గుప్పెడంత మనసు డిసెంబరు 24 శుక్రవారం ఎపిసోడ్


రిషి-జగతి:
వసుధార వ్యక్తిత్వం మీద మచ్చ రాకూడదని మీరనుకుంటే తనని మీ ఇంట్లోంచి పంపించేయండని రిషి అంటాడు. ఈ విషయం నేను చెప్పానని తనకి తెలియకూడదంటాడు రిషి. తను బాధపడుతుందా, మీరు బాధపడతారా అని ఆలోచించడం లేదన్న రిషి... జ్వరం తగ్గాలంటే ఇంజెక్షన్ నొప్పిని భరించాలి ఇది కూడా అంతే అని జగతితో అంటాడు రిషి. సరిగ్గా అదే  సమయానికి మహేంద్ర, వసుధార అక్కడకు వస్తారు. వాళ్లని చూసి మాట మార్చిన రిషి..మేడం స్టోరీ బోర్డ్ కరెక్షన్ చేసి ఇవ్వండని చెబుతాడు.  అందరికీ నచ్చింది కదా అన్న మహేంద్రతో... మేడంకి కొన్ని సూచనలు చేశాను పాటిస్తారనే అనుకుంటున్నా అనేసి అక్కడినుంచి వెళ్లిపోతాడు. మేడం...రిషి సర్ స్టోరీ బోర్డ్ గురించి ఏమన్నారని అడుగుతుంది వసుధార. ఏదైనా కొత్త కాన్సెప్ట్ సార్ కి చెప్పారా అని అడిగితే రిషి సార్ కొత్త కాన్సెప్ట్ చెప్పారంటుంది జగతి. ఎలా ఉంది కొత్త  కాన్సెప్ట్ అని అడిగితే చాలా బావుందని చెబుతుంది జగతి. 


Also Read: వసుధారపై ప్రేమ.. జగతిపై కోపం.. చెలరేగిపోతున్న ఈగో మాస్టర్.. గుప్పెడంత మనసు డిసెంబరు 23 ఎపిసోడ్
రిషి-వసుధార:
ఇందాక కుంటుకుంటూ నడుస్తున్నావ్..అన్నింటినీ ఈజీగా తీసుకుంటావ్..నొప్పిగా ఉందా అని వసుధారని అడుగుతాడు రిషి. గోళీలను దాచుకున్నావ్ సరే..బ్యాగ్ లో వేసుకుని తిరగడం ఎందుకు, పుస్తకాల్లో నెమలి ఈకలు పెట్టుకుంటే చదువు వస్తుందన్నట్టు..గోళీలకు సెంటిమెంట్ ఏమైనా ఉందా అంటాడు. ఆ సౌండ్ బావుంటుందని పెట్టుకున్నా అంటుంది వసు. ఈ లోగా క్లాస్ రూమ్ లో వసుధార పడేసుకున్న గోళీలు రిషి ఇస్తే... జుట్టు ముడేసుకున్న టై తీసి వసు ఇస్తుంది. ఇంకా నయం ఈ టైని కూడా గోడకు అంటించి దానిపై డేట్ రాసి జ్ఞాపకం అనుకోలేదు..థ్యాంక్స్ అంటాడు. ఐడియా బావుంది సర్ నాకు తట్టలేదంటుంది వసుధార. ప్రతిసారీ పడిపోతుంటావ్ కదా డాక్టర్ కి చూపించుకో అనేసి వెళ్లిపోతాడు. 


Also Read:  వసుధారని ఇంట్లోంచి పంపించేయాలని జగతికి షాకిచ్చిన రిషి.. గుప్పెడంత మనసు డిసెంబరు 22 బుధవారం ఎపిసోడ్
గౌతమ్-రిషి:
బొమ్మ గీసే పనిలో పడతాడు రిషి ఫ్రెండ్ గౌతమ్.  పెద్ద పెయిటింగ్ సెటప్ పెట్టావేంటని రిషి అడిగితే బొమ్మ గీస్తా..అది చూసి నీ కళ్లు తిరుగుతాయి అంటాడు. అందమైన అమ్మాయి బొమ్మ గీస్తున్నా ఎలా ఉండాలో చెప్పమని అన్న గౌతమ్ తో... వసుధారని ఊహించుకుంటూ చెబుతాడు రిషి.  నీకు పోలిక కూడా చెప్పడం  రాలేదేంట్రా అని కామెంట్ చేశాడు. అమ్మాయిల గురించి తెలియని నిన్ను అందం గురించి అడిగా చూడు నాది బుద్ధి తక్కువ అనేసి బొమ్మ గీస్తాడు గౌతమ్.  రిషి మౌత్ ఆర్గాన్ వాయిస్తుండగా...గౌతమ్ బొమ్మ గీయడం పూర్తిచేస్తాడు. 


Also Read: రిషిని ఆలోచనలో పడేసిన మహేంద్ర మాటలు, వసు విషయంలో రిషి తీరుపై గౌతమ్ కి బోలెడు డౌట్స్, గుప్పెడంత మనసు డిసెంబరు 21 మంగళవారం ఎపిసోడ్…
రిషి ఇచ్చిన గోళీలు  చూసి వసుధార మురిసిపోతుంది. మరోవైపు రాత్రి నిద్రపోకుండా మెట్లపై కూర్చుని మౌత్ ఆర్గాన్ వాయించుకుంటాడు రిషి. ఇంకా పడుకోలేదా, మనసులో ఏం ఆలోచిస్తున్నాడో అని మహేంద్ర అనుకుంటాడు. గోళీలు, నెమలీకకు ఫొటో తీసి రిషికి పంపిస్తుంది. ఆ ఫొటో చూసిన రిషి.. ఫోన్ చేద్దామనుకుంటే ఏమో ఎవరు తీస్తారో అనే ఆలోచనలో పడతాడు. మరోవైపు జగతి... రిషి మాటలు గుర్తుచేసుకుని బాధపడుతుంటుంది. వసుని ఎందుకు హాస్టల్ కి పంపించమన్నాడు..అయినా వెళ్లమని వసుకి నేనెలా చెప్పగలను.. నావల్ల అవుతుందా అని అనుకుంటుంది. అటు వసుధార.. పిక్ చూసి కూడా రిప్లై ఇవ్వలేదనుకుంటుంది. మళ్లీ గుడ్ నైట్ అనే మెసేజ్ పెట్టేసి బయటకు వచ్చి చూస్తే జగతి మేడం అలా కూర్చుని ఉండడం చూస్తుంది. ఈ టైమ్ లో నిద్రపోకుండా ఏం చేస్తున్నారని అడిగిన వసుతో...ఎప్పుడూ ఒంటరిదాన్నే కదా అని బాధపడుతుంది. ఏం అయిందని వసుధార అడుగుతుంది. ఓ మాట చెబుతా వింటావా అన్న జగతితో..మీరు చెబితే వినకుండా ఉంటానా అంటుంది వసుధార. ఎపిసోడ్ ముగిసింది.


Also Read: వసు దగ్గర తగ్గలేక, నెగ్గలేక రిషి పాట్లు.. వసుధారకి క్లోజ్ అవుతున్న గౌతమ్.. గుప్పెడంత మనసు డిసెంబరు 20 సోమవారం ఎపిసోడ్
రేపటి ఎపిసోడ్
కాలేజీకి రెడీ అయిన జగతి దగ్గరకు వచ్చిన వసుధార..ఎక్కడికి అని అడుగుతుంది. కాలేజీకి వెళుతున్నా అంటే...నేను కూడా వస్తా అంటుంది వసుధార.నిత్యం కారులో తిరగడం అలవాటైందా.. నీకు నువ్వుగా రావడం నేర్చుకో..ఆటోలా రా అని చెబుతుంది. వసు షాక్ లో ఉండిపోతుంది. మరోవైపు జగతి వెళ్లగానే గౌతమ్-రిషి ఇంటికి వస్తారు. మేడం లేరా అని అడుగితే..కాలేజీకి వెళ్లారు సర్ అంటుంది వసుధార. నువ్వెలా వస్తావ్ అన్న రిషితో...ఇంకా నేను కార్లకు అలవాటు పడలేదు సార్ అని రిప్లై ఇస్తుంది. దీంతో తాను చెప్పిన పని జగతి మేడం మొదలు పెట్టారన్నమాట అనుకుంటాడు రిషి. 


Also Read: వసుధారతో ప్రేమలో పడిన గౌతమ్, రిషి మనసులో మళ్లీ అలజడి మొదలు.. ఇంట్రెస్టింగ్ గా సాగిన 'గుప్పెండత మనసు' బుధవారం ఎపిసోడ్
Also Read: సారీ చెప్పమంటున్న రిషి.. చెప్పేదే లే అంటున్న వసుధార... మిషన్ ఎడ్యుకేషన్ ఫొటోస్ లో రిషి-నువ్వే ఉన్నారు జగతి మేడం కనిపించలేదన్న గౌతమ్, గుప్పెడంత మనసు డిసెంబరు 18 శనివారం ఎపిసోడ్
Also Read: శౌర్య, హిమపై కన్నేసిన రుద్రాణి, కన్నీళ్లు పెట్టుకున్న డాక్టర్ బాబు, దీప ఏం చేయబోతోంది.. కార్తీకదీపం డిసెంబరు 20ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
Also Read: ఆ బిడ్డకు తండ్రిని నేను కాదన్న డాక్టర్ బాబు దగ్గరకే చేరిన వారసుడు- ప్రశ్నించిన దీప.. న్యాయం చేయాలంటూ అత్తింట్లో శోకాలు పెట్టిన మోనిత.. కార్తీకదీపం డిసెంబరు 16 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
Also Read:  దీప చేతిలో మోనిత బిడ్డ, సౌందర్య ఇంట్లో మోనిత, టార్గెట్ ఫిక్స్ చేసిన రుద్రాణి.. కార్తీక దీపం బుధవారం ఎపిసోడ్ లో ట్విస్టులే ట్విస్టులు...
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి