టెస్లా ఫౌండర్, బిలియనీర్ ఎలాన్ మస్క్ డోగీ కాయిన్‌ను పేమెంట్‌గా యాక్సెప్ట్ చేస్తామని ట్వీట్ చేశాడు. మీమ్స్ ఆధారంగా డిజిటల్ క్రిప్టో కరెన్సీ రూపొందించారు. ప్రస్తుతం టెస్టింగ్ పద్ధతిలో ఈ పేమెంట్‌ను అంగీకరిస్తామని తను ట్వీట్ చేశాడు.
ఈ సంవత్సరం క్రిప్టో మార్కెట్ ఎన్నో ఒడిదుడుకులకు లోనైంది. అందులో కొన్నిటికి మస్క్ ట్వీట్లు కూడా కారణం. డోగీ కాయిన్ మీద తను చేసిన కామెంట్లు క్రిప్టో కరెన్సీ విలువనే పెరిగేలా చేశారు. ‘డోగీ కాయిన్ కరెన్సీతో కొన్ని ఉత్పత్తులను టెస్లా విక్రయించనుంది. ఇది ఎలా పోతుందో చూద్దాం.’ అని ఆ ట్వీట్‌లో పేర్కొన్నాడు.
క్రిప్టోకరెన్సీపై ప్రపంచవ్యాప్తంగా ఎన్ని నిబంధనలు ఉన్నప్పటికీ.. రికార్డు స్థాయిలో క్రిప్టో ట్రేడింగ్ జరుగుతోంది. దీనికి సంబంధించిన లాభాలు కూడా కొంతమంది కళ్లజూశారు. ధరల్లో కూడా భారీ ఒడిదుడుకులు ఏర్పడ్డాయి. ఇటువంటి ప్రైవేటు నిర్వహణ ఉన్న కరెన్సీలు ఆర్థిక వ్యవస్థల మీద పట్టు సాధిస్తే.. వ్యవస్థకు ప్రమాదం ఏర్పడటంతో పాటు, ఆర్థిక నేరాలు జరిగే అవకాశం ఉందని ప్రపంచవ్యాప్తంగా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
టెస్లాలో వాటాలను కూడా ఎలాన్ మస్క్ విక్రయించినట్లు తెలుస్తోంది. 906.6 మిలియన్ డాలర్ల విలువైన షేర్లను ఎలాన్ మస్క్ విక్రయించినట్లు రెగ్యులేటరీ ఫైలింగ్స్‌లో పేర్కొన్నారు. టెస్లా షేర్లు విక్రయించినట్లు ఎలాన్ మస్క్ తెలపగానే కంపెనీ షేర్ విలువ 21 శాతం పడిపోయింది.