ఎక్కువగానూ, నెక్సాన్ కంటే కొంచెం తక్కువగానూ ఉండే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ వాహనాల్లో ప్రస్తుతం ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ నెక్సా మాత్రమే.
3. ఎంజీ ఈవీ ఎస్‌యూవీ
దీనికి ఎంజీ ఇంకా ఏ పేరూ పెట్టలేదు. అయితే దీన్ని మనదేశం కోసమే ఎంజీ రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఇది గ్లోబల్ ఎడిషన్ ఆధారంగా రూపొందింది. అయితే మనదేశంలో కోసం లోకలైజేషన్ చేయనున్నారు. తక్కువ ధరలోనే ఇది లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
4. హ్యుండాయ్ ఈవీ ఎస్‌యూవీ
హ్యుండాయ్ మాస్ మార్కెట్లో మొదటి ఎలక్ట్రిక్ వాహనాన్ని లాంచ్ చేయనుంది. ఈ మాస్ మార్కెట్ ఈవీ మనదేశంలో లాంచ్ అవ్వడానికి మూడేళ్ల వరకు సమయం పట్టవచ్చు. కానీ ఎస్‌యూవీ విభాగంలో లాంచ్ కానుండటంతో దీని రేంజ్ మిగతా ఎలక్ట్రిక్ వాహనాల కంటే ఎక్కువగా ఉండనుంది.
5. జీడబ్ల్యూఎం ఓరా ఆర్1
జీడబ్ల్యూఎం మనదేశంలో ఎప్పుడు లాంచ్ అవుతుందో తెలియరాలేదు. చివరిగా జరిగిన ఆటో ఎక్స్‌పోలో ఓరా ఆర్1ని ప్రదర్శించారు. ఇది ఒక చిన్న కార్ బ్రాండ్ కాబట్టి ఈ లిస్ట్‌లో అత్యంత చవకైనది అయ్యే అవకాశం ఉంది. దీని రేంజ్ కూడా 400 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉంది.
Also Read: Tata Punch: మరింత శక్తివంతమైన టాటా పంచ్ వచ్చేస్తుంది.. బడ్జెట్‌లోనే సూపర్ మోడల్స్!
Also Read: Kia Carens: కియా కొత్త కారు వచ్చేస్తుంది.. అదిరిపోయే ఫీచర్లు.. డిజైన్ సూపర్!
Also Read: డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పైరీ అయిందా.. ఆన్‌లైన్‌లో రెన్యూ.. ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు!
Also Read: New Hyundai Creta: హ్యుండాయ్ క్రెటా కొత్త వేరియంట్.. అదిరిపోయే డిజైన్.. ఎలా ఉందంటే?
Also Read: Best Budget Cars: సెలెరియో, వాగన్ ఆర్, శాంట్రో, టియాగో... రూ.ఐదు లక్షల్లోపు బెస్ట్ కార్ ఏది?