నట సింహ నందమూరి బాలకృష్ణ, దర్శక ధీరుడు రాజమౌళి ఇప్పటి వరకూ కలిసి సినిమా చేయలేదు. కానీ... ఒకరు అంటే మరొకరికి గౌరవం, అభిమానం. అదే 'అన్ స్టాపబుల్' లేటెస్ట్ ప్రోమోలో కనిపించింది. కొన్ని క్షణాల క్రితమే ఈ ప్రోమో విడుదల అయ్యింది. అచ్చ తెలుగు ఓటీటీ 'ఆహా' కోసం బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న టాక్ షో 'అన్ స్టాపబుల్'. ఇప్పటి వరకూ నాలుగు ఎపిసోడ్స్ రిలీజ్ అయ్యాయి. ఐదో ఎపిసోడ్ ఈ నెల 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది. దానికి రాజమౌళితో పాటు ఆయన పెద్దన్న, ప్రముఖ సంగీత దర్శకులు కీరవాణి అతిథులుగా వస్తున్నారని వెల్లడించారు. లేటెస్టుగా ప్రోమో విడుదల చేశారు.
రాజమౌళితో ఇంటర్వ్యూ ప్రోమో అయితే విడుదల చేశారు కానీ... ప్రోమోలో అసలు విషయం ఏదీ చెప్పలేదు. 'మీరు ఆల్రెడీ ఇంటిలిజెంట్ అని, అఛీవర్ అని అందరికీ తెలుసు. మరి, ఇంకా ఎందుకీ తెల్లగెడ్డం?' అని బాలకృష్ణ ప్రశ్నించారు. వెంటనే రాజమౌళి గడ్డం మీద చేతులు వేసి సరి చేసుకున్నారు. ఆ తర్వాత 'ఇప్పటి దాకా మన కాంబినేషన్ పడలేదు. నా అభిమానులు బాలయ్యతో సినిమా ఎప్పుడు? అని అడిగారు. మీ సమాధానం ఏంటి?' అని మళ్లీ బాలకృష్ణ ప్రశ్నించారు. అప్పుడు రాజమౌళి మీసం మెలేశారు. బాలకృష్ణ అక్కడితో ఆగలేదు. 'మీతో సినిమా చేస్తే... హీరోకి, ఇండస్ట్రీకి హిట్ ఇస్తారు. ఆ తర్వాత వాళ్ల (హీరోల) రెండు మూడు సినిమాలు ఫసక్ ఏ కదా?' అన్నారు. రాజమౌళి మళ్లీ ఏం సమాధానం ఇవ్వలేదు. ఏంటిది? అని బాలకృష్ణ అడిగితే... 'మీకు తెలుసు, నాకు తెలుసు, షూట్ చేసేవాళ్లకూ తెలుసు, అందరికీ తెలుసు... ఇది ప్రోమో అని! సమాధానాలు ఎపిసోడ్ లో చెబుతా' అని రాజమౌళి చెప్పారు. డిసెంబర్ 17న రిలీజ్ అయ్యే ప్రోమో కోసం ఆడియన్స్ ఇప్పటి నుంచి ఆసక్తిగా చెబుతున్నారు.
రాజమౌళి దర్శకత్వం వహించిన 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' జనవరి 7న విడుదల కానున్న సంగతి తెలిసిందే. అందులో నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించారు. ఆ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
Also Read: సమంత 'యశోద'లో వరలక్ష్మీ శరత్ కుమార్! ఆమె రోల్ ఏంటంటే?
Also Read: మరో క్లాసికల్ డాన్స్ పెర్ఫార్మన్స్‌కు రెడీ అయిన సౌజన్యా శ్రీనివాస్... త్రివిక్రమ్ వైఫ్
Also Read: ప్రకాష్ రాజ్ ఆర్ధికసాయంతో బ్రిటన్లో చదివి ఉద్యోగం సాధించిన పేద యువతి... హ్యాట్సాఫ్ సర్
Also Read: కొంత మంది వెనక్కి తగ్గారు.. కానీ అఖండతో మేం డేర్ స్టెప్ వేశాం: టిక్కెట్ల విధానంపై బాలయ్య
Also Read: రాజమౌళి డైరెక్షన్‌లో సినిమా ఎప్పుడు? ఇదీ అల్లు అర్జున్ రియాక్షన్!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి