ప్రముఖ దర్శకులు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలియని తెలుగు సినిమా ప్రేక్షకులు ఎవరూ ఉండరని చెబితే అతిశయోక్తి కాదు. ఆయన గురించి అందరికీ తెలుసు. మరి, ఆయన ఫ్యామిలీ గురించి? ఫ్యామిలీ, పర్సనల్ విషయాల గురించి త్రివిక్రమ్ తక్కువ మాట్లాడతారు. ఆయన భార్య 'సిరివెన్నెల' సీతారామ శాస్త్రికి స్వయానా సోదరుని కుమార్తె. ఆవిడ పేరు సౌజన్య. క్లాసికల్ డాన్సర్. గతంలో కొన్ని నృత్య ప్రదర్శన(క్లాసికల్ డాన్స్ పెర్ఫార్మన్స్)లు ఇచ్చారు. ఇప్పుడు మరో నృత్య  ప్రదర్శనకు రెడీ అయ్యారు.


పసుమర్తి రామలింగ శాస్త్రి దర్శకత్వంలో 'మీనాక్షీ కల్యాణం' నృత్యరూపక ప్రదర్శన ఇవ్వడానికి సౌజన్యా శ్రీనివాస్ రెడీ అయ్యారు. ఈ నెల 17న శిల్పకళా వేదికలో ప్రదర్శనకు అన్ని ఏర్పాట్లు చేశారు. సాయంత్రం ఆరు గంటలకు ప్రదర్శన మొదలు కానుంది. గతంలోనూ ఇటువంటి ప్రదర్శనలు సౌజన్యా శ్రీనివాస్ ఇచ్చారు. అయితే... చాలా లౌ ప్రొఫైల్ మెయింటైన్ చేస్తారు. త్రివిక్రమ్ భార్యగా కాకుండా నృత్య కళాకారిణిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఆమె సొంతం చేసుకున్నారు.


త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలకు వస్తే... పవన్ కల్యాణ్, రానా హీరోలుగా నటించిన 'భీమ్లా నాయక్'కు స్క్రీన్ ప్లే, సంభాషణలు అందించారు. మహేష్ బాబు 'సర్కారు వారి పాట' పూర్తి  చేసిన తర్వాత ఆయనతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఆ సినిమా స్టార్ట్ కావచ్చని అంటున్నారు. ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ ప్రొడ్యూస్ చేయనుంది. గత ఏడాది సంక్రాంతికి 'అల... వైకుంఠపురములో' సినిమాతో  త్రివిక్రమ్ భారీ విజయం అందుకున్నారు. 


Also Read: బాలయ్యతో లెజెండరీ దర్శకుడు రాజమౌళి... త్వరలో ప్రోమో విడుదల
Also Read: వసుధారతో ప్రేమలో పడిన గౌతమ్, రిషి మనసులో మళ్లీ అలజడి మొదలు.. ఇంట్రెస్టింగ్ గా సాగిన 'గుప్పెండత మనసు' బుధవారం ఎపిసోడ్
Also Read: ప్రకాష్ రాజ్ ఆర్ధికసాయంతో బ్రిటన్లో చదివి ఉద్యోగం సాధించిన పేద యువతి... హ్యాట్సాఫ్ సర్
Also Read: కొంత మంది వెనక్కి తగ్గారు.. కానీ అఖండతో మేం డేర్ స్టెప్ వేశాం: టిక్కెట్ల విధానంపై బాలయ్య
Also Read: దీప చేతిలో మోనిత బిడ్డ, సౌందర్య ఇంట్లో మోనిత, టార్గెట్ ఫిక్స్ చేసిన రుద్రాణి.. కార్తీక దీపం బుధవారం ఎపిసోడ్ లో ట్విస్టులే ట్విస్టులు...
Also Read: రాజమౌళి డైరెక్ష‌న్‌లో సినిమా ఎప్పుడు? ఇదీ అల్లు అర్జున్ రియాక్షన్! 
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి