గుప్పెడంత మనసు డిసెంబరు 21 మంగళవారం ఎపిసోడ్


రిషి-మహేంద్ర-గౌతమ్: వసుధారతో పెద్దమ్మకి సారీ చెప్పిస్తారా లేదా అని పట్టుబడతాడు రిషి. కొంచెం శాంతంగా, సావధానంగా ఆలోచించు అనేలోగా డాడ్ కొటేషన్స్ వద్దని మళ్లీ సారీ చెప్పించాలనే మంకు పట్టుపడతాడు రిషి. ఇంతలో అక్కడికి వచ్చిన గౌతమ్ నాకో చిన్న హెల్ప్ చెయ్ రా..కారుతో పాటూ కంపెనీ కూడా కావాలని అంటాడు. రాను అని రిషి అనగానే థ్యాంక్స్ అనేసి అంకుల్ మనం వెళదాం వసుధారతో కాఫీ పార్టీ అనగానే రిషి పేపర్ వెయిట్ ని కిందకు వదిలేస్తాడు. టేబుల్ పై నుంచి జారి పడుతున్న పేపర్ వెయిట్ పట్టుకున్న మహేంద్ర.. చేయి జార్చుకోవడం ఈ జీ రిషి కానీ అంతే పదిలంగా అన్నీ తిరిగి దొరకవు వస్తువులైనా-బంధువులైనా అని అంటాడు. అంకుల్ రండి వెళదాం ఏంటే మహేంద్ర రిషి వైపు చూస్తాడు.. ఛైర్ లోంచి లేచిన రిషి పద వెళదాం అనగానే రానన్నావ్ కదా అన్న గౌతమ్ తో ఇప్పుడు వస్తున్నా కదా అని రిషి అంటాడు. 


Also Read: వసు దగ్గర తగ్గలేక, నెగ్గలేక రిషి పాట్లు.. వసుధారకి క్లోజ్ అవుతున్న గౌతమ్.. గుప్పెడంత మనసు డిసెంబరు 20 సోమవారం ఎపిసోడ్
రెస్టారెంట్లో: అదిగో అక్కడుందిరా వసుధార అంటాడు గౌతమ్. ఎందుకు అరుస్తావ్ అని రిషి అంటే వసు కనిపించగానే ఆనందం అలా పొంగుకొచ్చిందంటాడు గౌతమ్. ఓ టేబుల్ దగ్గర కూర్చుందామని వెళితే ఇది వసుధార టేబుల్ కాదు అక్కడ కూర్చుందాం అంటాడు. వసుధార ఈ టేబుల్ అని ఎలా తెలుసు, నువ్వు రోజూ వస్తుంటావా, మీ ఇద్దరూ బాగా క్లోజా అంటాడు గౌతమ్. అన్నింటికీ నేను చెప్పానా అలా అని తప్పించుకుంటాడు రిషి. వసుధార చిరునవ్వు చాలా బావుంటుంది కదరా అంటే నాకేం అలా అనిపించదంటాడు రిషి. ఇంతలో టేబుల్ దగ్గరకి వచ్చిన వసుధారతో ఫుడ్ ఐటెమ్స్ గురించి కాసేపు డిస్కస్ చేసి  ఓసారి మెనూ తీసుకురా అంటాడు గౌతమ్. ఏం వద్దు కాఫీ చాలంటాడు రిషి.  కాఫీతో పాటూ మీ కంపెనీ కూడా కావాలని అడుగుతాడు గౌతమ్. కోప్పడిన రిషి ఇక్కడ నేనెందుకు అని గౌతమ్ ఆపినా ఆగకుండా  లేచి బయటకు వెళ్లిపోతాడు. రిషి సర్ ఉంటే బావుండును వెళ్లొద్దని చెప్పలేను నేను ఆగమంటే ఏమంటారో అనుకున్న వసు మీరు అపొచ్చుకదా అని గౌతమ్ తో అంటుంది. వెళ్లనీ వసుధార మన అభిప్రాయాలు ఎదుటివారిపై రుద్దకూడదు అంటాడు గౌతమ్.


బయటకు వచ్చేసిన రిషి..నేనేదో కోపంలో వచ్చేశాను కదా ఆగండి, కూర్చోండి అనొచ్చుగా వెళితే వెళ్లనీ అనుకుందా అనుకుని కారు తీద్దామనుకుంటాడు. అసలే గౌతమ్ కి దూకుడెక్కువ-వసుకి పొగరెక్కువ అనుకుంటాడు..కాఫీ తాగుతారో గొడవే పడతారో నాకేంటి నేనెళ్లిపోతా అని కార్ తీస్తాడు. టేబుల్ దగ్గరకి వచ్చిన వసుని చూసి గౌతమ్.. వెయిటర్ డ్రెస్సులో కూడా నువ్వు అందంగా ఉన్నావని పొడుగుతాడు.. ఆర్డర్ ప్లీజ్ అంటుంది వసుధార. పొగిడినా సమాధానం చెప్పలేదనుకుంటాడు గౌతమ్. కాఫీ-టీ ఏది బావుంటుందని గౌతమ్ అడిగితే మూడు కాఫీ అని చెప్పి మళ్లీ రిషీ ఎంట్రీ ఇస్తాడు. నన్ను వదిలి వెళ్లవని నాకు తెలుసురా అని గౌతమ్ అంటే.. నీకోసం కాదురా మళ్లీ మీ ఇద్దరి కొత్త తలనొప్పులు వస్తాయని వచ్చా అనుకుంటాడు రిషి. 


Also Read: వసుధారతో ప్రేమలో పడిన గౌతమ్, రిషి మనసులో మళ్లీ అలజడి మొదలు.. ఇంట్రెస్టింగ్ గా సాగిన 'గుప్పెండత మనసు' బుధవారం ఎపిసోడ్
జగతి-మహేంద్ర: రిషి చెప్పినట్టు వసుధారతో దేవయాని అక్కయ్యకి సారీ చెప్పిస్తావా మహేంద్ర అని అడుగుతుంది జగతి. రిషి అన్న మాట నీతో చెప్పాను కానీ వసు సారీ చెప్పాలని అనలేదు కదా అంటుంది. రిషి మాటల ఇక్కడ చెప్పడంతో నీ పని అయిపోలేదు..అక్కడ జరిగినదాంట్లో మా తప్పేమీ లేదని నువ్వు అర్థమయ్యేలా చెప్పాలి అంటాడు మహేంద్ర. సమయం, సందర్భం కోసం అన్ని సందర్భాల్లో ఎదురుచూడకూడదు ఎదురెళ్లాలి సందర్భాన్ని నువ్వే కల్పించుకోవాలి మహా అయితే కోప్పడతాడు అంతకన్నా ఏం జరుగుతుందని జగని అంటుంది. రిషిని డీల్ చేయడం అంత ఈజీ కాదంటాడు మహేంద్ర. ఇటు వసు-అటు రిషి ఇద్దరూ మొండికేస్తే సమస్య తీరదన్న జగతితో...రిషిలో మార్పు వచ్చింది కానీ వదిన విషయంలో మాత్రం ఎవ్వరి మాటా వినేలా లేడు అదీ ప్రాబ్లెం, వదిన అంటే రిషికి నమ్మకం, ప్రేమ అంటాడు మహేంద్ర. 


Also Read: వసుధార కౌంటర్లకి విలవిల్లాడుతున్న ఇగోమాస్టర్ రిషి.. వసుని చూసి మురిసిపోతున్న గౌతమ్, గుప్పెడంత మనసు డిసెంబరు 16 గురువారం ఎపిసోడ్
దేవయాని అక్కయ్యమీద ప్రేమంతా నాపై ద్వేషంగా మారుతోంది..చిన్నప్పటి నుంచీ రిషిని నువ్వు కరెక్ట్ గా చూసుకోలేదన్న డౌట్ వస్తోందని జగతి బాధపడుతుంది. దేవయాని అక్కయ్యకి వదిలేశావ్..ఆమె తనకి నచ్చిన శిల్పంలా మార్చింది..ప్రతి విషయాన్ని మనసులోనే దాచుకుంటాడు, బయటకు చెప్పకుండా భారం మోస్తూ తనలో తానే కుమిలిపోతాడు. తన మనసులో భారం తగ్గించేందుకు అయినా జరిగింది చెప్పు అంటుంది జగతి. కుదర్లేదు అనొద్దు మహేంద్ర... రిషి మనసులో బాధపడుతున్నాడన్న ఊహే భరించలేను.. ఈ గొడవ కూడా రిషి-వసు మధ్య దూరం పెరుగుతుంది, రిషి ఎలా తట్టుకుంటాడో ఆలోచించు అని మహేంద్రకి చెబుతుంది. తిడితే పడు వాడి మనసులో భారాన్ని నువ్వే తీయగలవు తొందరపడు మహేంద్ర అని చెబుతుంది జగతి. ఇప్పటి వరకూ కష్టపడి వసుధార రిషిని మార్చగలిగింది, ఈ గొడవ పుణ్యమా అని ఇద్దరి మధ్యా దూరం పెరిగితే మళ్లీ ప్రమాదమే అని ఆలోచనలో పడతాడు మహేంద్ర


Also Read: సారీ చెప్పమంటున్న రిషి.. చెప్పేదే లే అంటున్న వసుధార... మిషన్ ఎడ్యుకేషన్ ఫొటోస్ లో రిషి-నువ్వే ఉన్నారు జగతి మేడం కనిపించలేదన్న గౌతమ్, గుప్పెడంత మనసు డిసెంబరు 18 శనివారం ఎపిసోడ్
రెస్టారెంట్ నుంచి వసుధారని ఇంటి దగ్గర దించుతాడు రిషి. గౌతమ్ కూడా కిందకు దిగి వసుని వాళ్ల వాళ్లకి అప్పగించి వస్తానంటాడు. ఇక్కడ వాళ్ల అమ్మానాన్న ఎవ్వరూ ఉండరని చెప్పిన రిషితో .. కరెక్ట్ గా వాళ్లింటి ముందు ఆపావ్ నువ్ రెగ్యులర్ గా వాళ్లింటికి వస్తావా అన్న గౌతమ్ తో బై గౌతమ్ సార్ అనేసి వసుధార వెళ్లిపోతుంది. బై వసుధార అనేసి గౌతమ్ కూడా వసుతో పాటే వెళతాడు. ఇంతలో డోర్ ఓపెన్ చేసి జగతి-మహేంద్ర బయటకు వస్తుంటే రిషి-వసు-గౌతమ్ చూస్తుండిపోతారు. గౌతమ్ షాక్ లో ఉండిపోతాడు.


రేపటి (బుధవారం) ఎపిసోడ్  లో
అంకుల్ ప్రేమలో పడితే చుట్టూ ఉన్న ప్రపంచం అందంగా కనిపిస్తుందంటారు నిజమేనా అన్న గౌతమ్ తో ఇప్పుడు ప్రేమ గురించి ఎందుకు అని ప్రశ్నిస్తాడు మహేంద్ర. రిషి ఇంత పొద్దున్నే ఎక్కడకు వెళ్లాడని వాళ్లిద్దరూ డిస్కస్ చేసుకుంటుండగా..రిషి కారు జగతి ఇంటి ముందు ఆగుతుంది. వసు బయటకు రావడంతో మాట్లాడాలి అని చెప్పి తీసుకెళతాడు. 


Also Read: రిషి-వసుధార మధ్య చిచ్చుపెట్టేందుకు జగతిని టార్గెట్ చేసిన దేవయాని సక్సెస్ అయిందా.. గుప్పెడంత మనసు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే…
Also Read: శౌర్య, హిమపై కన్నేసిన రుద్రాణి, కన్నీళ్లు పెట్టుకున్న డాక్టర్ బాబు, దీప ఏం చేయబోతోంది.. కార్తీకదీపం డిసెంబరు 20ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
Also Read: ఆ బిడ్డకు తండ్రిని నేను కాదన్న డాక్టర్ బాబు దగ్గరకే చేరిన వారసుడు- ప్రశ్నించిన దీప.. న్యాయం చేయాలంటూ అత్తింట్లో శోకాలు పెట్టిన మోనిత.. కార్తీకదీపం డిసెంబరు 16 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
Also Read:  దీప చేతిలో మోనిత బిడ్డ, సౌందర్య ఇంట్లో మోనిత, టార్గెట్ ఫిక్స్ చేసిన రుద్రాణి.. కార్తీక దీపం బుధవారం ఎపిసోడ్ లో ట్విస్టులే ట్విస్టులు...
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి