ABP  WhatsApp

Lakhimpur Kheri Case: 'మైక్ బంద్ కరో బే..' ABP రిపోర్టర్‌పై కేంద్ర మంత్రి ఫైర్.. వీడియో వైరల్

ABP Desam Updated at: 15 Dec 2021 04:18 PM (IST)
Edited By: Murali Krishna

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా ABP మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరుష పదజాలంతో రిపోర్టర్లను దూషించారు.

మీడియాపై కేంద్ర మంత్రి ఫైర్

NEXT PREV

కేంద్రమంత్రి అజయ్ మిశ్రాను బర్తరఫ్ చేయాలనే డిమాండ్ ఊపందుకుంది. ఇప్పటికే విపక్ష సభ్యులు పార్లమెంటులో ఈ మేరకు డిమాండ్ చేస్తున్నారు. అయితే తాజాగా కేంద్రమంత్రి అజయ్ మిశ్రా మరో వివాదంలో చిక్కుకున్నారు.


లఖింపుర్ ఖేరీ ఘటనలో ప్రధాన నిందితుడైన తన కుమారుడు ఆశిష్ మిశ్రా గురించి ABP రిపోర్టర్ ప్రశ్నించగా అజయ్ మిశ్రా ఫైర్ అయ్యారు. అసభ్య పదజాలంతో దూషించారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.







నన్ను ఇలాంటి పిచ్చిపిచ్చి ప్రశ్నలు అడగొద్దు. నీకు ఏమైనా పిచ్చా? ముందు మైక్ ఆపుచేయరా?                                         - అజయ్ మిశ్రా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి






అంతటితో ఆగని మంత్రి.. సదరు జర్నలిస్ట్ చేతి నుంచి మైక్ లాక్కొనే ప్రయత్నం చేశారు. రిపోర్టర్లను దొంగలుగా అభివర్ణించారు. ఉత్తర్‌ప్రదేశ్ లఖింపుర్ ఖేరీలో ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభోత్సవానికి వచ్చారు అజయ్ మిశ్రా. ఆ సమయంలోనే రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.


పార్లమెంటులో..


లఖింపుర్ ఖేరీ ఘటనపై పార్లమెంటులో విపక్షాలు ఆందోళన చేశాయి. లోక్ సభలో ఘటనపై చర్చించాలని కాంగ్రెస్​తో పాటు విపక్షాలు డిమాండ్​ చేశాయి. ఈ మేరకు కాంగ్రెస్ నేత రాహుల్​ గాంధీ వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చారు. విపక్ష సభ్యులు వెల్​లోకి దూసుకెళ్లారు. దీంతో సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. మళ్లీ 2 గంటలకు సభ ప్రారంభం కాగా.. విపక్షాలు మాత్రం లఖింపుర్​ ఘటనపై చర్చకు పట్టుబట్టాయి. దీంతో లోక్​సభకు గురువారానికి వాయిదా వేశారు స్పీకర్​.



లఖింపుర్ ఖేరీ ఘటనకు కారకుడైన వ్యక్తి ఎవరి కుమారుడో ప్రజలకు తెలుసు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా రాజీనామా చేయాలి. ఇదే విషయంపై పార్లమెంట్​లో చర్చకు ప్రధాని మోదీ నిరాకరించారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు పోరాడతాం. రైతులు, ప్రతిపక్షాల ఒత్తిడితోనే కేంద్రం రైతు చట్టాలను వెనక్కు తీసుకుంది. ఇప్పుడు కూడా అలాంటి ఒత్తిడి చేస్తేనే కేంద్రం ఈ ఘటనపై చర్యలు తీసుకుంటుంది.                                            - రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్ర నేత


అది హత్యే..


లఖింపుర్ ఖేరిలో రైతులపైకి కేంద్ర మంత్రి కుమారుడి వాహనంతో దూసుకెళ్లిన ఘటన ముందస్తు ప్రణాళిక ప్రకారమే జరిగిందని దీనిపై విచారణ చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) స్పష్టం చేసింది. పక్కా ప్రణాళికాబద్ధంగా, ఉద్దేశపూర్వకంగానే ఈ ఘటన జరిగిందని.. నిర్లక్ష్యంతో కాదని తెలిపింది. ఈ నేపథ్యంలో నిందితులపై హత్యాయత్నం అభియోగాలు మోపేందుకు అనుమతించాలని చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్(సీజేఎం)ను సిట్ అధికారి విద్యారామ్ దివాకర్ అభ్యర్థించారు.


Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 6,984 కరోనా కేసులు నమోదు, 247 మంది మృతి


Also Read: Captain Varun Singh Death: కెప్టెన్ వరుణ్ సింగ్ మృతి.. తుదిశ్వాస వరకూ పోరాటమే


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Published at: 15 Dec 2021 04:09 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.